Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!
Telangana News: మీకు రీల్స్ చేయడం అంటే చాలా ఇష్టమా.. ఇంట్లోనే కూర్చొని ప్రతిరోజూ రీల్స్ చేస్తుంటారా.. అయితే ఈ అద్భుతమైన ఆఫర్ మీకోసమే. మీకు నచ్చిన రీల్ చేసి 75 వేలు సొంతం చేసుకోవచ్చు.
Telangana News: ఈ మధ్య కాలంలో చాలా మంది రీల్స్ చేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు నచ్చిన రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టి వాటికి వచ్చే లైకులు, షేర్లు, కామెంట్లతో తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే దీని ప్రభావం అందరిలోనూ విపరీతంగా ఉంటోంది. కొంతమంది రీల్స్ చేయకపోయినా విపరీతంగా చూసేస్తుంటారు. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అలాంటి వాళ్ల కోసమే ప్రభుత్వం ఓ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం.
18 ఏళ్ల పైబడిన వారంతా పోటీలకు అర్హులు
తెలంగాణలో డ్రగ్స్ వాడకం రోజురోజుకూ ఎక్కువైపోతోంది. బడి పిల్లల నుంచి 30 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న వాళ్ల చాలా మంది డ్రగ్స్ తీసుకుంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్రం ప్రభుత్వం సిద్ధమైంది. సరికొత్త విధానంతో అందరిలోనూ అవగాహన కల్పించాలని సంకల్పించింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ డ్రగ్ అండ్ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జూన్ వ తేదీన షార్ట్ వీడియో కాంటెస్ట్ నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రీల్స్ ట్రెండ్ విపరీతంగా నడుస్తున్నందున.. ఇదే ట్రెండ్ తో అద్భుతమైన సందేశాల్ని ప్రజలకు చేరువ చేయాలనుకుంటోంది. డ్రగ్స్ అండ్ ఇట్స్ ఎడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ సౌసైటీ పేరుతో పోలీస్ శాఖ కాంటెస్ట్ నిర్వహించనుంది. 18 ఏళ్ల నిండిన వారంతా ఈ పోటీలకు అర్హులని తెలంగాణ సర్కారు తెలిపింది.
డ్రగ్స్ కు బానిసలైన కుటుంబ సభ్యుల బాధలను వివరించడమే ప్రధాన ఉద్దేశ్యం
డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు, డ్రగ్స్ కు బానిసలైన వారి కుటుంబ సభ్యుల బాధలను ఈ రీళ్లలో చూపించడమే పోటీ ప్రధాన ఉద్దేశం. అయితే ఈ వీడియోను 3 నిమిషాల నిడివితో రూపొందించారు. ఈ వీడియోలను జూన్ 20లోపు పంపాల్సి ఉంటుంది. ఈ పోటీలో విజేతలకు బహుమతులను కూడా అందజేయబోతున్నారు. మొదటి స్థానంలో నిలిచిన విజేతకు రూ.75 వేలు, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.50 వేల, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.30 వేలు ఫ్రైజ్ గా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఈ పోటీలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న వాళ్లు మరింత సమాచారం కోసం నిర్వాహకులను 9652394751 నంబర్ ద్వారా సంప్రదించాలని సూచించారు.