News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Telangana Decade Celebrations: 9 ఏళ్లు గడుస్తున్న తీరని విభజన సమస్యలు.. ఎవరు అడ్డుపడుతున్నారు..?

9ఏళ్ల కాలంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వం మధ్య 29 సార్లు మీటింగ్స్ జరిగినప్పటికీ చాలా సమస్యలకు పరిష్కారం దొరకలేదు. ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9 ,10లో ఉన్న సమస్యలు ఇంకా అలాగే పెండింగ్ లో ఉన్నాయి.

FOLLOW US: 
Share:

Telangana Decade Celebrations: ఉమ్మడి రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు గడించింది. పదో ఏట అడుగు పెట్టింది. విభజన సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారయ్యాయి. ఈ 9 ఏళ్ల కాలంలో...  తెలంగాణ, ఏపీ ప్రభుత్వం మధ్య 29 సార్లు మీటింగ్స్ జరిగినప్పటికీ..  పరిష్కారం మాత్రం దొరకలేదు. ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9 ,10లో ఉన్న సమస్యలు ఇంకా అలాగే పెండింగ్ లో ఉన్నాయి.వీటిలో ఉన్న ప్రధాన సమస్యలేంటి..? అవి ఎందుకు క్లియర్ కావట్లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం..!

1. దిల్లీలోని ఏపీ భవన్..!
విభజన తరువాత ఏపీ భవన్ రెండు బ్లాక్లులుగా విడగొట్టారు. ఏపీకి  8.7 ఎకరాలకు.... తెలంగాణకు 4.38 ఎకరాలు వచ్చాయి. మెుత్తంగా..1703 కోట్ల విలువైన ఆస్తులు ఏపీకీ.. 1614 కోట్ల విలువైన ఆస్తులు తెలంగాణకు వచ్చాయి. ఐతే.. ఇప్పుడు ఏపీ భవన్ మెుత్తం తమకే హ్యాండోవర్ చేయాలని తెలంగాణ సర్కార్ అడుగుతోంది. కావాలంటే వేరే చోట స్థలం, మార్కెట్ రేట్ ను బట్టి డబ్బులు చెల్లిస్తామని చెబుతోంది. హైదరాబాద్ హస్ కు పక్కనే ఇది ఉండటంతో ఎమోషన్ లా బాండింగ్ ఉందని తెలంగాణ సర్కార్ చెబుతోంది. ఏపీ సర్కార్ మాత్రం దీనికి ఒప్పుకోవట్లేదు.

2. నదీ జలాల్లో వాటా...!  
విభజన అనంతరం 2015లో కృష్ణ , గోదావరి జలాల్లో తెలంగాణకు 34 శాతం వాటా.. ఏపీకి 66 శాతం వాటాగా జలాలు పంచుకోవాలని కేంద్ర జలమంత్రిత్వశాఖ సూచించింది. దీనికి రెండు ప్రభుత్వాలు అంగీకరించాయి. ఐతే..దీనిని తప్పకుండా ప్రతిసంవత్సరం సమీక్షించాలని కేంద్రం  స్పష్టం చేసింది.  కానీ, ఇప్పటికీ అదే వాటా కొనసాగుతుండటంతో నీళ్లలో సమాన వాటా కావాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.  2014లో ఇద్దరు చంద్రులు ముఖ్యమంత్రలయ్యాక... వారి మధ్య రాజకీయ వైరం.. విభజన చట్టంలో సమస్యలపై పడింది. 2019లో ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక.. సీఎం కేసీఆర్ -జగన్ మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. పలుమార్లు విభజన సమస్యలపై మాట్లాడుకున్నారు కూడా. ముఖ్యంగా గోదావరి నదిపై కట్టే ప్రాజెక్టులు, గోదావరి నీళ్లలో వాటా గురించి చర్చ జరిగింది. ఇలా చర్చలు నడుస్తుండగానే.. మే 2020 లో కృష్ణానదిపై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద నది జలాలను మళ్లించేందుకు జగన్ సర్కార్  ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు..పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కు వ్యతిరేకంగా కేసులు వేసింది.  దీంతో... కేసీఆర్, జగన్ సర్కార్ కు మధ్య దూరం పెరిగింది.

3.నిధుల్లో వాటా..!
ఉమ్మడి ఆస్తులు ప్రధానంగా హైదరాబాద్ లోనే ఉన్నాయి. పునర్విభజన చట్టం కింద ఉమ్మడి సంస్ధలు  సుమారు  245 సంస్థలు ఉన్నాయి.  వాటి విలువ దాదాపుగా  లక్ష 42వే ల కోట్లు ఉంటుంది. ఐతే వీటన్నింటీని ఒకేసారి విభజించాలని ఏపీ సర్కార్ డిమాండ్ చేస్తోంది. అది కూడా జనాభా ప్రతిపాదికన. అలా ఐతే..ఏపీలో జనాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఏపీకే ఎక్కువ వాటా వెళ్తుందని తెలంగాణ సర్కార్ అడ్డుపడుతోంది. అలాగే, డెక్కన్ ఇన్ ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ - DILలో 5వేల కోట్ల షేర్,  APSFC కింద ఉన్న  238 ఏకరాల ల్యాండ్ ఏపీ అడుగుతోంది. ఐతే..!ఉమ్మడిగా బ్యాంకుల్లో నిల్వ ఉన్న రిజర్వుల్లో వాటా అడగండి తప్పా మిగతా ఆస్తుల్ని కాదని వాదిస్తోంది. ఎందుకంటే.. తెలంగాణ భూభాగంలో ఉన్న ఆస్తులు.. తమకే చెందుతున్నాయని  టీఎస్ సర్కార్ చెబుతోంది.

4. కరెంట్ కష్టాలు..!
2014 జూన్ 2న రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత.. తెలంగాణకు అధిక విద్యుత్ డిమాండ్ ఉండటంతో.. కొంత శాతం కరెంట్ ను
ఏపీ ప్రభుత్వం 3 ఏళ్లపాటు సరఫరా చేసింది. అంటే..2017 జూన్ 10 వరకు. ఐతే.. వీటి డబ్బులు తెలంగాణ సర్కార్ చెల్లించట్లేదు. దీంతో..  తెలంగాణ సర్కార్ ఏపీ ప్రభుత్వానికి సుమారు 6వేల750కిపైగా కోట్లు చెల్లించాలని కేంద్ర విద్యుత్ శాఖ 2022 ఆగస్టులో సూచించింది. ఐతే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీనిపై హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత.. బయటి మార్కెట్ నుంచి కరెంట్ కొనుగోలుకు
సుమారు 4వేల 740 కోట్లు తెలంగాణ సర్కార్ ఖర్చు చేసింది. అలాగే, ప్రస్తుతం కేంద్రం కట్టాలని ఆదేశించినవి కాకుండానే ఏపీ నుంచి తమకు 12 వేల 490 కోట్లు రావాలని తెలంగాణ వాదిస్తోంది.ఇలా..ప్రధాన సమస్యలన్ని అలాగే మిగిలాయి.

ఫైనల్ చెప్పేదేంటంటే..!
తొండో బొండో.. తేల్చేసుకుందామని ఏపీ సర్కార్ భావించట్లేదు. నయానో బయానో ఇచ్చేసి క్లియర్ చేసుకుందామని తెలంగాణ ప్రభుత్వం అనుకోవట్లేదు. అందుకే..9 ఏళ్లు గడుస్తున్నా ఈ లోల్లి తేలట్లేదు.

Published at : 02 Jun 2023 09:16 AM (IST) Tags: BJP CONGRESS ANDHRA PRADESH Telangana Formation Day Celebrations BRS KCR Jagan Chandra Babu Telangana Decade Celebrations

ఇవి కూడా చూడండి

Mynampally Hanumantha Rao:  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!

CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!

TSPSC: 'గ్రూప్‌-1' పరీక్షలో అవకతవకలు జరగలేదు, టీఎస్‌పీఎస్సీ వివరణ

TSPSC: 'గ్రూప్‌-1' పరీక్షలో అవకతవకలు జరగలేదు, టీఎస్‌పీఎస్సీ వివరణ

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

TDP News: బుర్రకథల మంత్రి అసెంబ్లీలో కాగ్ నివేదికలు మాట్లాడరా? - టీడీపీ ఎమ్మెల్సీ

TDP News: బుర్రకథల మంత్రి అసెంబ్లీలో కాగ్ నివేదికలు మాట్లాడరా? - టీడీపీ ఎమ్మెల్సీ

టాప్ స్టోరీస్

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Kotamreddy :  చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత -  కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర

Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర