అన్వేషించండి

Telangana Politics: జిల్లాల రద్దు ప్రచారంపై ఆలస్యంగా మేల్కొన్న రేవంత్ ప్రభుత్వం - మున్సిపల్ ఎన్నికల్లో నష్టం తప్పదా?

Reorganization of districts: తెలంగాణలో జిల్లాల పునర్విభజన, రద్దుపై సాగుతున్న ప్రచారానికి రేవంత్ రెడ్డి తెరదించారు. కానీ రాజకీయంగా జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Telangana districts division Politics:  తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై  వేస్తామని ప్రకటించిన  జుడీషియల్ కమిషన్ ప్రకటన అధికార పక్షానికి ఒక రకంగా సెల్ఫ్ గోల్‌గా మారింది. అశాస్త్రీయంగా ఏర్పడిన జిల్లాలను  రేషనలైజేషన్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినప్పుడే, విపక్షాలకు ఒక బలమైన రాజకీయ అస్త్రం దొరికింది. ముఖ్యంగా భూపాలపల్లి వంటి జిల్లాల రద్దుపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నా, ప్రభుత్వం చాలా కాలం పాటు మౌనం వహించడం వ్యూహాత్మక తప్పిదంగా మారింది. రద్దు ఉండదని ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటిస్తున్నప్పటికీ, అప్పటికే జరగాల్సిన రాజకీయ నష్టం జరిగిందన్నది విశ్లేషకుల అభిప్రాయం.

సెంటిమెంట్ అస్త్రంగా మార్చుకున్న బీఆర్ఎస్ 

జిల్లాలను మార్పు చేసేందుకు కమిటీ వేస్తామని ప్రభుత్వం ప్రకటించిన వెంటనే, బీఆర్ఎస్ దీన్ని ఒక సెంటిమెంట్ అస్త్రంగా మలుచుకుంది.  మేము తెచ్చిన జిల్లాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తోంది అంటూ ప్రజల్లో భావోద్వేగాల రాజకీయం చేయడంలో  గులాబీ దళం సఫలమైంది. భూపాలపల్లి వంటి సున్నితమైన ప్రాంతాల్లో ఈ ప్రచారం క్షేత్రస్థాయిలో బలంగా చొచ్చుకుపోయింది. ప్రజల్లో సెంటిమెంట్ గూడుకట్టుకున్న తర్వాత ఇప్పుడు  జిల్లాల రద్దు ఉండదు  అని ప్రకటించడం, "నష్టం జరిగిన తర్వాత మేల్కొనడం  లాంటిదేనని   భావిస్తున్నారు. అసలు ఉనికిలో లేని సికింద్రాబాద్ జిల్లా గురించి కూడా ప్రచారం జరిగిందంటే, ప్రభుత్వం తన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎంతటి వైఫల్యాన్ని మూటగట్టుకుందో అర్థమవుతోందన్న నిరాశ కాంగ్రెస్ క్యాడర్‌లో కనిపిస్తోంది. 

ప్రభుత్వ ఉద్దేశంపై వీడని సందిగ్ధత

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గతంలో   జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందని, దానిపై అధ్యయనం అవసరమని పేర్కొన్నారు. ఈ అస్పష్టతే విపక్షాలకు వరంగా మారింది. ఏ జిల్లాను రద్దు చేస్తారో లేదా వేటిని విలీనం చేస్తారో స్పష్టత ఇవ్వకపోవడం వల్ల సామాన్య ప్రజల్లో అనుమానాలు తలెత్తాయి. ఇప్పుడు రద్దు చేయబోమని చెబుతున్నా, భవిష్యత్తులో  అడ్మినిస్ట్రేటివ్ రేషనలైజేషన్  పేరుతో మార్పులు చేస్తారేమో అన్న భయం ప్రజల్లో పూర్తిగా తొలగిపోలేదు. ప్రభుత్వ వైఖరిలో ఉన్న ఈ సందిగ్ధత భవిష్యత్తులో పాలనాపరమైన ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది.

ఆలస్యంగా స్పందించడంతో రాజకీయంగా నష్టమే                                                   
 
ఏదైనా ఒక సున్నితమైన అంశంపై సోషల్ మీడియాలో, క్షేత్రస్థాయిలో తప్పుబట్టే ప్రచారం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించకపోవడం అతిపెద్ద లోపం. సమస్య జటిలమై, ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడినప్పుడు ఇచ్చే వివరణలు  అపరాధ రుసుము చెల్లించినట్టుగా ఉంటాయి తప్ప, పూర్తిస్థాయి భరోసాను ఇవ్వలేవు. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ జిల్లాల అంశం ప్రతికూల ప్రభావం చూపుతుందన్న భయంతోనే ప్రభుత్వం ఇప్పుడు నాలిక కరుచుకుని వెనక్కి తగ్గుతోందనే సంకేతాలు వెళ్తున్నాయి.  బీఆర్ఎస్ చేసిన సెంటిమెంట్ రాజకీయం ఎంత మేర ప్రజల్లో ప్రభావం చూపుతుందన్నదానిపై మున్సిపల్ ఫలితాల్లో మార్పులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.          

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
Telangana New Governor : గవర్నర్ మార్పు వెనుక బీజేపీ పెద్దల పక్కా వ్యూహం - ఇక రాజ్‌భవన్ వర్సెస్ ప్రజాభవన్ తప్పదా ?
గవర్నర్ మార్పు వెనుక బీజేపీ పెద్దల పక్కా వ్యూహం - ఇక రాజ్‌భవన్ వర్సెస్ ప్రజాభవన్ తప్పదా ?
TDP problem Kolikapudi: అదేపనిగా కెలికేస్తున్న కొలికపూడి - చర్యలు తీసుకోలేకపోతున్న టీడీపీ హైకమాండ్- సమస్య పరిష్కారం ఎలా?
అదేపనిగా కెలికేస్తున్న కొలికపూడి - చర్యలు తీసుకోలేకపోతున్న టీడీపీ హైకమాండ్- సమస్య పరిష్కారం ఎలా?
New Governor of Telangana: కొత్త గవర్నర్ అజర్ మంత్రిపదవి కాపాడతారా?
కొత్త గవర్నర్ అజర్ మంత్రిపదవి కాపాడతారా?
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ T20I World Cup Final: టీ20ల్లో భారత్, న్యూజిలాండ్ ముఖాముఖీ.. సెంచరీలు బాదడంలో టీమిండియా బ్యాటర్లదే హవా
టీ20ల్లో భారత్, న్యూజిలాండ్ ముఖాముఖీ.. సెంచరీలు బాదడంలో టీమిండియా బ్యాటర్లదే హవా
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Varanasi News: కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Embed widget