By: ABP Desam | Updated at : 14 Mar 2022 06:31 PM (IST)
టీ బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు స్వల్ప ఊరట - కానీ అంతా స్పీకర్ చేతుల్లోనే !
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం స్పీకర్ ఎదుట హాజరు కావాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. బడ్జెట్ సమావేశాల తొలి రోజు ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. వారు హైకోర్టులో పిటిషన్ వేశారు. సింగిల్ బెంచ్ స్పీకర్ నిర్ణయంపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఎమ్మెల్యేలు డివిజన్ బెంచ్‌కు హాజరయ్యారు. విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. తెలంగాణ ఎమ్మెల్యేలకు స్పీకర్ ముందు హాజరవ్వాలని ఆదేశించింది. అయితే సస్పెన్షన్ విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయం అని.. సభ్యుల హక్కులకు భంగం కలగకుండా .. వారి అభ్యర్థనలను స్పీకర్ పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. సమస్యను స్పీకర్ పరిష్కరించాలని సూచించింది.
ప్రశాంత్ కిశోర్‌కు బీజేపీ కౌంటర్ - తెలంగాణకు " యూపీ విన్నింగ్ టీం "
పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రతినిధులు సభలో ఉంటేనే ప్రజాస్వామ్యం నిలబడుతుందన్నారు. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యమన్నారు. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సభాహక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారనేందుకు ఆధారాల్లేవని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. రాజ్యాగంంలోని 14, 19, 21 ప్రకారం సభ్యుల హక్కులకు భంగం వాటిల్లుతోందని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. సభా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం హైకోర్టుకు ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇళ్లు , జాగ్వార్ కార్లు ఇస్తే టీఆర్ఎస్‌లోకి - జగ్గారెడ్డి రెడీ !
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మంగళవారమే చివరి రోజు. దీంతో చివరి రోజు సమావేశాలకైనా తమను అనుమతించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. కోర్టు తీర్పును గౌరవించాలని ఆయన అన్నారు. అయితే కోర్టు తీర్పు ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. సభా వ్యవహారాల్లో జోక్యానికి హైకోర్టు అధికారం లేదని ప్రభుత్వ న్యాయవాదులు వాదిస్తున్నారు. అందుకే హైకోర్టు ఇచ్చే నోటీసులు కూడా మొదట తీసుకోలేదు. కానీ హైకోర్టు ప్రత్యేకంగా రిజిస్ట్రీ ద్వారా నోటీసులు పంపడంతో తీసుకోకతప్పలేదు. ఈ క్రమంలో స్పీకర్ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేమంగా ఉండాలని మంత్రి హోమం - హాజరైన స్పీకర్, ఇతర మంత్రులు
మంగళవారం సీఎం కేసీఆర్ సభకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా వారం రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినప్పటికీ.. శాసనసభ చివరిరోజున అసెంబ్లీకి బడ్జెట్‌పై చర్చకు సమాధానం ఇవ్వాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ఈ కారణంగా బీజేపీ సభ్యులను అనుమతించే అవకాశం లేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. స్పీకర్‌దే తుది నిర్ణయమని హైకోర్టు కూడా చెప్పినందున నిర్ణయంలో మార్పు ఉండదని భావిస్తున్నారు.
TSRTC Offer: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్! వీరికి ఫ్రీ రైడ్ - రోజుకు ఎన్నిసార్లంటే
Rajanna Sircilla: కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సాప్ అకౌంట్, డబ్బులు కావాలని అధికారులకు మెసేజ్‌లు - ట్విస్ట్ ఏంటంటే !
TS SSC Exams: నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు, ఆ నిబంధన కచ్చితంగా పాటించాల్సిందే
Petrol-Diesel Price, 23 May: శుభవార్త! నేడూ తగ్గిన ఇంధన ధరలు, ఈ ఒక్క నగరంలోనే పెరుగుదల
Weather Updates: చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు - ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
HbA1c Test: ఆరు నెలలకోసారైనా ఈ టెస్టు చేయించుకుంటే మంచిది, డయాబెటిస్ రాకను ముందే కనిపెట్టవచ్చు
CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు
Horoscope Today 23 May 2022: ఈ రాశివారు ఎవ్వరి నుంచీ ఏమీ ఆశించకపోవడమే మంచిది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి