News
News
వీడియోలు ఆటలు
X

Amaravati Houses : ఆర్‌ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి రాష్ట్రం ప్రతిపాదనలు - కేంద్రం అంగీకరిస్తుందా ?

ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి సాయం చేయవద్దని కేంద్రానికి ఎంపీ రఘురామ లేఖ రాశారు.

FOLLOW US: 
Share:

Amaravati Houses :    అమరావతిలోని  ఆర్‌5 జోన్‌పై రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ముందుకు కదులుతోంది. ఆ జోన్‌లో ఇతర ప్రాంతాల్లోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని, అయితే కోర్టు తుది తీర్పుకు లోబడే అవి చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు తర్వాతే హక్కులు దఖలు పడతాయి అయినా కేంద్రం ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడమే కాకుండా ఇళ్లను కూడా నిర్మించి ఇవ్వాలని పట్టుదలగా ఉంది.  ఇళ్ల స్థలాలతో పాటు ఇంటి నిర్మాణాలు కూడా చేపడితే తర్వాత తీర్పు ఎలా ఉన్నా వైసీపీ ప్రభుత్వానికే ఆ ఘనత మిగిలిపోతుందని భావిస్తున్నారు.  ఈ నెలాఖరులో సీఎం చేతుల మీదుగా పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఇక్కడి స్థలాల్ని దాదాపు రూ.20 కోట్లు పెట్టి చదును చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.  

ట్టాల పంపీణీ రోజే గృహ నిర్మాణ శంకుస్థాపన వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తాజాగా ప్రతిపాదనలు పంపింది. ఆర్‌-5 జోన్‌ పరిధిలో మొత్తం 47,017 ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రతిపాదనల్లో పేర్కొంది. వాస్తవానికి గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలకు చెందిన మొత్తం 51,392 మందికి ఆర్‌`5 జోన్‌లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే వీటిలో ఇళ్లు కట్టుకోగలిగే వారి కోసం స్థలాలు కేటాయించి, మిగతా వాటిలో తామే ఇళ్లు నిర్మించి ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం సహకరించాలని కేంద్రాన్ని కోరింది. షీర్‌వాల్‌ టెక్నాలజీతో ఇళ్లు కట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇళ్ల స్థలాల లేఅవుట్ల అభివృద్ధికి సీఆర్‌డీఏ రూ.50 కోట్లు కేటాయించింది. పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంలో భాగంగా మంత్రులు, ప్రభుత్వంలో కీలకనేతలు, అధికారులు ప్రతిరోజు పనులు పర్యవేక్షిస్తున్నారు.

సెంటు స్థలాలను అమరావతి రైతులు ఇచ్చిన భూములను ఇచ్చినప్పటికీ ఇళ్లు మాత్రం కేంద్ర నిధులతో నిర్మిస్తారు. కేంద్రం ఒక్కో ఇంటికి రూ. 1 లక్ష 80 వేలు ఇస్తుంది. అలాగే ప్రభుత్వం లబ్దిదారులకు పావలా వడ్డ కింద మరో రూ. 35వేలు ఇప్పిస్తోంది. ఈ మొత్తంతోఇళ్లు నిర్మించాలని అనుకుంటున్నారు. అయితే ముందుగా  వీటికి కేంద్రం మంజూరు చేయాల్సి ఉంటంది. అందుకే ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రభుత్వం పంపిణీ చేస్తున్న భూములు వివాదంలో ఉన్నందున వాటిలో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇస్తుందా అన్నది సస్పెన్స్ గా మారింది. అనుమతి ఇవ్వకపోతే ప్రభుత్వం ఏ వ్యూహం అవలంభిస్తుందన్నది కూడా కీలకమైన విషయంగా చెప్పుకుంటున్నారు. 

మరో వైపు  ఆర్- 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి సాయం చేయవద్దంటూ కేంద్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి హర్ధీప్ పూరి కి  ఎంపీ రఘురామకృష్ణరాజు  లేఖ రాశారు. సిద్ధంగా ఉన్న టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని జగ‌న్‌కు  సూచించాలని కేంద్ర మంత్రి ని కోరారు.  ఏపీ పంపిన ప్రతిపాదనలపై స్పందించవద్దని కేంద్రానికి ఎంపీ విజ్ఞప్తి చేశారు. అమరావతిపై కోపంతో మూడు రాజధానులకు జగన్ తెరలేపారని ఎంపీ రఘురామ లేఖలో పేర్కొన్నారు.

Published at : 20 May 2023 02:43 PM (IST) Tags: Raghurama Amaravati Amaravati lands R5 zone

సంబంధిత కథనాలు

4 Years Of YSRCP: రేపటితో వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: రేపటితో వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

AP News: సంచలనం - ఆస్తులను వెల్లడించిన ఏపీ సమాచార చీఫ్ కమిషనర్ మహబూబ్ బాషా

AP News: సంచలనం - ఆస్తులను వెల్లడించిన ఏపీ సమాచార చీఫ్ కమిషనర్ మహబూబ్ బాషా

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

టాప్ స్టోరీస్

CPI Narayana : సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !

CPI Narayana :   సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!