Top 5 Headlines Today: 9 ఏళ్లు గడుస్తున్న తీరని విభజన సమస్యలు! పోలవరం ఎత్తు 41.15 మీటర్ల వరకేనా ? టాప్ 5 హెడ్ లైన్స్
Top 5 Telugu Headlines Today 02 June 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
ఇది నవీన తెలంగాణ, దేశానికి స్ఫూర్తినిస్తున్న తెలంగాణ: సీఎం కేసీఆర్
స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు. ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలకు నమస్కరించారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా పాలన సాగిస్తుందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి వేడుకల ప్రారంభానికి ముందు హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమర వీరులకు సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు. అక్కడ పుష్పాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సచివాలయానికి చేరుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. ప్రతి రంగంలో దేశం నివ్వెరపోయే ఫలితాలు సాధించి ప్రగతి పథంలో దూసుకెళ్తోందన్నారు సీఎం. అందుకే తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను స్మరించుకోవడానికి 22 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
గుంటూరులో వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం ప్రారంభించిన సీఎం జగన్
చిన్న రైతులకు మేలు జరిగేలా ఖర్చు తగ్గించేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించారు. గుంటూరులోని చుట్టుగుంట సెంటర్‌లో ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను జెండా ఊపి సీఎం జగన్ ప్రారంభించారు. వ్యవసాయంలో వంద శాతం యాంత్రీకరణ జరిగేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు సీఎం జగన్. ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ కింద రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు సీఎం జగన్. ఆ రైతన్నలే గ్రూపు కింద మారి ఆర్బీకే పరిధిలో ఉన్నమిగిలిన రైతులకు కూడా యంత్రాలన్నీ అందుబాటులోకి తీసుకొస్తారని తెలిపారు. 10,444 ఆర్బీకేల పరిధిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ పరిధిలో రైతన్నలే ఈ వ్యవసాయ పనిముట్లన్నీ తక్కువ ధరకు అద్దెకు ఇస్తారని వివరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
9 ఏళ్లు గడుస్తున్న తీరని విభజన సమస్యలు.. ఎవరు అడ్డుపడుతున్నారు..?
ఉమ్మడి రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు గడించింది. పదో ఏట అడుగు పెట్టింది. విభజన సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారయ్యాయి. ఈ 9 ఏళ్ల కాలంలో... తెలంగాణ, ఏపీ ప్రభుత్వం మధ్య 29 సార్లు మీటింగ్స్ జరిగినప్పటికీ.. పరిష్కారం మాత్రం దొరకలేదు. ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9 ,10లో ఉన్న సమస్యలు ఇంకా అలాగే పెండింగ్ లో ఉన్నాయి.వీటిలో ఉన్న ప్రధాన సమస్యలేంటి..? అవి ఎందుకు క్లియర్ కావట్లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం..! పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
పోలవరం ఎత్తు 41.15 మీటర్ల వరకేనా ? - ఆ మేరకే కేంద్రం నిధులిస్తుందన్న జీవీఎల్ !
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం త్వరలో రూ. 12 వేల కోట్ల రూపాయలు ఇస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. పోలవరంపై ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశం ముగిసిన తర్వాతి రోజే జీవీఎల్ నరసింహారావు ఈ ప్రకటన చేశారు. పోలవరం కోసం మొత్తంగా రూ. 12, 911 వేల కోట్లను కేంద్రం ఇవ్వబోతోందని ఆయన తెలిపారు. దీని వల్ల 41.15 ఎత్తులో నీటి నిల్వ చేసుకునేందుకు అవసరమైన నిధులను ఇవ్వబోతోందన్నారు. తొలిదశ పోలవరం నిర్మాణం, ఢయాఫ్రం వాల్ మరమ్మతుల కోసం ఈ నిధులు ఇస్తోందన్నారు. త్వరలో కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకోబోతున్నారని ఆయన తెలిపారు. పోలవరంలో పూర్తి స్థాయి నీటి నిల్వ చేసుకునేలా అవసరమైన నిధులు, అనుమతులు, అంతరాష్ట్ర వివాదాలను కేంద్రం పరిష్కరిస్తుందని ప్రకటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ప్రతిపక్షాలు అమ్ముడుపోతేనే వైఎస్‌ఆర్‌టీపీ పుట్టింది: వైఎస్ షర్మిల
వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరిపారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొని... జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల ఫొటోలకు పూలమాలలు వేశారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ... నీళ్లు, నిధులు, నియామకాల కోసం మూడు కోట్ల మంది ఏకమై.. కొట్లాడితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని తెలిపారు. అమర వీరుల త్యాగ ఫలితం, సబ్బండ వర్గాల పోరాట ఫలితమే "తెలంగాణ" అని చెప్పుకొచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి