Special Trains for Diwali: దీపావళికి తెలుగు రాష్ట్రాల మీదుగా 90 స్పెషల్ రైళ్లు - మీ ఏరియాకి ఏ ట్రైన్స్ వెళ్తున్నాయో చూసుకోండి!
Diwali Special Trains List: సికింద్రాబాద్ నుంచి బిహార్ లోని ఈస్ట్ చంపారన్ జిల్లాలో ఉన్న రక్సౌల్ వరకూ ప్రత్యేకంగా నాలుగు జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లుగా ప్రకటించారు.
South Central Railway News In Telugu: దీపావళి పండక్కి ఊరికి వెళ్తున్నారా? ప్రయాణికుల సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వే కొన్ని స్పెషెల్ రైళ్లను కొన్ని ఎంపిక చేసిన రూట్లలో నడుపుతోంది. దీపావళికి సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందుకు ఆ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ స్పెషల్ రైళ్లను నడుపుతున్నారు. ఈ కొత్త స్పఎషల్ రైళ్లకి సంబంధించి రైళ్ల రాకపోకలు సాగించే డేట్లు, ఆ రైళ్ల నెంబర్లతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రత్యేక చార్ట్‌లను విడుదల చేశారు. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా ఇతర రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల మధ్య నడవనున్నాయి.
సికింద్రాబాద్ నుంచి బిహార్ లోని ఈస్ట్ చంపారన్ జిల్లాలో ఉన్న రక్సౌల్ వరకూ ప్రత్యేకంగా నాలుగు జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లుగా ప్రకటించారు. ఈ రైళ్లు తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా మహారాష్ట్రలోని నాందేడ్ మీదుగా వెళ్లనున్నాయి. ఈ నాలుగు జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లను నవంబర్ 9 నుంచి 30వరకు ఎంపిక చేసిన తేదీల్లో నడవనున్నాయి.
SCR runs #SpecialTrains during #FestivalSpecials #Diwali #ChatPuja pic.twitter.com/Sf3vMP87u8
— South Central Railway (@SCRailwayIndia) November 10, 2023
SCR runs #SpecialTrains during #FestivalSpecials #Diwali #ChatPuja pic.twitter.com/F6hFCd1ZyO
— South Central Railway (@SCRailwayIndia) November 9, 2023
SCR runs #SpecialTrains during #FestivalSpecials #Diwali #ChatPuja pic.twitter.com/xhPkcRAViG
— South Central Railway (@SCRailwayIndia) November 9, 2023
#Diwali special trains between #Hyderabad - #Patna @drmhyb pic.twitter.com/hdHjEobPAq
— South Central Railway (@SCRailwayIndia) November 10, 2023