అన్వేషించండి

TSRTC Special Buses: కార్తీకమాసం వేళ టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల్లో పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

Telangana News: కార్తీక మాస వేళ టీఎస్ఆర్టీసీ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శైవ క్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

TSRTC Good News: ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ (TSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు (Famous Siva Temples) ప్రత్యేక బస్సులు (Special Services) నడపనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు ఈ అవకాశం వినియోగించుకోవాలని సూచించారు. 

ఏపీలో ఈ క్షేత్రాలకు

ఏపీలోని అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, పాలకొల్లు, సామర్లకోట పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ బస్సులు ప్రతి ఆదివారం, కార్తీక పౌర్ణమి ముందు రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి నగరానికి చేరుకుంటాయని తెలిపారు. టిక్కెట్‌ ఛార్జీలు రాజధాని రూ.4 వేలు, సూపర్‌ లగ్జరీ రూ.3200. దర్శనం, వసతి కోసం రూ.550 అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.

తెలంగాణలో ఈ క్షేత్రాలకు

తెలంగాణలో వేములవాడ, కాళేశ్వరం, రామప్పగుడి, వెయ్యి స్తంభాల గుడి, పాలకుర్తి తదితర దక్కన్‌ పంచశైవ క్షేత్రాలకు బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సర్వీసులు ప్రతి ఆదివారం, కార్తిక పౌర్ణమి ముందురోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి దర్శనం అనంతరం సోమవారం రాత్రికి నగరానికి చేరుకుంటాయన్నారు. టిక్కెట్‌ ఛార్జీలు రాజధాని రూ.2400, సూపర్‌లగ్జరీ రూ.1900, ఎక్స్‌ప్రెస్‌ రూ.1500గా నిర్ణయించామన్నారు.

కాగా, ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ అనేక సేవలు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇటీవలే జనరల్ బస్సు పాసులను అందుబాటులోకి తీసుకురాగా, దసరా, రాఖీపౌర్ణమి సందర్భంగా మహిళలకు లక్కీ డ్రా నిర్వహించింది. ఈ క్రమంలో ప్రయాణికులు ఎక్కువగా ఆర్టీసీ వైపే మొగ్గు చూపుతున్నారు. 

ప్రత్యేక రైళ్లు సైతం

మరోవైపు దీపావళి పండుగ సందర్భంగా ద.మ రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. 12, 14, 19, 21 తేదీల్లో.. సికింద్రాబాద్ – రాక్సోల్, నిజామాబాద్- నాందేడ్ మీదుగా జనసాధారణ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ నుంచి రాక్సోల్ (రైలు నెం. 07007)కు ఈ నెల 12, 19 తేదీల్లో ఉదయం 10:30కు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో రక్సాల్ నుంచి సికింద్రాబాద్ (07008) కు 14, 21 తేదీల్లో వస్తాయి. ఈ రైళ్లలో 22 అన్‌ రిజర్వ్‌డ్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉన్నాయని చెప్పారు. దాదాపు 2,400 మంది కూర్చుని ప్రయాణించే వెసులుబాటు కలిగి ఉంటుందని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్ , నాందేడ్, పూర్ణ తదితర తక్కువ దూరం ప్రయాణించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయని వెల్లడించారు.

ఈ స్టేషన్లలో స్టాపులు

ఈ రైళ్లకు బొల్లారం, మేడ్చల్, అక్కన్నపేట్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, బాస్మత్, హింగోలి దక్కన్, వాషిం, అకోలా, ఖాండ్వా , ఇటార్సీ, పిపారియా, జబల్పూర్, కాట్ని, సత్నా, మాణీకపూర్, ప్రయాగ్‌రాజ్‌, ఛోకీ పండిట్, డీడీ ఉపాధ్యాయ, బౌక్సర్, అరా, పాటలీపుత్ర, హాజీపూర్, ముజఫర్‌పూర్‌, సీతామర్హి జంక్షన్ స్టేషన్లలో రెండు వైపులా ప్రయాణాల్లో స్టాప్ ఉందని అధికారులు తెలిపారు. 

అయితే, సికింద్రాబాద్ వంటి పెద్ద స్టేషన్లలో రద్దీని దృష్టిలో పెట్టుకుని యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లు తీసుకోవాలని ద.మ.రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ సూచించారు. 

Also Read: Special Trains for Diwali: దీపావళికి తెలుగు రాష్ట్రాల మీదుగా 90 స్పెషల్ రైళ్లు - మీ ఏరియాకి ఏ ట్రైన్స్ వెళ్తున్నాయో చూసుకోండి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
Raashi Khanna : గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
Happy Dussehra 2024 : దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
Embed widget