Yadadri Temple: యాదాద్రిలో బంగారు తాపడం కోసం మేఘా సంస్థ భారీ విరాళం.. ఎంతంటే..
యాదాద్రి ఆలయం పనుల్లో అత్యంత కీలకంగా నిలిచింది విమాన గోపురం. యాదాద్రిలో 45 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఈ గోపురానికి బంగారు తాపడం చేయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించించారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున బంగారం విరాళం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ కిలో 16 తులాల బంగారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వ్యాపార వేత్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. తాజాగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ కూడా భారీ విరాళాన్ని ప్రకటించింది. ఏకంగా 6 కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్లుగా ప్రకటించింది.
Also Read: కేసీఆర్ యాదాద్రి వద్ద తేల్చుకుందాం రా.. అది నిరూపిస్తే దేనికైనా సిద్ధం
మరోవైపు, యాదాద్రి ఆలయం పునఃప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ తుది పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనుల్లో అత్యంత కీలకంగా నిలిచింది విమాన గోపురం. యాదాద్రిలో 45 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఈ గోపురానికి బంగారు తాపడం చేయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం యాదాద్రి పనులను పర్యవేక్షించిన సందర్భంగా ఈ అంశంపై కీలక ప్రకటన చేశారు. ఆలయ విమాన గోపురానికి 125 కేజీల బంగారంతో తాపడం చేయిస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ పుణ్యకార్యంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తామని చెప్పారు. తమకు తోచినంత బంగారాన్ని విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.
Also Read: నాతో రండి.. సమస్యల్లేకపోతే ముక్కు నేలకు రాస్తా, ఏడేళ్లుగా కేసీఆర్‌ను ప్రశ్నించే మగాడే లేడు: షర్మిల
కేసీఆర్ పిలుపు మేరకు యాదాద్రి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడం కోసం మేఘా ఇంజినీరింగ్ సంస్థ 6 కిలోల బంగారం విరాళం ప్రకటించింది. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ గోపురానికి బంగారు తాపడం ఎంతో పుణ్య కార్యక్రమమని, ఇందులో తాము భాగం కావడం ఎంతో గౌరవప్రదమైన అవకాశమని సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే ఆరు కేజీల బంగారం లేదా అందుకు సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో సంబంధిత అధికారులకు అందిస్తామని వెల్లడించారు. మేఘా ఇంజినీరింగ్ సంస్థ గతంలో ఏపీలోని కృష్ణా జిల్లాలోని డోకిపర్రు గ్రామంలో శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించింది.
Also Read: Gold Smuggling: బ్యాటరీలలో 2.9 కోట్ల బంగారం.. అలా చేశారు.. ఇలా దొరికిపోయారు
Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Also Read: ఏపీలో కాకరేపుతున్న పట్టాభిరామ్ కామెంట్స్ .. టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి