Rahul Ramakrishna: అంతా నాశనం..కేసీఆర్, కేటీఆర్ చక్కదిద్దాలి - రాహుల్ రామకృష్ణ ట్వీట్స్ వైరల్ - ఏం కష్టం వచ్చిందంటే ?
Actor Rahul Ramakrishna : నటుడు రాహుల్ రామకృష్ణ కేసీఆర్, కేటీఆర్‌లకు పెట్టిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అంతా నాశనం చేసిందని వచ్చి చక్కదిద్దాలని ఆయన కోరారు.

Actor Rahul Ramakrishna tweets to KCR and KTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఒక్క సారి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ, సోషల్ మీడియాలో తన యాక్టివిటీతో పాటు ఇటీవల రాజకీయ విమర్శలతో కూడా చర్చనీయాంశమయ్యారు. X లో వరుసగా పోస్ట్ చేసిన ట్వీట్లలో అతను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అయితే డైరెక్ట్‌గా టార్గెట్ చేయకుండా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు మాత్రమే విజ్ఞప్తులు చేశాడు. ఈ ట్వీట్లు భారత రాష్ట్ర సమితి సపోర్టర్లు వైరల్ చేస్తున్నారు.
రాహుల్ రామకృష్ణ యొక్క X అకౌంట్ (@eyrahul)లో ఈ రోజు మధ్యాహ్నం పోస్ట్ చేసిన ట్వీట్‌లో, "హైదరాబాద్ మునిగిపోయింది. మీ వాగ్దానాలు అన్నీ విఫలమయ్యాయి. @KCRBRSPresident ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు, ప్రతిదాన్నీ క్రమబద్ధీకరించమని" అని రాశాడు. ఈ పోస్ట్ 2 గంటల్లోనే 98,000కి పైగా వ్యూస్, 2,000 లైక్‌లు పొందింది. హైదరాబాద్ వర్షాలు, వరదల సమస్యలను గుర్తు చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వ వాగ్దానాలు ఏమీ ఫలితం ఇవ్వకపోవడాన్ని ఇందులో పరోక్షంగా విమర్శించినట్లుగాభావిస్తున్నారు.
Hyderabad drowned.
— Rahul Ramakrishna (@eyrahul) October 2, 2025
All your promises failed. @KCRBRSPresident people are calling for you to bring it all to order.
అలాగే, ఈ రోజు ఉదయం మరో ట్వీట్‌లో "మనం చాలా భయంకరమైన కాలంలో జీవిస్తున్నాము. వేచి ఉండలేను.. వచ్చి పరిస్థితుల్ని చక్కదిద్దాలని @KTRBRS" అని పేర్కొన్నాడు. కేటీఆర్‌ను 'రక్షకుడిగా' పిలుస్తూ, "ఇప్పుడు నన్ను చంపేయండి, నాకు ఏమీ ఆశ లేదు" అని భావోద్వేగంగా ముగించాడు. ఈ పోస్ట్ 1.5 లక్షల వ్యూస్‌కు చేరింది.
We live in such terrible times.
— Rahul Ramakrishna (@eyrahul) October 2, 2025
Can’t wait for Dumbledore to come back@KTRBRS
Go ahead, murder me now. I’m sick and tired of things anyway
రాహుల్ రామకృష్ణ, సోషల్ మీడియాలో సాధారణంగా సినిమా, సామాజిక అంశాలపై మాట్లాడతారు. మరో పోస్ట్‌లో "ఈ ప్రపంచంలో ద్వేషం ఉండకూడదు, మనం మానవులమే.. ప్రేమతో జీవించాలి" అని శాంతి సందేశం ఇచ్చాడు. అయితే, ఈ ట్వీట్లు రాజకీయ రంగంలో ఆందోళన కలిగించాయి.
Wishing the entire world a hate free way to live and love/ we are all human just human
— Rahul Ramakrishna (@eyrahul) October 2, 2025
కాంగ్రెస్ కార్యకర్తలు కామెంట్లలో "రాహుల్ గారు, మీకు ఏమైంది? ఎందుకు ఇప్పుడు KCR, KTRకు మాత్రమే?" అ ని ప్రశ్నిస్తున్నారు. ఒక కార్యకర్త "హైదరాబాద్ వరదలపై ఇప్పుడు రాజకీయ టార్గెట్ కోసం గుర్తు చేస్తున్నారు" అని ప్రశ్నించారు.
Probably you encroached some illegal spaces and hydra must have reclaimed it .and now u started crying...
— Be Positive(+) (@kselsm) October 2, 2025
అయితే ఈ ట్వీట్లు ఎందుకు పెట్టారని..తనపై వస్తున్న కామెటంల్కు రాహుల్ రామకృష్ణకు ఇప్పటివరకు ఏ అధికారిక స్పందన లేదు,





















