By: ABP Desam | Updated at : 27 Dec 2021 05:44 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కాంగ్రెస్ రచ్చబండ ఉద్రిక్తం
సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవల్లిలో కిసాన్ కాంగ్రెస్ చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పీసీసీ అధ్యక్షుడు ఏ. రేవంత్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడం రాజ్యాంగ హక్కులను కాలరాయడమే అని ఆరోపించారు. రచ్చబండ కార్యక్రమానికి వెళుతున్న సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి మంథని, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను హౌస్ అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు. రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీలకు రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛ, నిరసన తెలిపే హక్కులను టీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాస్తుందని ఆరోపించారు.
Govt’ discourages farmers from cultivating paddy…
— Revanth Reddy (@revanth_anumula) December 27, 2021
But irony is @TelanganaCMO cultivates paddy in 150 acres in his farmhouse.
Farmers are committing suicides unable to sell paddy…
CM should explain where and at what price he proposes to sell paddy cultivated in his farm house. pic.twitter.com/CTDb3nIkQB
Also Read: తీవ్ర తోపులాటల మధ్య రేవంత్ రెడ్డి అరెస్టు.. చిరిగిన మల్లు రవి చొక్కా, పీఎస్‌కు తరలింపు
రైతులకు అండగా కాంగ్రెస్
సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజాస్వామిక వాదులు, తెలంగాణ పోరాటయోధులు, కవులు, కళాకారులు, మేధావులు తప్పక స్పందించాలని మధు యాష్కీ గౌడ్ అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలను పోలీసులు ఇనుపకంచెలు ఆపలేవన్నారు. ఉక్కు పాదాల కింద భావవ్యక్తీకరణను ఆపే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ శ్రేణులు అంతే ధాటిగా స్పందిస్తాయన్నారు. చరిత్రలో వరి వేయవద్దని పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్ మాత్రమే అని విమర్శించారు. రైతులకు మేలు చేయాల్సిన ముఖ్యమంత్రే వారికి వరి వేస్తే ఉరేనని చెప్పడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్న ఆయన.. రైతుల కోసం పోరాటాలు, ఉద్యమాలు చేసేందుకు యావత్ కాంగ్రెస్ నాయకత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులెవరూ అధైర్య పడాల్సిన పనిలేదన్నారు. ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనేవరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Also Read: రేవంత్ హౌస్ అరెస్టు.. అన్ని దారులు మూసేసిన పోలీసులు.. ‘కేసీఆర్‌కి ఎందుకీ భయం’ అంటూ ట్వీట్
కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్టు
గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్‌లో 150 ఎకరాలలో వరి పంట సాగుచేశారని, దానిని మీడియాకు చూపిస్తానని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఎర్రవెల్లిలో రచ్చబండకు సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. ఇంతలో పోలీసులు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. హౌస్ అరెస్టులు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఆదివారం అర్ధరాత్రి నుంచే పోలీసులు పహారా కాశారు. రచ్చబండకు వెళ్లేందుకు రేవంత్ ఇంటి నుంచి బయటికి రాగానే పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన బాలయ్య.. ఆ పని అద్భుతమని ప్రశంసలు
Teachers Transfers: టీచర్ల బదిలీ షెడ్యూలు విడుదల, పదోన్నతులు లేనట్లే!
Hyderabad Crime: ప్రేమ కథ విషాదాంతం - ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య
Harish Rao: సిద్దిపేట్ రైల్వే లైన్ - కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్న మంత్రి హరీష్ రావు
TSRTC చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్దన్ పదవీ కాలం పూర్తి, ఘనంగా వీడ్కోలు పలికిన ఉన్నతాధికారులు
Minister KTR: నేను వెళ్లిపోయినా కొప్పుల ఈశ్వర్ కేసీఆర్తోనే ఉంటా అన్నడు - కేటీఆర్
KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
RK Roja: మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత
Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'
Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!
/body>