అన్వేషించండి

Internet: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్, టీవీనే కంప్యూటర్‌గా..

Telangana News: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8న దీన్ని ప్రారంభిస్తారు.

Interner Connection For 300 Rupees: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) త్వరలో గుడ్ న్యూస్ అందించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ విప్లవానికి నాంది పలికే దిశగా చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని లక్షల ఇళ్లకు దశలవారీగా రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ (Interner Connection) అందుబాటులోకి వచ్చేలా అడుగులు వేస్తోంది. ఇది వైఫై కనెక్షన్ వంటిది. ఈ కనెక్షన్ తీసుకుంటే వర్చువల్ నెట్‌వర్క్‌తో పాటు టెలిఫోన్, పలు తెలుగు ఓటీటీలను గ్రామస్థులు చూడడానికి వీలు పడుతుంది. తొలి దశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2,096 పంచాయతీల్లో అమలు చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం దీన్ని ప్రారంభిస్తారు. తర్వాత మిగిలిన గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వం 'భారత్ నెట్' (Bharat Net) పేరుతో దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఓ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి రూ.2,500 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద గ్రామాల్లో ప్రతి ఇంటికి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ఫైబర్ నెట్ కనెక్షన్ అందించాలని సర్కారు నిర్ణయించింది. టీ ఫైబర్ సంస్థ ఈ వ్యవస్థ ఏర్పాటు బాధ్యతను తీసుకుంది.

Also Read: Dil Raju Appointed As TFDC Chairman: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దిల్‌ రాజు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

టీవీనే కంప్యూటర్‌గా..

ఈ కనెక్షన్ తీసుకుంటే ప్రతీ ఇంట్లో ఉన్న టీవీనే కంప్యూటర్‌గా మారుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రతీ ఇంటికి రూ.300కే.. 20 ఎంబీబీఎస్ స్పీడ్‌తో కనెక్షన్ ఇస్తారు. దీంతో చెల్లింపులు కూడా చెయ్యొచ్చు. గ్రామంలోని అన్ని కార్యాలయాలు, స్కూళ్లకు కూడా కనెక్షన్ ఇవ్వనున్నారు. టీవీనే కంప్యూటర్‌గా మారుతుండడంతో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ జంక్షన్లు, ఇతర చోట్ల కూడా అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఫైబర్ నెట్‌తో (Fiber Net) అనుసంధానం చేయబోతున్నారు. ఇవి ప్రతి పోలీస్ స్టేషన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమవుతాయి.

'ప్రతి ఇంటికి డిజిటల్ సేవలు'

రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ అనుసంధానంతో పాటు డిజిటల్ సేవలు అందించడమే టీ - ఫైబర్ లక్ష్యమని సంస్థ ఎండీ వేణుప్రసాద్ తెలిపారు. 'టీ ఫైబర్ నెట్‌వర్క్ ఆపరేషన్స్ సెంటర్ (T NOC) నుంచి ఈ వ్యవస్థను పర్యవేక్షిస్తున్నాం. 94 మండలాల్లో, 2,096 గ్రామ పంచాయతీల్లో కమర్షియల్ సేవలు అందించేందుకు వీలుగా పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు తొలి దశలో 30 వేల ప్రభుత్వ సంస్థలను అనుసంధానించేందుకు ప్రణాళికలు చేశాం. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (పీవోసీ)లో భాగంగా తొలి దశలో మద్దూరు, సంగుపేట్, అడవి శ్రీరామ్‌పూర్ గ్రామాల్లో టీ ఫైబర్ ట్రయల్ సేవలను ఈ నెల 8న సీఎం రేవంత్ ప్రారంభిస్తారు.' అని వెల్లడించారు.

Also Read: Viral News: 25 ఏళ్ల హైదరాబాద్ విద్యార్థినితో కథ నడిపిన 65 ఏళ్ల యూకే వర్శిటీ వైస్ చాన్సలర్ - బయటపడేసరికి రోడ్డునపడ్డాడు!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan : విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మద్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మద్య తీవ్రమైన వార్‌!
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Google Chrome Hidden Tools : Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?
Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?

వీడియోలు

Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jana Nayagan : విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మద్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మద్య తీవ్రమైన వార్‌!
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Google Chrome Hidden Tools : Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?
Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
The Raja Saab OTT : 'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
Embed widget