News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Tax On New Vehicles : కొత్త బైక్, కార్ కొనాలనుకుంటున్నారా? ఇంకొంత బడ్జెట్ పెంచుకోండి - టాక్స్‌లు పెరిగాయ్

తెలంగాణలో కొత్తగా వాహనాలు కొంటే రోడ్ సేఫ్టీ సెస్ వసూలు చేయాలని నిర్ణయించారు. వారం క్రితమే లైఫ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వాహన కొనుగోలుదారులకు మరింత భారం పెరగనుంది.

FOLLOW US: 
Share:

తెలంగాణ ప్రభుత్వం  కొత్త వాహనాల కొనుగోలుపై రోడ్‌ సేప్టీ సెస్‌ను విధించాలని నిర్ణయించింది. కొత్తగా కొనుగోలు చేసే ప్రతి వాహనంపైనా ఈ సెస్‌ను వసూలు చేయనుంది. మోటారు సైకిల్‌, స్కూటర్‌, మోపెడ్‌ వంటి  వాటికి రూ.500, కార్లకు రూ.2000, వాణిజ్య రంగ వాహనాలకు రూ.2500 దాకా రోడ్‌సేఫ్టీ సెస్‌ కింద వసూలు చేయనున్నారు. అంటే ప్రతీ వాహనంపైనా రూ. 500 నుంచి రూ. 2500 వరకు పెరిగినట్లయింది. అయితే ఇదే తొలి పెంపు కాదు. వారం రోజుల కిందట వాహనాల లైఫ్‌ ట్యాక్స్‌, గ్రీన్‌ ట్యాక్స్‌, త్రైమాసిక ట్యాక్స్‌ను ప్రభుత్వం పెంచింది. 

అన్ని రకాల  వాహనాలపై విధించే జీవితకాల పన్నును  వారం క్రితం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా కొనే బైక్‌లు, స్కూటర్లపై లైఫ్‌ ట్యాక్స్‌ ఆ వాహనం ధరపై ఇప్పటి వరకు 9 శాతం ఉంది. ప్రస్తుతం వాహన ధర ఆధారంగా రూ.50 వేల లోపు అయితే 9 శాతం, రూ.50 వేలకు మించితే 12 శాతంగా నిర్ణయించారు. నిజానికి ఇప్పుడు రూ. యాభై వేలకు వచ్చే టూవీలర్ ఏదీ లేదు. టీవీఎస్ ఎక్స్ ఎల్ మోపెడ్ మాత్రమే వస్తుంది. అంటే ఆ వాహనానికి మాత్రమే తొమ్మిది శాతం పన్ను. మిగతా అన్ని వాహనాలకు పన్నెండు శాతం పన్ను వసూలు చేస్తారు. ఒక్కో వాహనంపై కొత్తగా కొనేవారికి రూ.3 వేలు అదనపు భారం పడనుంది. ఇది కొత్తగా బైక్‌లు కొనేవారికి అదనపు భారంగా మారనుంది. 

కొత్త ట్యాక్స్‌‌ల ప్రకారం బండిని బట్టి రూ.3 వేల నుంచి రూ.1.20 లక్షల దాకా అదనంగా కట్టాల్సి ఉంటుంది. నాన్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌లో త్రీవీలర్‌‌, ఫోర్‌‌ వీలర్ వాహనాల లైఫ్‌‌ ట్యాక్స్‌‌ ఇప్పటి దాకా రెండు స్లాబులుగా ఉండగా, దాన్ని నాలుగు స్లాబులుగా మార్చింది. కార్లు, జీపులు, ఆటోలు, 10 సీట్ల ఓమ్నీ బస్‌ వంటివి‌ వస్తాయి. ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖరీదైన వాహనాలకు 12 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల ఖరీదైన వాహనాలకు 14 శాతం లైఫ్‌‌ ట్యాక్స్‌‌ వేస్తున్నారు. ఇక నుంచి రూ.5 లక్షల లోపు వాహనాలకు 13 శాతం, రూ.5 నుంచి 10 లక్షల మధ్య వెహికల్స్‌కు 14 శాతం, 10 లక్షల నుంచి 20 లక్షల మధ్య వాహనాలకు 17 శాతం, రూ.20 లక్షల ధర కంటే ఎక్కువగా ఉండే వాటిపై 18 శాతంగా నిర్ణయించారు. అంటే ఒక్కో వాహనంపై సుమారు రూ.10 వేల నుంచి రూ.80 వేల వరకు అదనంగా లైఫ్‌‌ ట్యాక్స్‌‌ భారం   పడుతుంది. 

పాత వాహనాలను క్రమంగా తప్పించి నూతన సాంకేతికత, ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచాలనే లక్ష్యంతో రవాణా శాఖ పాత వాహనాలను స్క్రాప్‌ కింద పరిగణించేందుకు గ్రీన్‌ ట్యాక్స్‌ను భారీగా పెంచారు.  మోటారు సైకిల్‌, కారు వంటి వ్యక్తిగత వాహనాలకు 15 ఏళ్ల తర్వాత రీ-రిజిస్ట్రేషన్‌ సందర్భంలో రూ.2000, రూ.5000 చొప్పున గ్రీన్‌ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. కొత్త బండి కొన్నా.. పాత వాహనం కొన్నా పన్నులు మాత్రం పెరిగాయన్నమాట. 

Published at : 12 May 2022 04:07 PM (IST) Tags: Vehicle purchase burden road safety cess life tax on vehicles taxes in Telangana

ఇవి కూడా చూడండి

AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో రేపు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు

AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో రేపు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు

Nagarjuna Sagar Issue: కృష్ణాబోర్డు చేతికి నాగార్జున సాగర్ డ్యాం - కేంద్ర బలగాల పర్యవేక్షణ! సమస్యకు పరిష్కారం

Nagarjuna Sagar Issue: కృష్ణాబోర్డు చేతికి నాగార్జున  సాగర్ డ్యాం - కేంద్ర బలగాల పర్యవేక్షణ! సమస్యకు పరిష్కారం

Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో

Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో

Revant Reddy : రేవంత్ రెడ్డితో అభ్యర్థుల భేటీ - పోలింగ్ సరళిపై విశ్లేషణ !

Revant Reddy : రేవంత్ రెడ్డితో అభ్యర్థుల భేటీ - పోలింగ్ సరళిపై విశ్లేషణ !

KRMB Orders: 'సాగర్ నుంచి నీటి విడుదల ఆపండి' - ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ కీలక ఆదేశాలు

KRMB Orders: 'సాగర్ నుంచి నీటి విడుదల ఆపండి' - ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ కీలక ఆదేశాలు

టాప్ స్టోరీస్

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి

Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి

‘యానిమల్’, ‘దూత’ రివ్యూలు, 'బచ్చలమల్లి'గా అల్లరి నరేష్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘యానిమల్’, ‘దూత’ రివ్యూలు, 'బచ్చలమల్లి'గా అల్లరి నరేష్  - నేటి టాప్ సినీ విశేషాలివే!