హైదరాబాద్‌లో మరో అమెరికా సంస్థ, 9 వేల మంది యువతకు ఉద్యోగాలు!
హైదరాబాద్‌లో మరో అమెరికా సంస్థ ఏర్పాటుకానుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో ప్రత్యేక గుర్తింపు అలియంట్ సంస్థ హైదరాబాద్‌లో కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.
హైదరాబాద్‌లో మరో అమెరికా సంస్థ ఏర్పాటుకానుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో ప్రత్యేక గుర్తింపు అలియంట్ సంస్థ హైదరాబాద్‌లో కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఆ కంపెనీకి చెందిన సీఈవో ధవల్ జాదవ్‌ను హూస్టన్‌లో మంత్రి కేటీఆర్ కలిశారు. కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పవర్‌హౌజ్‌గా పేరుగాంచిన అలియంట్ గ్రూపు .. హైదరాబాద్‌లోని బీఎఫ్ఎస్ఐ రంగాన్ని బలోపేతం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
హైదరాబాద్ కేంద్రంలో ఆ సంస్థ కొత్తగా 9 వేల మందిని రిక్రూట్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ట్యాక్స్, అకౌంటింగ్, ఆడిట్ సర్వీస్, ఐటీ టెక్నాలజీకి చెందిన యువతకు ఇదొక సదావకాశం అవుతుందని మంత్రి తెలిపారు. బీఎఫ్ఎస్ఐ పరిశ్రమకు హైదరాబాద్ నగరం కేంద్ర బిందువుగా మారుతోందని, అలియంట్ సంస్థ తీసుకున్న నిర్ణయం ఆ నగరంపై ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూపుతుందని మంత్రి తన ట్వీట్‌లో వెల్లడించారు. హూస్టన్‌లో ఉన్న అలియంట్ గ్రూపు ప్రధాన కార్యాలయానికి వెళ్లిన మంత్రి కేటీఆర్‌కు అక్కడ ఘన స్వాగతం లభించింది.
A huge boost to the Telangana/India BFSI sector!
— KTR (@KTRBRS) May 20, 2023
Met with the very dynamic & exuberant @Dhavaljadav02 CEO of Alliant in Houston today who shared a great news after our discussion@AlliantGroup, a powerhouse in consulting and financial services, is going to rev up BFSI sector of… pic.twitter.com/rJmUFKhywl
What a lovely welcome at Alliant Headquarters today at Houston!!
— KTR (@KTRBRS) May 20, 2023
Many thanks @Dhavaljadav02 for the grand reception and hospitality 🙏 pic.twitter.com/H8OAhJEfXo
Also Read:
టౌన్‌ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షల తేదీలు ఖరారు - ఎగ్జామ్స్ ఎప్పుడంటే?
తెలంగాణలో ప్రశ్నపత్రాల లీకేజీతో వాయిదాపడిన టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రాతపరీక్ష తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మే 19న ప్రకటించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 8న టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష; జులై 13, 14 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు వారం రోజుల ముందు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ పేర్కొంది.
పరీక్షల వివరాల కోసం క్లిక్ చేయండి..
APPSC: 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షల షెడ్యూలు ఖరారు, ఎప్పుడంటే?
ఏపీలో వివిధ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్-1 సర్వీసు(నోటిఫికేషన్ నెం. 28/2022) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఖరారుచేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను జూన్ 3 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు మే 19న ఒక ప్రకటనలో తెలిపింది. ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలోని పాతజిల్లాల ప్రధాన కేంద్రాల్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు మే 24 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు నిర్దేశించిన తేదీలో హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని, అందులో పేర్కొన్న సూచనలను అనుసరించాలని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...