News
News
వీడియోలు ఆటలు
X

Top 5 Headlines Today: భోగాపురం పోర్టుకు శంకుస్థాపన, రైతులకు సీఎం కేసీఆర్ హామీ - ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేత!

Top 5 Headlines Today 3rd May 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

FOLLOW US: 
Share:

గత ప్రభుత్వ నిర్ణయాలపై వేసిన సిట్‌ను సమర్ధించిన సుప్రీం- హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేత
గత ప్రభుత్వం హయాంలో జరిగిన పనులపై ప్రస్తుతం జగన్ ప్రభుత్వం వేసిన సిట్‌ వేయడంపై సుప్రీం కీలక ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ తీర్పు వెల్లడించింది. హైకోర్టు తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చాలా పనుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వం గతేడాది సిట్ ఏర్పాటు చేసింది. 
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కీలక నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణంసహా భారీ ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్‌ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ సిట్‌ ఏర్పాటుపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీన్ని విచారించిన జస్టిస్ ఎం. ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇంకా చదవండి
వివేకా హత్య కేసులో ఏం జరగబోతోంది ? హైకోర్టు సీనియర్ లాయర్ రచనారెడ్డి ఏం చెప్పారంటే ?
మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దూకుడు పెంచింది. వచ్చే నెల 30వ తేదిలోపు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.  ఓ వైపు ఆధారాలను పరిశీలిస్తూనే మరో వైపు సాక్ష్యలను ప్రశ్నించే పనిలో సీబీఐ బిజీగా ఉంది.  ఈ కేసులో తదుపరి ఏం జరగబోతోందన్న దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. దీనిపై  ప్రముఖ హైకోర్టు న్యాయవాది రచనా రెడ్డి తో ABP దేశం  మాట్లాడింది. రచనారెడ్డి విశ్లేషణ ప్రకారం 

సీబీఐ, ఈడీ దర్యాప్తుల్లో కోర్టులు జోక్యం చేసుకోవు : రచనా రెడ్డి 
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ, కోర్టు స్పందన చూస్తుంటే కేసు న్యాయపరంగా సరైన రీతిలోనే నడుస్తోందనిపిస్తోంది. సిబిఐ, ఈడి వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్దలు చేపట్టిన దర్యాప్తులో కోర్టులు జోక్యం చేసుకునే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దాదాపు జోక్యం చేసుకోవనే చెప్పాలి. గతంలో మానవ హక్కుల ఉల్లంఘన  జరుగుతున్నాయనే ఆరోపణలు వచ్చినప్పుడు, వాటికి ఆధారాలున్నప్పుడు, లేదా కస్ట్డడీలో ఉన్నప్పుడు వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు,వాటికి ఆధారాలు చూపినప్పుడు మాత్రమే అదికూడా కొంత వరకూ కోర్టులు  జోక్యం చేసుకునేవి. ఇప్పుడు ప్రతీ సిబిఐ, ఈడీ  విచారణలు వీడియో , ఆడియో రికార్డింగ్ జరుపుతున్నారు.  కాబడ్డి మానవ హక్కుల ఉల్లంఘన, వేధింపులకు అవకాశమే లేదు కాబట్టి ఇప్పుడున్న పరిస్దితిలో సిబిఐ విచారణలో కోర్టులు దాదాపు జోక్యం చేసుకోవనే చెప్పాలి. ఇంకా చదవండి

తడిసిన ధాన్యాన్ని కొంటామని రైతులకు సీఎం కేసీఆర్ భరోసా
రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు. మామూలు వరి ధాన్యానికి చెల్లించినట్లుగానే తడిసిన ధాన్యానికి కూడా ధర చెల్లిస్తామని వివరించారు. వ్యవసాయాన్ని కాపాడుతూ... కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు, అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన వరి ధాన్యం సేకరణ, భవిష్యత్తులో యాసంగి వరి ముందస్తుగా కోతలకు వచ్చేలా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో యాసంగి వరి కోతలు మార్చి నెలలోపే పూర్తయ్యేలా ఎలాంటి విధానాలు అవలంభిచాలో అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఈ దిశగా రాష్ట్ర రైతాంగాన్ని కూడా చైతన్యం చేయాలని చెప్పారు.   ఇంకా చదవండి  

భోగాపురం శంకుస్థాపన చేసింది మేమే- ప్రారంభించబోయేది కూడా మేమే: జగన్
2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో భోగాపురంలో నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన జగన్ ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఉత్తరాంధ్రలో వచ్చి స్థిరపడేలా అభివృద్ధి జరగబోతోందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు మూడేళ్లలో పూర్తై విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది. ఇవాళ ఇక్కడ పునాది రాయి వేశాం.. మళ్లీ 2026లో మళ్లీ ఇక్కడికే వచ్చి ఇదే ప్రాజెక్టును ప్రారంభించబోతున్నాం. ప్రజల దీవెనులు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఎవరూ ఏం చేయలేరన్నారు. 
భోగాపురంపై టీడీపీ హయాంలోనే ప్రక్రియ పూర్తై ఉంటే పనులు ఎందుకు సాగలేదని ప్రశ్నించారు జగన్. కోర్టుల్లో కేసులను పరిష్కరించుకుంటూ వచ్చామన్నారు. భూసేకరణ పూర్తి చేశామన్నారు. అన్ని అనుమతులు తీసుకొచ్చామని తెలిపారు. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి ఈ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ఇవన్నీ కాకుండానే ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు మాత్రమే టెంకాయ కొట్టి వెళ్లిపోయారని చంద్రబాబును ఎద్దేవా చేశారు. మళ్లీ ఏ మాత్రం సిగ్గులేకుండా గతంలోనే శంకుస్థాపన చేశామని చెప్పుకోవడం దారుణమైన రాజకీయాలు ప్రపంచంలోనే ఎక్కడా ఉండబోవన్నారు.   ఇంకా చదవండి   

యాదాద్రిలో ఆటోల‌ను తిరిగి కొండ‌పైకి అనుమతిస్తాం, ఆటో డ్రైవర్లకు భట్టి విక్రమార్క హామీ
ఆరు నెలల్లో తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, యాదాద్రిలో ఆటోల‌ను తిరిగి కొండ‌పైకి అనుమ‌తిస్తామ‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చాక వారి అన్ని సమస్యలు తీరుస్తామన్నారు. కాంగ్రెస్ నేత భ‌ట్టి విక్ర‌మార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర నేటితో 48వ రోజుకు చేరుకుంది. ఈక్రమంలోనే భట్టి విక్రమార్క బుధవారం ఉద‌యం యాద‌గిరి గుట్ట‌లో శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి ద‌ర్శ‌నం చేసుకున్నారు. అనంతరం పాద‌యాత్ర‌గా ముందుకు సాగారు.

గ‌త 405 రోజులు నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఆటో డ్రైవ‌ర్లు.. సీఎల్పీ నేత వ‌ద్ద‌కు త‌మ క‌ష్టాన్ని, బాధ‌ల‌ను చెప్పుకున్నారు. యాద‌గిరి గుట్ట ఆల‌యాన్ని ప్రారంభించిన మ‌రుస‌టి రోజు నుంచి కొండ‌పైకి ఆటోల రాక‌పోక‌ల‌ను ఈ ప్ర‌భుత్వం నిషేధించిందని.. దీనివ‌ల్ల త‌మ బ‌తుకులు రోడ్డున ప‌డ్డాయ‌ని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోల‌ను కొండ‌పైకి అనుమ‌తించేలా చేయాలని ఆటో డ్రైవ‌ర్ల సంఘం నాయ‌కులు మొగుల‌య్య‌, సంతోష్‌, స‌త్యానారాయ‌ణ, ఇత‌ర డ్రైవ‌ర్లంతా క‌లిసి భ‌ట్టి విక్ర‌మార్క‌కు విన‌తి ప‌త్రం అందజేశారు.  ఇంకా చదవండి  

Published at : 03 May 2023 03:09 PM (IST) Tags: BJP YSRCP AP Latest news BRS TDP Telangana LAtest News

సంబంధిత కథనాలు

Minister KTR: మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు - ప్రజల నుంచి మాత్రం కాదు

Minister KTR: మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు - ప్రజల నుంచి మాత్రం కాదు

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Top 10 Headlines Today: చంద్రబాబు - అమిత్ భేటీ వివరాలు; నేడు నిర్మల్‌కు కేసీఆర్ - ఇవాల్టి టాప్ 10 న్యూస్

Top 10 Headlines Today: చంద్రబాబు - అమిత్ భేటీ వివరాలు; నేడు నిర్మల్‌కు కేసీఆర్ - ఇవాల్టి టాప్ 10 న్యూస్

టాప్ స్టోరీస్

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ