By: ABP Desam | Updated at : 31 Dec 2021 08:06 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఎమ్మెల్యే జగ్గారెడ్డి, క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ బైలాస్ పాటించలేదంటూ ఆరోపణలు చేశారు. ఈ విషయం తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపాయి. వీటితో పాటు ఇటీవల పార్టీలో చోటుచేసుకున్న ఘటనలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. క్రమశిక్షణ కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నామనని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి అన్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు ఉంటే పార్టీలో చర్చించాలన్నారు. విభేదాలు ఉంటే అధిష్టానం, పార్టీ ఇంఛార్జ్ కి లేఖలు రాయవచ్చని, కానీ పార్టీ అంతర్గత విషయాలు బహిర్గతం చేయవద్దని కోరారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డిని క్రమశిక్షణ కమిటీకి పిలిచి మాట్లాడతామని చిన్నారెడ్డి అన్నారు. జగ్గారెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘించినట్లుగా భావిస్తున్నామన్నారు. జగ్గారెడ్డిని త్వరలో కమిటీ ముందుకు పిలుస్తామన్నారు. ఆయనపై చర్యలు తమ పరిధిలోకి రావని చిన్నారెడ్డి అన్నారు.
Also Read: టీ పీసీసీ చీఫ్‌ను మార్చండి .. సోనియా , రాహుల్‌లకు జగ్గారెడ్డి లేఖ !
వీహెచ్ వాహనంపై దాడి
'సోనియాగాంధీకి రాసిన లేఖ ఎలా లీక్ అవుతుంది. రాబోయే కొత్త సంవత్సరంలో కొత్త సాంస్కృతిని ఆచరిస్తారని ఆశిస్తున్నాం. జనగామ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డికి ఇచ్చిన నోటీస్ ల పై వివరణ ఇచ్చారు. ఈ విషయంలో లోతుగా చర్చించాం, కానీ కమిటీ సంతృప్తి చెందలేదు. మళ్లీ ఒక్కసారి జంగా రాఘవరెడ్డితో మాట్లాడాల్సి ఉందని కమిటీ నిర్ణయించింది. మంచిర్యాల జిల్లా మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు అనుచరులు వీహెచ్ వాహనం పై దాడి చేశారు. ఈ ఇష్యులో డీసీసీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావులతో చర్చించాలని భావిస్తున్నాం. దాడి సమయంలో ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక్షంగా అక్కడ లేరు. పార్టీలో కొన్ని ప్రాంతాలలో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో అలాంటి పరిస్థితి ఉన్నట్లు కమిటీ దృష్టికి వచ్చింది. కమిటీ ఆయా జిల్లాల్లో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. 2018 ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వారిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు వారంతా మళ్లీ తిరిగి పార్టీలోకి వస్తామని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఆ విజ్ఞప్తులను టీపీసీసీకి అందజేస్తాం. పీసీసీ ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటుంది.
చిన్నారెడ్డికి జగ్గారెడ్డికి కౌంటర్
ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘించారని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించకుండా పార్టీ కార్యక్రమాలపై ప్రకటనలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కూడా కమిటీ ముందుకు పిలవాలన్నారు. అప్పుడే తాను కమిటీ ముందు వస్తానన్నారు. సోనియాగాంధీకి తాను రాసిన లేఖ మీడియాకు ఎలా లీక్ అయ్యిందో తెలియదని మీడియా ద్వారా వివరణ ఇచ్చానన్నారు. తన లేఖపై క్రమశిక్షణ కమిటీకి ఎవరైనా ఫిర్యాదు ఇచ్చారా, మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా తీసుకున్నారో ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. పార్టీలో చర్చించకుండా పెద్దపల్లి అభ్యర్థిని ప్రకటించి రేవంత్ రెడ్డి పార్టీ లైన్ దాటారన్నారు. ఆయనపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. క్రమశిక్షణ కమిటీ ముందుకు రేవంత్‌రెడ్డిని పిలిచిన తరువాత తనను పిలిస్తే తప్పకుండా హాజరవుతా అని జగ్గారెడ్డి అన్నారు.
Breaking News Telugu Live Updates: రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం, సీఎం జగన్, చంద్రబాబు హాజరు
DK Aruna : బీజేపీ ఎదుగుదలను తట్టుకోలేక రాళ్ల దాడులు - డీకే అరుణ
Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!
Jagadish Reddy: కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఇవే చివరి ఎలక్షన్స్, ఈడీ బోడీలు ఏం చేయలేవు - మంత్రి జగదీశ్ వ్యాఖ్యలు
Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం
NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్‌తో - క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
Pawan Kalyan: పదవులపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు, 2009లోనే ఎంపీ అయ్యేవాడినన్న జనసేనాని
Ola Electric Car: చూడగానే కొనాలనిపించే ఓలా ఎలక్ట్రిక్ కారు - కేవలం నాలుగు సెకన్లలోనే - మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్లు!
Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?