Omicron Effect: షిర్డీ వెళ్తున్నారా? ఆగండి.. ఆగండి.. దర్శన వేళల్లో మార్పులు చేశారు తెలుసా?
మహారాష్ట్రలో ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో షిర్డీ సాయిబాబా దర్శన సమయంలో మార్పులు చేశారు. రాత్రి వేళల్లో దర్శనాలు నిలిపివేయనున్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. రాత్రి 9 గంటల నుంచి 6 గంటల వరకూ.. ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. అయితే ఈ నిర్ణయం కారణంగా.. షిర్డీ సాయి బాబా దర్శన సమయాలపై ప్రభావ చూపనుంది.రాత్రి సమయంలో దర్శనాలను నిలిపివేయనున్నట్టు.. శ్రీ సాయి బాబా సంస్థాన్ ట్రస్ట్ తెలిపింది. కర్ఫ్యూ సమయంలో ఆలయాన్ని మూసివేయనున్నారు. రాత్రి, తెల్లవారున నిర్వహించే 'హారతి' దర్శనాలకు సైతం భక్తులను అనుమతిలేదని.. ట్రస్టు పేర్కొంది.
మరోవైపు మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అనేక మందికి లక్షణాలు.. లేకుండా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో ఆందోళన మెుదలైంది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు మెుత్తం.. 108 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఎక్కువ శాతం.. ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్న రాష్ట్రం మహారాష్ట్రనే. అయితే ఇందులో ఇప్పటి వరకూ.. 54 మంది కోలుకున్నారు.
ఇప్పటి వరకు ముంబయిలో 46 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. పుణే సిటీలో 7 కేసులు, పుణే గ్రామీణ ప్రాంతంలో 15 కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు.. 1,63,553 మంది అంతర్జాతీయ ప్రయాణికులు ముంబయికి వచ్చినట్టు తెలుస్తోంది. 23,933 మంది రిస్క్ అధికంగా ఉన్న దేశాల నుంచి రావడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: PM Kisan Yojana: కొత్త సంవత్సరం కానుక! జనవరి 1న రైతుల ఖాతాల్లో డబ్బులు వేయనున్న మోదీ
Also read: Mann Ki Baat Highlights: ఆ భావన తప్పు.. అందుకు ఈ లెటరే నిదర్శనం.. ప్రధాని మోదీ మన్ కీ బాత్ హైలెట్స్
Also Read: Spirituality: బొట్టు పెట్టుకునే అలవాటుందా .. అయితే ఈ వేలితో పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుందట…
Also Read: ఆశలు వమ్ము చేయను.. తెలుగువాడిగా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తా - జస్టిస్ ఎన్వీ రమణ





















