By: ABP Desam | Updated at : 14 Mar 2022 03:42 PM (IST)
ఇళ్లు , జాగ్వార్ కార్లు ఇస్తే టీఆర్ఎస్‌లోకి - జగ్గారెడ్డి రెడీ !
సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ( Jagga Reddy ) టీఆర్ఎస్ పార్టీకి ఓ ఆఫర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన జర్నలిస్టులకు గతంలో చెప్పినట్లుగా ఇళ్లు, జాగ్వార్ కార్లు ఇస్తే కారు పార్టీలో చేరేందుకు సిద్ధమని చెప్పారు. అసెంబ్లీ ప్రాంగణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో (TRS MLAs ) మాట్లాడుతూండగా అక్కడకు కొంత మంది జర్నలిస్టులు వచ్చారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి జర్నలిస్టుల సంక్షేమం గురించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన జర్నలిస్టులకు మేలు చేయలేదని చెప్పేందుకు.. ఇళ్లు, జాగ్వార్ కారు ఇస్తే టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్దమని ప్రకటించేశారు. జర్నలిస్టుల కోసం ఎలాంటి త్యాగానికైనా రెడీ అన్నారు.
ఏ క్షణంలోనైనా తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసే ఛాన్స్, ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు !
అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీకి ( TRS PARTY ) వ్యతిరేకంగా తాను కాంగ్రెస్ పార్టీలోకి చేరలేదని గుర్తుచేశారు. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ( Congress Party ) చేరానని గుర్తు చేశారు. తన నియోజకవర్గ ప్రజలకు తాను చెప్పుకుంటానన్నారు. జర్నలిస్టుల ఇళ్ల గృహ ప్రవేశం కాగానే టీఆర్‌ఎస్ పార్టీలో వస్తానని అ అవసరం అనుకుంటే ఒక టర్మ్ అసెంబ్లీ ఎన్నికలకు ( Assembly Elections ) సైతం పోటీ కూడా చేయనని అన్నారు. తన అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ప్రజలకు చెబుతానని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్‌పై వ్యతిరేకతతో కాంగ్రెస్‌లో చేరలేదని గుర్తు చేశారు.
అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులివ్వండి, బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
సంగారెడ్డి ( Sangareddy ) నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన జగ్గారెడ్డి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ( Revant Reddy ) వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గుంపులో సభ్యుడిని కాదని ప్రకటించేశారు. ఇటీవల సీఎల్పీ సమావేశానికి హాజరయ్యారుకానీ వెంటనే బయటకు వచ్చేశారు. ఆయన కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు చేసినప్పుడల్లా.. టీఆర్ఎస్‌లో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంటోంది. అయితేతాను టీఆర్ఎస్‌లో చేరే ప్రశ్నే లేదని చెబుతూ వస్తున్నారు.కానీ మళ్లీ ఇలా చేస్తే టీఆర్ఎస్‌లో చేరుతా.. అలా చేస్తే టీఆర్ఎస్‌లో చేరుతాననే ప్రకటనలు చేస్తున్నారు. దీంతో జగ్గారెడ్డి రాజకీయం కాంగ్రెస్ పార్టీలోనే గందరగోళంగా మారింది. జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నా... ఆయన ఎమ్మెల్యే కావడంతో ఆ పార్టీ నేతలు కూడా వీలైనంత సంయమనం పాటిస్తున్నారు.
Breaking News Live Updates: విజయనగరంలో భారీ వర్షం, మంత్రుల బస్ యాత్ర రద్దు
Karimnagar News : కస్తూర్బా స్కూల్స్ లో ఉద్యోగాలని నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్, లక్షల్లో మోసపోయిన నిరుద్యోగులు
TRS Leaders On Modi: తెలంగాణ నేలపై కమలం వికసించే ఛాన్స్ లేదు- మోదీ కామెంట్స్‌కు టీఆర్ఎస్ కౌంటర్
KTR In Davos: తెలంగాణలో హ్యుండాయ్ భారీ పెట్టుబడి- దేశాభివృద్ధికి త్రి ఐ చాలా అవసరమన్న కేటీఆర్
Hyderabad News : సరూర్ నగర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసు, వెలుగులోకి సంచలన విషయాలు
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!