YS Viveka Case : వివేకా హత్య కేసులో ఏం జరగబోతోంది ? హైకోర్టు సీనియర్ లాయర్ రచనారెడ్డి ఏం చెప్పారంటే ?
వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా అన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది. ఈ కేసులో తదుపరి ఏం జరగనుందన్న దానిపై హైకోర్టు లాయర్ రచనారెడ్డి విశ్లేషణ ఏమిటంటే ?
YS Viveka Case : మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దూకుడు పెంచింది. వచ్చే నెల 30వ తేదిలోపు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఓ వైపు ఆధారాలను పరిశీలిస్తూనే మరో వైపు సాక్ష్యలను ప్రశ్నించే పనిలో సీబీఐ బిజీగా ఉంది. ఈ కేసులో తదుపరి ఏం జరగబోతోందన్న దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. దీనిపై ప్రముఖ హైకోర్టు న్యాయవాది రచనా రెడ్డి తో ABP దేశం మాట్లాడింది. రచనారెడ్డి విశ్లేషణ ప్రకారం
సీబీఐ, ఈడీ దర్యాప్తుల్లో కోర్టులు జోక్యం చేసుకోవు : రచనా రెడ్డి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ, కోర్టు స్పందన చూస్తుంటే కేసు న్యాయపరంగా సరైన రీతిలోనే నడుస్తోందనిపిస్తోంది. సిబిఐ, ఈడి వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్దలు చేపట్టిన దర్యాప్తులో కోర్టులు జోక్యం చేసుకునే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దాదాపు జోక్యం చేసుకోవనే చెప్పాలి. గతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయనే ఆరోపణలు వచ్చినప్పుడు, వాటికి ఆధారాలున్నప్పుడు, లేదా కస్ట్డడీలో ఉన్నప్పుడు వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు,వాటికి ఆధారాలు చూపినప్పుడు మాత్రమే అదికూడా కొంత వరకూ కోర్టులు జోక్యం చేసుకునేవి. ఇప్పుడు ప్రతీ సిబిఐ, ఈడీ విచారణలు వీడియో , ఆడియో రికార్డింగ్ జరుపుతున్నారు. కాబడ్డి మానవ హక్కుల ఉల్లంఘన, వేధింపులకు అవకాశమే లేదు కాబట్టి ఇప్పుడున్న పరిస్దితిలో సిబిఐ విచారణలో కోర్టులు దాదాపు జోక్యం చేసుకోవనే చెప్పాలి.
అవినాష్ రెడ్డి ధైర్యంగా విచారణ ఎదుర్కోవడమే మార్గం : రచనా రెడ్డి
ప్రస్తుతం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉంది.ఇప్పుడు సుప్రిం కోర్టును ఆశ్రయించినా హైకోర్టులో పెండన్సీ అంటూ కొట్టివేస్తారు. కాబట్టి అవినాష్ రెడ్డి ఇప్పుడు బెయిల్ కోసం టెన్షన్ పడటం కంటే సిబిఐ విచారణ ఎదుర్కొవడం మంచిది. విచారణ పూర్తి చేసిన తరువాత సిబిఐ కోర్టులో ట్రైల్స్ జరుగుతాయి. అక్కడ సిబిఐతో పాటు అవినాష్ రెడ్డి, సునీతా ఇలా ప్రతీ ఒక్కరూ తమ హక్కుల కోసం విచారణలో లేవనెత్తిన అంశాలను ప్రశ్నించే రైట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కేసు విచారణ దశలో ఉన్న కారణంగా ఇప్పుడు ఆందోళన చెందడం కంటే కాస్త ఓపిక పట్టి ట్రైల్స్ లో అవినాష్ రెడ్డికి అన్యాయం జరిగుంటే ,విచారణలో అనుమానాలుంటే వాటిని ప్రశ్నించకోచ్చు. సిబిఐ విచారణలో సేకరించిన ఆధారాలు సిబిఐ కోర్టు ముందు ఉంచినప్పడు ట్రైల్స్ న్యాయమూర్తి లేవనెత్తిన సందేహాలకు సిబిఐ సైతం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే.
అవసరం అనుకుంటేనే సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవచ్చు : రచనా రెడ్డి
అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయానికి కోస్తే .. ప్రస్తుతం సిబిఐ అవసరం అనుకుంటే అరెస్ట్ చేయోచ్చు. లేదా వేచి చూడొచ్చు. ఈ కేసులో ఏ1, ఏ2 ఇలా అందరూ ఓకే విధంగా వాగ్మూలం చెబుతుంటే, అందుకు భిన్నంగా ఆధారాలు లభించి, సెక్షన్స్ యాడ్ చేసిన సంద్భంలో అవసరం అనకుంటే అవినాష్ రెడ్డిని సైతం కస్టడీలోకి తీసుకుని తీసుకుని సిబిఐ విచారించే అవకాశాలు లేకపోలేదు. అలా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే ముందు సిబిఐ కోర్టు వద్ద అనుమతి తీసుకుని అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవల్సి ఉంటుంది. అయితే ఈ వ్యహారంలో అరెస్ట్ చేస్తే తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతుందనే ఆందోళనలో అవినాష్ రెడ్డి ఉండొచ్చు.అందుకే అరెస్ట్ విషయంలో ఇలా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించరనుకోవచ్చు. ఒకవేళ అరెస్ట్ జరిగితే తాను దోషి అనే ముద్ర పడుతుందేనే అభిప్రాయంతోపాటు , ప్రతిపక్షాలు ఇదే అవకాశంగా రాజకీయ విమర్మలతో తనను టార్గెట్ చేస్తాయనే సందేహాలు కావొచ్చు.ఇలా ఏదేమైనా అవినాష్ రెడ్డి మాత్రం సిబిఐ అరెస్ట్ నుండి దాదాపు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, కోర్టులో అనుకూల తీర్పు రాకపోవడంతో కొంత ఉత్కంఠత నెలకొంది.
హైకోర్టు సీనియర్ లాయర్ రచనారెడ్డి సీబీఐ అవసరం అనుకుంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తుందని ..లేకపోతే వేచి చూస్తుందని అంటున్నారు.