అన్వేషించండి

Top Headlines: అమెరికాలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేశ్ భేటీ - తెలంగాణలో మార్మోగుతోన్న ఏక్ పోలీస్ పాలసీ నినాదం, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Top Headlines In AP And Telangana:

1. పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేశ్ భేటీ

అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో సరికొత్త టెక్నాలజీ వినియోగంపై ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence) అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి సాధించబోతోందని మంత్రి లోకేష్ అన్నారు. వై2కె బూమ్ నేపథ్యంలో బెంగుళూరు, హైదరాబాద్ నగరాల్లో ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఇంకా చదవండి.

2. ఏపీ ఉచిత గ్యాస్ పథకానికి అర్హులు ఎవరంటే?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మరో కీలకమైన పథకాన్ని ఈ దీపావళి నుంచి ప్రారంభించనుంది. మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతోంది. ఏటా మూడు సిలిండర్లు ఇస్తామని ప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చింది. ఇప్పుడు దాన్ని అమలు చేసేందేకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఉచిత సిండర్ల పథకానికి అర్హులు అవుతారు. అలాంటి వారి వద్ద ఒక ఎల్పీజీ కనెక్షన్ ఉండాలి. వాళ్లకు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆ ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాతో అనుసంధానమైన ఉండాలి. ఇంకా చదవండి.

3. అన్‌స్టాపబుల్ షోలో చంద్రబాబు ఆసక్తికర విషయాలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాడు జైలుకు వెళ్లిన ఎపిసోడ్‌ తెలుగు రాజకీయాల్లోనే చాలా ప్రత్యకమైంది. అరెస్టు నుంచి ఆయన విడుదల వరకు జరిగిన పరిణామాలు ఆసక్తిని రేపిస్తాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో జైల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ పీక్‌ సీన్‌గా చెప్పుకోవాలి. అసలు ఆ రోజు వాళ్లిద్దరు ఏం మాట్లాడుకున్నారు. సడెన్ బయటకు వచ్చిన జనసేనానీ ప్రస్తుత డీసీఎం పొత్తు పెట్టుకుంటున్నామని ప్రకటించడం వెనుక ఏం జరిగిందనే ఆసక్తి అందరిలో ఉంది. ఆ విషయాలను బాలకృష్ణతో పంచుకున్నారు చంద్రబాబు. ఆహాలో నిర్వహించే అన్‌స్టాపబుల్‌ షోలో చాలా ఆసక్తిరమైన సంగతులు రివీల్ చేశారు. ఇంకా చదవండి.

4. అతిపెద్ద గాంధీ విగ్రహం వెనుక సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్

గుజరాత్‌లో ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటే విగ్రహం కంటే అతి పెద్ద విగ్రహాన్ని హైదరాబాద్‌లోని బాపూఘాట్‌లో ఏర్పాటు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.మహాత్ముడ్ని బీజేపీ గౌరవించడం లేదని ఆయన అభియోగం. తాము గౌరవిస్తామని ఆయన చెబుతున్నారు. రేవంత్ రెడ్డి చేిసన ఈ ప్రకటన అత్యంత వ్యూహాత్మకమైనదిగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీని ఇబ్బంది పెట్టే అంశాలను రేవంత్ వరుసగా తెరపైకి తెస్తున్నారు. అందులో భాగంగానే మహాత్మాగాంధీ విగ్రహ ఏర్పాటు ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు. ఇంకా చదవండి.

5. తెలంగాణలో మార్మోగుతోన్న ఏక్ పోలీస్ పాలసీ నినాదం

తెలంగాణ వ్యాప్తంగా ఒకే పోలీసు విధానం అమలు చేయాలని డిమాండ్ ఊపందుకుంది. ఏకంగా కానిస్టేబుళ్లే రోడ్లపైకి వచ్చి ధర్నా చేశారు. నలుగురు కానిస్టేబుళ్ల భార్యల ధర్నాతో మొదలైన ఉద్యమానికి అనూహ్యమైన మద్దతు వస్తోంది. నల్గొండ రూరల్ ఎస్సై సైదా బాబుపై కానిస్టేబుళ్లు తిరుగుబాటు చేశారు. ఆయన వెళ్లిపోయే వరకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంకా చదవండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget