By: ABP Desam | Updated at : 20 May 2023 01:09 PM (IST)
ఖమ్మం ఎన్టీఆర్ విగ్రహంలో మార్పులు - అనుమతి లభిస్తుందా ?
Kammam NTR Statue Politics : ఎన్టీఆర్ శత జయంతి రోజున ఖమ్మంలో నిర్వహించాలనుకున్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ విగ్రహాన్ని ఆవిష్కరించాలని పట్టుదలుగా ఉన్నారు నిర్వాహకులు అందుకే నిర్వాహకులు విగ్రహంలో మార్పులు చేపట్టారు. నీలమేఘ శ్యాముడిగా ఉన్న శ్రీకృష్ణుడి గెటప్ ను గోల్డ్ కలర్ లోకి మార్చుతున్నారు. విగ్రహానికి ఉన్న నెమలి పింఛాన్ని తొలగించారు. కిరీటం వెనుక వైపున ఉన్న విష్ణుచక్రాన్ని, చేతిలో ఉన్న పిల్లన గ్రోవిని తొలగిస్తున్నారు. యాదవ సంఘాల అభ్యంతరాలను గౌరవిస్తూ ఎన్టీఆర్ విగ్రహంలో మార్పులు చేస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ విషయాన్ని హైకోర్టుకు విన్నవిస్తామని అంటున్నారు. ఈ నెల 28న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుందని కూడా వారు చెబుతున్నారు.
ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై ఈ నెల 28న ఆవిష్కరించనున్న ఎన్టీఆర్ విగ్రహంపై వివాదం చివరి క్షణాల్లో వివాదాలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నెలకొల్పుతున్న ఈ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో సిద్ధం చేశారు నిర్వహాకులు. రూ. 4 కోట్ల వ్యయంతో 54 అడుగుల భారీ విగ్రహాన్ని రెడీ చేయించారు. కమ్మ సంఘం, తానా, పలువురు స్థానిక పారిశ్రామిక వేత్తలు ఒక కమిటీగా ఏర్పడి శ్రీ కృష్ణుడి గెటప్ లో ఉన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని సిద్ధం చేశాయి. ఈ నెల 28న ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నాయి. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేయాలని నిర్వాహకులు భావించారు. మంత్రి పువ్వాడ అజయ్ జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి విగ్రహావిష్కరణకు ఆహ్వానించారు.
ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీ కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయడం వల్ల భావి తరాలు ఎన్టీఆరే శ్రీ కృష్ణుడు అని భావించే అవకాశం ఉందని, దానిని తక్షణం ఆపేయాలని యాదవ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇస్కాన్ సైతం యాదవ సంఘాలకు మద్దతుగా నిలిచింది. అయితే తాము దానవీర శూర కర్ణ సినిమాలో శ్రీ కృష్ణుడి పాత్రదారిగా నటించిన ఎన్టీఆర్ ఫొటో ఆధారంగానే విగ్రహం తయారు చేయించామని, చాలా చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలు ఇలానే ఉన్నాయని నిర్వాహకులు ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఒక్క విగ్రహం విషయంలోనే రాద్ధాంతం తగదంటున్నారు.
ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీ కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేసే ప్రయత్నాలను ఆపాలని కోరుతూ హైకోర్టులో 16 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇస్కాన్, కరాటే కల్యాణి నేతృత్వంలోని ఆదిభట్ట కళాపీఠం, యాదవ సంఘాలు ఈ పిటిషన్లు దాఖలు చేశాయి. ఎన్టీఆర్ సాధారణ రూపంలోనే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇస్కాన్ సహా 16 మంది హైకోర్టును ఆశ్రయించారు. స్వల్ప మార్పులు చేస్తూ దానినే ప్రతిష్టించేందుకు నిర్వాహకులు రెడీ అవుతుండగా యాదవ సంఘాలు మాత్రం అడ్డుకొని తీరుతామంటున్నాయి. హైకోర్టు నిర్ణయాన్ని బట్టి విగ్రహావిష్కరణ ఉంటుందో ఉండదో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్
Hyderabad: ఉన్నట్టుండి ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని, ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు!
Ponguleti : కాంగ్రెస్‌లోకే పొంగులేటి, జూపల్లి - రేపో, మాపో అధికారిక ప్రకటన
అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్
Top 10 Headlines Today: చంద్రబాబుపై కేశినేని అసహనం, జనసేనలోకి కీలక వ్యక్తి - నేటి టాప్ 5 న్యూస్
YSRCP News : రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !
Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?
Jr NTR - McDonald's AD : చికెన్ కోసం రాత్రిని పగలు చేసిన ఎన్టీఆర్ - కొత్త యాడ్ చూశారా?
Realme 11 Pro: 100 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో - సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా - ధర రూ.20 వేలలోనే!