Dalit Bandhu: రూ.1.7 లక్షల కోట్లతో రూ.10 లక్షల కోట్లు సంపాదిస్తాం.. సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులుపై సీఎం కేసీఆర్ ప్రశంసల జల్లులు కురిపించారు. అదే సమయంలో దళిత బంధు పథకం గురించి తెలంగాణ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

FOLLOW US: 

KCR Comments On Dalit Bandhu: ఉమ్మండి నల్గొండ జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు నేటి మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మోత్కుపల్లి నర్సింహులుపై ప్రశంసల జల్లులు కురిపించారు. మోత్కుపల్లి అంటే పరిచయం అక్కర్లేని వ్యక్తి అన్నారు. తనకు అత్యంత సన్నిహితుడు అని, గతంలో తాము కలిసి పనిచేశామని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి లాంటి నేతకు ప్రజల కష్టాలు బాగా తెలుసునని.. అలాంటి వ్యక్తి టీఆర్ఎస్‌లో చేరడం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. 

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్రాణం పోయినా ఆపేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అంబేద్క‌ర్ పుణ్య‌మా అని ఎస్సీల‌కు రిజ‌ర్వేష‌న్ ఫ‌లాలు అందాయని.. కొంత‌మంది పిల్ల‌లు చదువుకుని ఉన్న‌త ఉద్యోగాలు పొందారన్నారు. చట్టసభలలో వారికి సరైన ప్రాతినిథ్యం లభించిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం ఎంత పెద్ద య‌జ్ఞ‌మో అందరికీ తెలుసు.. అలాంటిది ద‌ళిత బంధును విజ‌య‌వంతం చేయ‌డం అంత కంటే పెద్ద య‌జ్ఞం అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. 

Also Read: టీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్

‘రాష్ట్రంలో భారీ సంఖ్యలో ద‌ళితులు ఉన్నారు. దాదాపు 75 ల‌క్ష‌ల మంది ద‌ళితులు ఉండగా.. వారి వద్ద చాలా తక్కువ భూమి ఉంది. ద‌ళితుల వ‌ద్ద‌ 13 ల‌క్ష‌ల ఎక‌రాల భూమి మాత్ర‌మే ఉంది. జనాభా ఎక్కువగా ఉన్నారు కానీ అవకాశాలు వారికి దక్కలేదు. వారి భూమి ఎవరి వద్ద ఉందో కూడా వారికి తెలియని పరిస్థితి ఉండేది. అందుకే దళితుల కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టాం. ప్రతి నియోజకవర్గానికి దళితబంధును తప్పకుండా అమలు చేసి తీరుతాం. 

Also Read: ఈటలను చిత్తు చేయండి.. హరీశ్ రావు వ్యాఖ్యలు, సొంత ఇలాకాలో మంత్రికి షాక్ 

తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడేళ్లలో రూ.23 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం. వచ్చే ఏడేళ్ల కాలంలో రూ.1.7 లక్షల కోట్లు దళితబంధుకు ఖర్చు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ పెట్టుబడితో రూ.10 లక్షల కోట్లు ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. దేశంలోని దళిత సమాజానికి తెలంగాణ దళిత సమాజం దిక్సూచిగా మారాలి. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితులు సహా అన్ని వర్గాలవారు బాగు పడతారని ఉద్యమం చేపట్టి, విజయం సాధించాం. కానీ ఎన్నో అవమానాలు భరించాను. చివరికి తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు అన్ని వర్గాల వారికి ఫలాలు అందుతున్నాయని’ సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Oct 2021 05:16 PM (IST) Tags: telangana politics trs kcr motkupalli narasimhulu Dalit Bandhu Motkupalli Narasimhulu Telugu News Motkupalli Join TRS Motkupalli Narasimhulu Join TRS Telangana CM KCR On Dalit Bandhu Motkupalli Telugu News

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: ఆత్మకూరు ఉప ఎన్నికలో మేకపాటి విక్రమ్​ రెడ్డి గెలుపు

Breaking News Live Telugu Updates: ఆత్మకూరు ఉప ఎన్నికలో మేకపాటి విక్రమ్​ రెడ్డి గెలుపు

TSRTC News: ఫలించిన సజ్జనార్ వ్యూహాలు - క్రమంగా గట్టెక్కుతున్న టీఎస్ఆర్టీసీ! ఈసారి భారీగా తగ్గిన నష్టం

TSRTC News: ఫలించిన సజ్జనార్ వ్యూహాలు - క్రమంగా గట్టెక్కుతున్న టీఎస్ఆర్టీసీ! ఈసారి భారీగా తగ్గిన నష్టం

Telangana Covid Cases: తెలంగాణలో మరింత పెరిగిన కరోనా, 3 వేలు దాటిన యాక్టివ్ కేసులు - 500కి చేరువలో కొత్తవి

Telangana Covid Cases: తెలంగాణలో మరింత పెరిగిన కరోనా, 3 వేలు దాటిన యాక్టివ్ కేసులు - 500కి చేరువలో కొత్తవి

Thunderstorm Safety Tips: వానాకాలం మొదలైంది, ప్రాణాలు పోతున్నాయి - పిడుగుపాటుకు గురికాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి

Thunderstorm Safety Tips: వానాకాలం మొదలైంది, ప్రాణాలు పోతున్నాయి - పిడుగుపాటుకు గురికాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి

Kollapur News: కొల్లాపూర్‌లో పరిస్థితి గరం గరం! ఇద్దరు TRS నేతల సవాళ్లు - హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

Kollapur News: కొల్లాపూర్‌లో పరిస్థితి గరం గరం! ఇద్దరు TRS నేతల సవాళ్లు - హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

టాప్ స్టోరీస్

Maharashtra Political Crisis: దమ్ముంటే ఎన్నికల బరిలోకి దిగండి, రెబల్ ఎమ్మెల్యేలకు ఆదిత్య థాక్రే ఛాలెంజ్

Maharashtra Political Crisis: దమ్ముంటే ఎన్నికల బరిలోకి దిగండి, రెబల్ ఎమ్మెల్యేలకు ఆదిత్య థాక్రే ఛాలెంజ్

India vs England 5th Test: రోహిత్‌కు కరోనా - మరి ఐదో టెస్టుకు కెప్టెన్‌ ఎవరు?

India vs England 5th Test: రోహిత్‌కు కరోనా - మరి ఐదో టెస్టుకు కెప్టెన్‌ ఎవరు?

AP Elections 2024: టీడీపీ సింగిల్‌గా బరిలోకి దిగితే ఎన్ని సీట్లు నెగ్గుతుందో చెప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

AP Elections 2024: టీడీపీ సింగిల్‌గా బరిలోకి దిగితే ఎన్ని సీట్లు నెగ్గుతుందో చెప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?

Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?  ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?