Telugu Mother Flyover Issue: తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ బోర్డుకు మాస్క్- ప్రభుత్వం వెనక్కి తగ్గిందా ?
Telangana Talli flyover: తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లిగా మార్చారు కానీ బోర్డుకు మాస్క్ వేశారు. దీనికి కారణం ఏమిటో ప్రభుత్వం ప్రకటించలేదు.

Flyover renamed as Telangana Talli but masked the board: 'తెలుగు తల్లి ఫ్లైఓవర్' పేరును 'తెలంగాణ తల్లి ఫ్లైఓవర్'గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 30 రాత్రి సచివాలయం సమీపంలోని ఈ ఫ్లైఓవర్ వద్ద కొత్త బోర్డును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే మంగళవారం సాయంత్రానికే ఆ బోర్డును బ్లూ కలర్ గుడ్డతో, తెల్లటి పేపర్‌తో కప్పేసింది. ఈ విషయం తెలంగాణలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వం వివాదాలకు భయపడి వెనక్కి తగ్గిందా? లేక అధికారికంగా ప్రారంభించడానికి అలా చేశారా అన్నది తెలియాల్సి ఉంది.
తెలుగు తల్లి ఫ్లైఓవర్ ❌
— Marpu Modalaindi (@MarpuModalaindi) September 30, 2025
తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ ✅
తెలుగు యూనివర్సిటీ ❌
సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ ✅
కోఠి మహిళా యూనివర్సిటీ ❌
చాకలి ఐలమ్మ యూనివర్సిటీ ✅
అవి కేవలం పేర్లు కాదు, తెలంగాణ అస్తిత్వం...
కేసీఆర్‌కు గుర్తుకురాని, కేసీఆర్ పట్టించుకోని తెలంగాణ అస్తిత్వాన్ని… pic.twitter.com/KWM4jK40hq
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్, సచివాలయం, హైటెక్ సిటీలను కలిపే కీలక మార్గంగా 'తెలుగు తల్లి ఫ్లైఓవర్' ప్రసిద్ధి. చంద్రబాబు హయాంలో నిర్మితమైన ఈ ఫ్లైఓవర్, తెలుగు సాహిత్యం, సంస్కృతి ప్రతీకగా సమీపంలో తెలుగుతల్లి విగ్రహం ఉండటంతో 'తెలుగు తల్లి' పేరుతో గుర్తింపు పొందింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా ఈ పేరు కొనసాగింది. కొత్త సెక్రటేరియట్ నిర్మించిన తర్వాత తెలుగుతల్లి విగ్రహాన్ని కేసీఆర్ హయాంలో అక్కడి నుంచితొలగించారు. మళ్లీ ఏర్పాటు చేయలేదు.
తెలుగు తల్లి ఫ్లైఓవర్‌కు ‘తెలంగాణ తల్లి ఫ్లైఓవర్’ అని బోర్డు పెట్టి, ఒక్క రోజులోనే బోర్డుపై కవర్ కప్పి దాచేశారు.
— Santhosh BRS USA (@SanthoshBRSUSA) October 1, 2025
తెలంగాణ తల్లి పేరు పెట్టడానికే భయపడేంత బానిస పాలన నా ఇది ?
తెలంగాణ తల్లి పేరు పెట్టడానికీ అమరావతి నుండి అనుమతి రావాలా⁉️@KTRBRS pic.twitter.com/gDTbFwLcR0
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ గుర్తింపును బలోపేతం చేయాలనే ఉద్దేశంతో పేరు మార్పు ప్రతిపాదనలు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) బోర్డు ఈ నిర్ణయానికి అంగీకారం తెలిపింది. సోమవారం రాత్రి ఫ్లైఓవర్ ప్రారంభం వద్ద 'తెలంగాణ తల్లి ఫ్లైఓవర్' అని రాసిన కొత్త సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ఏం జరిగిందో కానీ మంగళవారం సాయంత్రానికే ఆ బోర్డు కనిపించకుండా పోయింది. స్థానికులు, సోషల్ మీడియా యూజర్లు షేర్ చేసిన ఫోటోల ప్రకారం, బోర్డును బ్లూ కలర్ గుడ్డతో కప్పేసి, మీద తెల్లటి పేపర్ అతికించారు. కేటీఆర్ పార్టీ సోషల్ మీడియా ద్వారా రేవంత్ ప్రభుత్వాన్ని 'తెలంగాణ గుర్తింపును అవమానిస్తున్నారు' అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అధికారిక స్పందన ఇవ్వలేదు. కానీ కొంత మందిగ్రేటర్ అధికారులు మార్పులు చేస్తున్నామని సైన్ బోర్డు రెడీ అవగానే పెడతామన్నారు.
తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పేరులో మార్పు లేదు: జీహెచ్ఎంసీ
— Telugu Stride (@TeluguStride) October 1, 2025
ఇప్పటికే స్టాండింగ్ కమిటీ తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా నామకరణం చేస్తూ ఆమోదం తెలిపింది
ఫ్రైఓవర్ రెండో వైపు బోర్డు ఏర్పాటు కోసం ఫౌండేషన్ క్యూరింగ్ జరుగుతోంది
ఇది పూర్తి కాగానే 2వ సైన్ బోర్డు ఏర్పాటు చేస్తాం
-జీహెచ్ఎంసీ#GHMC… pic.twitter.com/jMNdBpgUfs





















