By: ABP Desam | Updated at : 21 Oct 2021 11:00 AM (IST)
Edited By: Venkateshk
శ్రీనివాసరావు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ (ప్రతీకాత్మక చిత్రం)
మీరు కరోనా మొదటి డోస్ వేసుకొని, రెండో డోస్ వేయించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే, కరోనా ముప్పు తప్పదని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. కరోనా వైరస్ కట్టడి కోసం తప్పనిసరిగా విధిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనని శ్రీనివాస రావు తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లోని ప్రజారోగ్య డైరెక్టర్ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం మొదటి డోస్ తీసుకుని గడువు ముగిసినా రెండో డోస్ తీసుకోని వారి సంఖ్య 36 లక్షలుగా ఉందని శ్రీనివాసరావు వెల్లడించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని వివరించారు. రాష్ట్రంలో 50 లక్షల వరకు వ్యాక్సిన్ డోసులు నిల్వ ఉన్నాయని, 75 శాతం జనాభా మొదటి డోసు తీసుకున్నప్పటికీ.. రెండో డోసు తీసుకోని వారు చాలా మంది ఉన్నారని వివరించారు. ఫస్ట్ డోసు తీసుకుని రెండో డోసు తీసుకోని వారు రాష్ట్రంలో 36 లక్షల మందికి పైగా ఉన్నారని వివరించారు.
‘‘రాష్ట్రంలో కొవిడ్ పూర్తిగా తగ్గిపోయిందని అశ్రద్ధ చేయడం వల్ల చాలా మంది రెండో డోసు వేయించుకోవడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్తీసుకోని 20 శాతం మందిలో సుమారు 60 శాతం మంది వైరస్ బారిన పడుతున్నారు. వారిలోనే ఎక్కువగా కరోనా సోకుతోంది.’’
ప్రస్తుతం వెలుగు చూస్తున్న కొవిడ్ కేసుల్లో అసలు టీకా తీసుకోని వారు 60 శాతం వరకు ఉన్నారని, మరో 30 శాతం మంది ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారే అని వివరించారు. రెండు డోసులు పూర్తైన వారిలో కేవలం ఐదు నుంచి పది శాతం మందికి మాత్రమే కరోనా సోకుతోందని చెప్పారు. అలాంటి వారిలో కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవడం లేదని వివరించారు. చిన్నారులకు కూడా త్వరలో వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉందని డీహెచ్ చెప్పారు.
Also Read: కేసీఆర్ యాదాద్రి వద్ద తేల్చుకుందాం రా.. అది నిరూపిస్తే దేనికైనా సిద్ధం
ఏ జిల్లాలో ఎంత వ్యాక్సిన్
వ్యాక్సిన్ పంపిణీలో 98 శాతంతో హైదరాబాద్ తొలిస్థానంలో ఉండగా... 95 శాతంతో రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో ఉందని వివరించారు. ఆ రెండు జిల్లాల్లో మాత్రమే 90 శాతానికి పైగా మందికి తొలి డోస్ వ్యాక్సినేషన్ పూర్తైందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో 80 శాతానికిపైగా మొదటి డోస్ ఇచ్చారు. ఇక 12 జిల్లాల్లో 70 శాతానికిపైగా.. మరో 12 జిల్లాల్లో 60 శాతానికి పైగా పూర్తైందని శ్రీనివాసరావు వెల్లడించారు. అయితే వరంగల్, నల్గొండ, జోగులాంబ గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో మాత్రం 60 శాతం మందికి కూడా టీకా అందలేదని వెల్లడించారు. రాష్ట్రంలో ఒకట్రెండు రోజుల్లో మూడు కోట్ల డోసుల వాక్సినేషన్ పూర్తికానుందని డీహెచ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 75 శాతం మందికి మొదటి డోస్, 39 శాతం మందికి రెండో డోస్ పూర్తయిందన్నారు.
Also Read: నాతో రండి.. సమస్యల్లేకపోతే ముక్కు నేలకు రాస్తా, ఏడేళ్లుగా కేసీఆర్‌ను ప్రశ్నించే మగాడే లేడు: షర్మిల
Also Read: Yadadri Temple: యాదాద్రిలో బంగారు తాపడం కోసం మేఘా సంస్థ భారీ విరాళం.. ఎంతంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Maneroo River Front : మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతిపై మంత్రి గంగుల కమలాకర్ ఏమన్నారంటే?
Konseema Protest Live Updates: ఆ పేరు రాత్రికి రాత్రి పెట్టింది కాదు- మార్చే ఉద్దేశం లేదు: సజ్జల
Petre Rates States : పెట్రో పన్నులపై రగడ ! ఎప్పుడూ కేంద్రమేనా రాష్ట్రాలు తగ్గించవా ?
KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్
KTR Davos Tour: ‘ఇలాంటి లీడర్ను నా లైఫ్లో చూడలా! 20 ఏళ్లలో కేటీఆర్ ప్రధాని అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు’
WT20 Challenge 2022: లేడీ సెహ్వాగ్ థండర్స్ ముందు సాగని హర్మన్ మెరుపుల్!
GT vs RR, Qualifier 1: హార్దిక్నే వరించిన టాస్ - రాజస్థాన్ తొలి బ్యాటింగ్
Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే
AP Government On CPS: సీపీఎస్ అమలు సాధ్యం కాదు- తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం, జీపీఎస్కు సహకరించాలని సూచన