అన్వేషించండి

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికిద్దాం? కాంగ్రెస్‌ చర్చలు ముమ్మరం!

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు భారీ క్యూ ఉంది. అందులో వడపోసి నలుగురు పేర్లను అధిష్ఠానానికి సిఫార్స్‌ చేస్తారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టికెట్ ఎవరికి ఇవ్వాలని చర్చ కాంగ్రెస్‌లో తీవ్రంగా సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఓ సమావేశం జరిగింది. ఇందులో పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్, ఉపఎన్నికల ఇన్‌ఛార్జ్ మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. వ్యక్తిగత కారణంతో మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సమావేశానికి హాజరుకాలేదు. ఈ సందర్భంగా ఉపఎన్నికల్లో ప్రజల నాడి ఎలా ఉంది. కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయే విషయంపై చర్చించారు. ముందుగా అభ్యర్థి ఎవరిని పెడితే ఎలా ఉంటుంది, కేంద్ర నాయకత్వానికి ఎవరి పేర్లు సిఫార్సు చేయాలనే విషయంపై కూడా మాట్లాడారు. 

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌దే విజయమని, సర్వేలు అనుకూలంగా ఉన్నాయని సహచర మంత్రులు, పీసీసీ చీఫ్‌కు ముఖ్యమంత్రి వివరించారు. స్థానిక నాయకులతో జాగ్రత్తగా సమన్వయం చేసుకొని పని చేస్తే భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా జాగ్రత్తగా అడుగులు వేయాలని సూచించారు. ప్రజాబలం, స్థానికుల అండ ఉన్న వ్యక్తికి అవకాశం ఇవ్వాలని ఇన్‌ఛార్జ్ మంత్రులు, పీసీసీ చీఫ్‌కు దిశానిర్దేశం చేశారు. 

పోటీలో ఎవరెవరు?

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వస్తున్న తొలి ఉప ఎన్నిక ఇది. అందుకే చాలా మంది ఆశావాహులు ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు. గతంలో తృటిలో విజయానికి దూరమైన నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, రహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి కూడా పోటీలో ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మిగతా నాయకులు చాలామంది రేసులో ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న బలం, ఆర్థిక బలం, ప్రజల నుంచి మద్దతును పరిగణలోకి తీసుకొని వీళ్ల పేర్లు తుది జాబితాలో ఉన్నాయి. వీరి పేర్లను అధిష్ఠానానికి పంపించిన తర్వాత ఒకరు పేరు ఫైనల్ చేయనున్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి నాయకుడు కృషి చేయాలని ముఖ్యమంత్రి నేతలకు దిశానిర్దేశం చేశారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌  వల్ల జరిగిన నష్టాన్ని, కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని జనం ముందు చర్చకు పెట్టాలని ముఖ్యమంత్రి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనతో అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తూ రాష్ట్రాభివృద్ధి కోసం చేస్తున్న పనులను వివరించాలని తెలిపారు. రాష్ట్ర నాయకుల నుంచి గల్లీ కార్యకర్త వరకు అందరూ సమన్వయంతో వెళ్తే భారీ మెజార్టీ వస్తుందని చెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Advertisement

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Virat Kohli Anushka Sharma Trolls: అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
Train Tickets: ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
Bigg Boss Telugu Emmanuel Promo : స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
Nagarjuna: ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
Embed widget