అన్వేషించండి

Telangana Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం - 70 శాతానికిపైగా పోలింగ్ - శుక్రవారమే ఫలితాలు

Telangana: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. ప్రధాన నేతలంతా తమ తమ మున్సిపాల్టీల్లో పార్టీని గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డారు.

Telangana municipal elections polling ended peacefully :  తెలంగాణలో స్థానిక సంస్థల సమరంలో భాగంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన ఈ ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనడంతో చాలా మున్సిపాలిటీల్లో భారీగా పోలింగ్ నమోదైంది. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగిందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

 భారీగా నమోదైన పోలింగ్ శాతం 

రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని మొత్తం 2,981 వార్డు డివిజన్లకు ఈ ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికే రాష్ట్ర సగటు పోలింగ్ 62 శాతంగా నమోదు కాగా, సాయంత్రం ముగిసే సమయానికి అనేక ప్రాంతాల్లో ఈ శాతం 70 దాటినట్లు తెలుస్తోంది. మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లకు గానూ భారీ సంఖ్యలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుమారు 12,944 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. పూర్తి ఓటింగ్ పర్సంటేజీపై గురువారం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

చెదురుమదురు ఘటనలు - భారీ భద్రత                                  

పోలింగ్ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మధ్య చిన్నపాటి వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. సంగారెడ్డి, నాగర్‌కర్నూల్ వంటి జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద స్వల్ప ఉద్రిక్తతలు తలెత్తినప్పటికీ, పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 41,773 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొనగా, శాంతిభద్రతల పరిరక్షణ కోసం 3,000 మంది అదనపు పోలీసు బలగాలను మొహ రించారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల కమిషన్ ప్రతి పోలింగ్ కేంద్రాన్ని నిశితంగా పర్యవేక్షించింది.                        

కౌంటింగ్ ఏర్పాట్లు - ఫలితాల వెల్లడి 

బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటించి, గెలిచిన అభ్యర్థుల వివరాలను అధికారికంగా వెల్లడిస్తారు. ఈ ఫలితాలు వెలువడిన తర్వాత ఫిబ్రవరి 16న కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, ఆపై మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల పరోక్ష ఎన్నికలు జరుగుతాయి.

ఈ మున్సిపల్ ఎన్నికలు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. గత డిసెంబర్‌లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల జోరును కొనసాగించాలని అధికార కాంగ్రెస్ భావిస్తుండగా, పట్టణ ఓటర్ల మద్దతుతో తిరిగి పుంజుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. మరోవైపు తమ బలాన్ని నిరూపించుకోవాలని బీజేపీ గట్టిగా పోటీనిచ్చింది. ఈ ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో భవిష్యత్తు ముఖచిత్రాన్ని నిర్ణయించనున్నాయి.               


 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget