Top 5 Headlines Today: నెల్లూరు వైసీపీలో రచ్చకెక్కిన విభేదాలు! ఖమ్మం ఎన్టీఆర్ విగ్రహంలో మార్పులు, అనుమతి లభిస్తుందా ?
Top 5 Headlines Today 20th May 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
బాబాయ్ అబ్బాయ్ మధ్య మాస్ వార్నింగ్స్, నెల్లూరు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీలో రచ్చకెక్కిన విభేదాలు
నెల్లూరు వైఎస్‌ఆర్‌సీపీ రాజకీయం రోడ్డునపడింది. నెల్లూరు సిటీలో ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న బాబాయ్-అబ్బాయ్ పోరాటం ఇప్పుడు రచ్చకెక్కింది. రూప్ కుమార్ యాదవ్ అనుచరుడిపై దాడి జరగడం, బాధితుడిని పరామర్శించిన అనంతరం ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడంతో కలకలం రేగింది. ఎమ్మెల్యే అనిల్ కూడా ఘాటుగానే బదులిచ్చారు. తన జోలికొస్తే పైనుంచి కింద దాకా చర్మం వలిచేస్తానంటూ హెచ్చరించారు. బాబాయ్, అబ్బాయ్ మధ్య గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా మాటల తూటాలు పేలడంతో ఏం జరుగుతుందోననే భయాందోళనలు నెలకొన్నాయి.
అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ ఎదుగుదలకు ఆయనకు బాబాయ్ వరసయ్యే రూప్ కుమార్ యాదవ్ అండదండలున్నాయి. అనిల్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయన షాడో ఎమ్మెల్యేగా పనులు చక్కబెట్టేవారు. 2014లో అనిల్ వెనక రూప్ ఉన్నారు, 2019 ఎన్నికల్లో కూడా అనిల్ గెలుపుకి రూప్ కృషి చేశారు. కానీ ఇటీవల తేడాలొచ్చాయి. ఎవరి వర్గం వారుగా విడిపోయారు. ఎప్పుడూ ఒకరినొకరు నేరుగా విమర్శించుకునేవారు కాదు. నెల్లూరు సిటీలో రూప్ కుమార్ కొత్తగా పార్టీ ఆఫీస్ పెట్టుకున్నారు. నెల్లూరు సిటీలో పార్టీ రెండుగా చీలిపోయింది. కార్పొరేటర్లు చెరో వర్గం అయిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
సోమవారం రండి - అవినాష్ రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు!
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. సోమవారం న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. శుక్రవారం అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఇందుకోసం హైదరాబాద్‌కు కూడా చేరుకున్నారు. అయితే చివరి నిమిషంలో తల్లికి ఆరోగ్యం సరిగా లేదని సీబీఐ విచారణకు హాజరుకాలేదు. కడప ఎంపీ వైఎస్ అనినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మకు రెండు రోజు కూడా విశ్వభారతి ఆస్పత్రిలోనే చికిత్స కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం లక్ష్మమ్మ కళ్లు తిగిరి పడిపోయారు. దీంతో అవినాష్ సీబీఐ కార్యాలయానికి వెళ్లకుండా ఆగమేఘాల మీద తల్లిని చూసేందుకు వెళ్లారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని చుక్కలూరు వద్ద తల్లి లక్ష్మమ్మను అంబులెన్స్ చూసి, వెంట తన కాన్వాయ్‌తో అవినాష్ హైదరాబాద్‌కు బయల్దేరాడు. అయితే కర్నూలు నగరంలోకి రాగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
హైదరాబాద్‌లో మరో అమెరికా సంస్థ, 9 వేల మంది యువతకు ఉద్యోగాలు!
హైదరాబాద్‌లో మరో అమెరికా సంస్థ ఏర్పాటుకానుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో ప్రత్యేక గుర్తింపు అలియంట్ సంస్థ హైదరాబాద్‌లో కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఆ కంపెనీకి చెందిన సీఈవో ధవల్ జాదవ్‌ను హూస్టన్‌లో మంత్రి కేటీఆర్ కలిశారు. కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పవర్‌హౌజ్‌గా పేరుగాంచిన అలియంట్ గ్రూపు .. హైదరాబాద్‌లోని బీఎఫ్ఎస్ఐ రంగాన్ని బలోపేతం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఖమ్మం ఎన్టీఆర్ విగ్రహంలో మార్పులు - అనుమతి లభిస్తుందా ?
ఎన్టీఆర్ శత జయంతి రోజున ఖమ్మంలో నిర్వహించాలనుకున్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ విగ్రహాన్ని ఆవిష్కరించాలని పట్టుదలుగా ఉన్నారు నిర్వాహకులు అందుకే నిర్వాహకులు విగ్రహంలో మార్పులు చేపట్టారు. నీలమేఘ శ్యాముడిగా ఉన్న శ్రీకృష్ణుడి గెటప్ ను గోల్డ్ కలర్ లోకి మార్చుతున్నారు. విగ్రహానికి ఉన్న నెమలి పింఛాన్ని తొలగించారు. కిరీటం వెనుక వైపున ఉన్న విష్ణుచక్రాన్ని, చేతిలో ఉన్న పిల్లన గ్రోవిని తొలగిస్తున్నారు. యాదవ సంఘాల అభ్యంతరాలను గౌరవిస్తూ ఎన్టీఆర్ విగ్రహంలో మార్పులు చేస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ విషయాన్ని హైకోర్టుకు విన్నవిస్తామని అంటున్నారు. ఈ నెల 28న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుందని కూడా వారు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి రాష్ట్రం ప్రతిపాదనలు - కేంద్రం అంగీకరిస్తుందా ?
అమరావతిలోని ఆర్5 జోన్‌పై రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ముందుకు కదులుతోంది. ఆ జోన్‌లో ఇతర ప్రాంతాల్లోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని, అయితే కోర్టు తుది తీర్పుకు లోబడే అవి చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు తర్వాతే హక్కులు దఖలు పడతాయి అయినా కేంద్రం ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడమే కాకుండా ఇళ్లను కూడా నిర్మించి ఇవ్వాలని పట్టుదలగా ఉంది. ఇళ్ల స్థలాలతో పాటు ఇంటి నిర్మాణాలు కూడా చేపడితే తర్వాత తీర్పు ఎలా ఉన్నా వైసీపీ ప్రభుత్వానికే ఆ ఘనత మిగిలిపోతుందని భావిస్తున్నారు. ఈ నెలాఖరులో సీఎం చేతుల మీదుగా పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఇక్కడి స్థలాల్ని దాదాపు రూ.20 కోట్లు పెట్టి చదును చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి