Top Headlines: కేసీఆర్ వాహనం తనిఖీ చేసిన పోలీసులు - కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి, నారా లోకేశ్ కు జడ్ కేటగిరీ భద్రతపై బొత్స సంచలన వ్యాఖ్యలు
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచి ఉన్న టాప్ హెడ్ లైన్స్ మీ కోసం.
Top Headlines on March 31st In Telugu States:
1. గులాబీ బాస్ కేసీఆర్ వాహనం తనిఖీ చేసిన పోలీసులు
రైతుల పరిస్థితిని తెలుసుకునేందుకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ క్షత్రస్థాయి పరిశీలనకు వెళ్తున్నారు. నేడు నల్గొండ, జనగామ, సూర్యాపేట జిల్లాల్లోని పలు మండలాల్లో కేసీఆర్ పర్యటిస్తున్నారు. కేసీఆర్ ఎర్రవెళ్లి ఫాం హౌస్ నుంచి మొదట జనగామకు వెళ్లారు. పోలీసులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయాణిస్తున్న ప్రత్యేక బస్సును అడ్డుకుని తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, బస్సు తనిఖీ చేయాలని పోలీసులు చెప్పగా కేసీఆర్ అందుకు సహకరించారు. తిరుమలగిరి మండలం ఈదులపర్రె వద్ద కేసీఆర్ వాహనంలో తనిఖీలు పూర్తయ్యాక, వాహనం ముందుకు కదిలింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2. కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తె కావ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీపాదాస్ మున్షి.. కడియం శ్రీహరికి, కావ్యకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. కడియం కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చినా ఆమె పార్టీని వీడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3. నారా లోకేశ్ కు 'Z' కేటగిరీ భద్రతపై బొత్స సంచలన వ్యాఖ్యలు
వెయ్యి అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయాలి అంటారు. కానీ అబద్ధాలతో బంధాలు నిలవవు అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీలో బీజేపీతో టీడీపీ పొత్తును ఉద్దేశించి ఈ సెటైర్లు వేశారు. బీజేపీ ఆహ్వానిస్తేనే తాము వెళ్లి పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు చెబుతారని, ఆపై అందులో నిజం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారని మంత్రి బొత్స పేర్కొన్నారు. ప్రజా ఆగ్రహానికి గురైన వారికి, నోరు అదుపులో పెట్టుకోలేక పోయిన వారికి మాత్రమే బ్లాక్ డ్రెస్ వాళ్ల సెక్యూరిటీ అని నారా లోకేష్ కు జడ్ కేటగిరి సెక్యూరిటీపై సైతం బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4. లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య
లైంగిక వేధింపులు అధికం కావడంతో కుటుంబం పరువు పోతోందన్న భయంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. విశాఖపట్నంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు టెన్షన్ పెట్టినందుకు క్షమించండి అక్కా, మీ పరువు తీస్తున్నందుకు సారీ నాన్నా అంటూ ఆమె రాసిన చివరి మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. విద్యార్థులతో కలిసి ఫ్యాకల్టీ సైతం తనపై లైంగిక వేధింపులకు పాల్పడటం, బలవంతంగా తీసిన అసభ్యకర వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని.. తన చావుతోనైనా ఇతర విద్యార్థినులకు న్యాయం జరగాలని ఆ విద్యార్థిని కోరుకుందంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5. నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
దేశవ్యాప్తంగా 649 జవహర్ నవోదయ విద్యాలయ(JNVS)లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను నవోదయ విద్యాలయ సమితి విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ రూల్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. తెలుగురాష్ట్రాల్లో నవోదయ ప్రవేశ పరీక్షను జనవరి 20న ప్రధాన కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.