అన్వేషించండి

YS Viveka Case : సోమవారం రండి - అవినాష్ రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు!

అవినాష్ రెడ్డి సోమవారం విచారణకు రాావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది.

 

YS Viveka Case :     మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. సోమవారం న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది.  శుక్రవారం అవినాశ్‌ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఇందుకోసం హైదరాబాద్‌కు కూడా చేరుకున్నారు. అయితే చివరి నిమిషంలో తల్లికి ఆరోగ్యం సరిగా లేదని సీబీఐ విచారణకు హాజరుకాలేదు.  

తల్లికి అనారోగ్యం కారణంగా శుక్రవారం విచారణకు వెళ్లని అవినాష్ రెడ్డి 
 
కడప ఎంపీ వైఎస్‌ అనినాష్‌ రెడ్డి తల్లి  లక్ష్మమ్మకు రెండు రోజు కూడా విశ్వభారతి ఆస్పత్రిలోనే చికిత్స కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం లక్ష్మమ్మ కళ్లు తిగిరి పడిపోయారు. దీంతో అవినాష్‌ సీబీఐ కార్యాలయానికి వెళ్లకుండా ఆగమేఘాల మీద తల్లిని చూసేందుకు వెళ్లారు. అనంతపురం జిల్లా  తాడిపత్రి మండలంలోని చుక్కలూరు వద్ద తల్లి లక్ష్మమ్మను అంబులెన్స్‌ చూసి, వెంట తన కాన్వాయ్‌తో అవినాష్‌ హైదరాబాద్‌కు బయల్దేరాడు. అయితే కర్నూలు నగరంలోకి రాగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తల్లి లక్ష్మమ్మ పరిస్థితి బాగోలేకపోవడంతో కర్నూలు నగరం గాయత్రి ఎస్టేట్‌లోని విశ్వభారతి సూపర్‌ స్పెషాలిటీ అస్పత్రిలో చేర్చించారు. వైద్యులు ఆమెకు గుండె సంబంధిత పరీక్షలు చేశారు. లోబీపీ, ఈసీజీలో కొన్ని మార్పులు ఉన్నాయని, కార్డియాక్‌ ఎంజేమ్స్‌ బాగా పెరగడం వల్ల యాంజియోగ్రామ్‌ చేయాల్సి వస్తుందని  కార్డియాలజిస్ట్‌  డాక్టర్‌ హితేష్‌రెడ్డి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు.

కర్నూలు ఆస్పత్రిలో రెండో రోజు కొనసాగుతున్న చికిత్స 
 
వాస్తవానికి అవినాష్‌ సీబీఐ విచారణకు హైదరాబాదులోని తన ఇంటి బయలు దేరారు. అదే సమయంలో పులివెందులలో తమ స్వగృహంలోనే అవినాశ్‌ తల్లి వైఎస్‌ లక్ష్మమ్మ కళ్లు తిగిరి పడిపోయారు. ఆమెను సుమారు 10.10 గంటల సమయంలో పులివెందులలోనే ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ అవినాష్‌ సీబీఐ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండగా రూట్‌ మార్చి పులివెందులకు బయలుదేరారు. హైదరాబాద్‌ నుంచి కర్నూలు, డోన్‌ మీదుగా గుత్తికి చేరుకున్నారు. అయితే లక్ష్మమ్మకు వివిధ పరీక్షలు చేసిన వైద్యులు సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ప్రత్యేక అంబులెన్స్‌లో ఆమెను హైదరాబాదుకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న అవినాష్‌ పులివెందులకు వెళ్లలేకపోయారు. తాడిపత్రి సమీపంలోకి అంబులెన్స్‌ రాగానే అక్కడి నుంచి బయలుదేరారు. అందరు హైదరాబాద్‌కు వెళ్తారని భావించారు. కర్నూలు నగరానికి రాగానే అంబులెన్స్‌ను గాయత్రి ఎస్టేట్‌కు మళ్లించి విశ్వభారతి సూపర్‌ స్పెషాలిటీ అస్పత్రిలో చేర్పించారు.             

సోమవారం విచారణకు హాజరవడం కష్టమే !

సోమవారం అయినా అవినాష్ రెడ్డి హాజరవుతారాలేదా అన్నదానిపై స్పష్టత లేదు. తన తండ్రి ఇప్పటికే జైల్లో ఉన్నారని.. తన తల్లిని చూసుకోవాల్సి ఉన్న కారణంగా విచారణకు రాలేనని ఆయన సమాచారం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇదే అంశాన్ని వివరిస్తూ సుప్రీంకోర్టులో తాము దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వెకేషన్ బెంచ్ ముందుకు వచ్చేలా ఆయన తరపు లాయర్లు ప్రయత్నించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Embed widget