By: ABP Desam | Updated at : 14 Aug 2021 03:44 PM (IST)
సీఎస్ సోమేశ్ కుమార్ (ఫైల్ ఫోటో)
దళిత బంధు అనేది ఒక అద్భుతమైన పథకమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. దీన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తామని, ఎవరికీ ఏ అనుమానాలు వద్దని చెప్పారు. ఈనెల 16న జరిగే సీఎం సభలో 15 మంది లబ్ధిదారులకు స్వయంగా సీఎం చెక్కులు అందిస్తారని వెల్లడించారు. ఇప్పటిదాకా ఆ 15 మంది ఎవరనేది గుర్తించలేదని తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో దళిత బంధుపై సీఎస్ సోమేశ్ కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా, కలెక్టర్ కర్ణన్ కలిసి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ సభ గురించి సమీక్షలో చర్చించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఈ పథకం కింద ప్రతి లబ్దిదారుడికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని వెల్లడించారు. ఇస్తామని ప్రకటించారు. ఈ నెల 16న సభలో 15 మందికి మాత్రమే చెక్కులు ఇచ్చినా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానం అవసరం లేదని సీఎస్ అన్నారు.
Also Read: TS Schools Reopen: తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్‌కు ముహూర్తం.. వైద్య, ఆరోగ్యశాఖ గ్రీన్ సిగ్నల్! కానీ..
ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి అనంతరం రాహుల్ బొజ్జా మాట్లాడుతూ.. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రయోగాత్మక ప్రాజెక్టుగా తీసుకుంటున్నామని తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా వచ్చిన దళితుల జాబితా తమ వద్ద ఉందని తెలిపారు. ఈ జాబితాలో వివరాలు లేనివారిని కూడా కొత్తగా నమోదు చేస్తారని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి నలుగురు కో-ఆర్డినేటర్లు ఉంటారని.. గ్రామ సభ ద్వారా లబ్దిదారులను గుర్తిస్తారని వెల్లడించారు. రక్షక నిధిని కూడా ఏర్పాటు చేస్తామని రాహుల్ బొజ్జా వివరించారు.
Also Read: Nityananda: ఆ పీఠంపై కన్నేసిన నిత్యానంద.. ఒక్క ప్రకటనతో దుమారం.. వెంటనే తాళాలు వేసి, గదులు సీజ్
లబ్ధిదారులపై సాగుతున్న కసరత్తు
ఈ నెల 16 మధ్యాహ్నం 2 గంటలకు హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం శాలపల్లి గ్రామంలో బహిరంగ సభ వేదికగా 15 మంది దళితులకు దళిత బంధు నిధులను కేసీఆర్ అందించనున్నారు. లబ్ధిదారుల ఎంపికపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇవాళ రాత్రిలోపు లిస్టు ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. జాబితాను రేపు సీఎం కేసీఆర్‌కు జిల్లా కలెక్టర్ కర్ణన్ పంపనున్నారు. సీఎం ఆమోదంతో తొలి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు. మరోవైపు, నియోజకవర్గంలో అందరికీ దళిత బంధు ఇవ్వాల్సిందేనని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు రెండు రోజులుగా ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే.
Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!
Modi Flexis on Flyover: హైదరాబాద్ ఫ్లై ఓవర్ పిల్లర్లపై మోదీ పోస్టర్లు, ఇంకెన్నాళ్లు కడతారని విమర్శలు
Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!
Hyderabad Crime News: హైదరాబాద్లో గుప్తనిధుల కలకలం, తొమ్మిది మంది అరెస్ట్
Breaking News Live Telugu Updates: టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి, శ్రీవారి భక్తుల మధ్య వాగ్వాదం - బూతులు తిట్టుకున్న ఇరువురు!
పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ - అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన
మార్గదర్శి కేసులో మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు
EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు
PAN- Aadhaar Link: పాన్-ఆధార్ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?
Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా