అన్వేషించండి

Telangana Omicron: తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు... 182 కరోనా కేసులు, ఒకరు మృతి

తెలంగాణలో తాజాగా 12 ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 56కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా 182 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 12 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 56కు చేరాయి. గడచిన 24 గంటల్లో 37,839 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 182 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,80,844కి చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌ లో ఈ వివరాలు ప్రకటించింది. గత 24 గంటలలో కరోనాతో ఒక్కరు మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 4,023కి కరోనాతో మరణించారు. కరోనా బారి నుంచి తాజాగా 181 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 3,417 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ రికవరీ రేటు 98.90 శాతంగా ఉండగా, మరణాల రేటు 0.59 శాతం ఉందని బులిటెన్‌లో ప్రకటించింది. నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన వారిలో 10 మందికి కొత్త వేరియంట్‌ సోకింది. వీరి కాంటాక్ట్స్ లో ఇద్దరి వ్యక్తుల్లో ఒమిక్రాన్ వైరస్‌ని గుర్తించారు. ఒమిక్రాన్‌ సోకిన వారిలో 10 మంది కోలుకున్నారు. 

Also Read: నైట్ కర్ఫ్యూతో ఒమిక్రాన్‌ వ్యాప్తి తగ్గుతుందా ? హౌ? ఎలా?

వరంగల్ లో ఒమిక్రాన్ కేసు

వరంగల్ జిల్లాలో మరోసారి ఒమిక్రాన్ కలకలం రేగింది. నగరంలోని బ్యాంక్ కాలనీలో స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన 24 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ వైరస్ సోకినట్లు తేలింది. ఈ మేరకు వరంగల్ డీఎంహెచ్వో వెంకటరమణ వివరాలు వెల్లడించారు. ఈనెల 12న స్విట్జర్లాండ్ నుంచి యువకుడి వరంగల్ కు వచ్చాడు. అతడికి సాధారణంగా కరోనా పరీక్షలు చేయగా కోవిడ్ నిర్థారణ అయింది. అనంతరం  నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. అతడికి ఒమిక్రన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వెంటనే యువకుడిని హైదరాబాద్ లోని టిమ్స్ కు రిఫర్ చేశారు వైద్యులు. అతడి దగ్గర బంధుమిత్రులకు 20 మందికి శాంపుల్స్ సేకరించి పరీక్షల కోసం పంపినట్లు చెప్పారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కె. వెంకటరమణ తెలిపారు. 

Also Read: షిర్డీ వెళ్తున్నారా? ఆగండి.. ఆగండి.. దర్శన వేళల్లో మార్పులు చేశారు తెలుసా? 

సిరిసిల్లలో ముగ్గురికి ఒమిక్రాన్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి ఒమిక్రాన్‌ సోకినట్టు వచ్చినట్లు తేలింది. ఇటీవల దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ వచ్చింది. తాజాగా బాధితుడి భార్య, తల్లి, స్నేహితుడికి వైరస్‌ వ్యాప్తించింది. ఒమిక్రాన్‌ బాధితులను చికిత్స కోసం హైదరాబాద్‌ టిమ్స్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. వీరి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ కు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.  

Also Read: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు... కేరళ, ఉత్తరాఖండ్ లో నైట్ కర్ఫ్యూ... కోవిడ్ నియంత్రణ చర్యలు పొడిగింపు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget