అన్వేషించండి

Revanth Reddy: ఈ వరదలు జాతీయ విప‌త్తు, ప్రధాని మోదీ రావాలి - రేవంత్ విన్నపం

Telangana News: ఈ వరదలను జాతీయ విప‌త్తుగా ప్రక‌టించాలని రేవంత్ రెడ్డి ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ విప‌త్తు ప‌రిశీల‌న‌కు రావాల‌ని విన్నవించారు.

Revanth Reddy Review on Floods: భారీ వ‌ర్షాల‌తో పెద్ద సంఖ్య‌లో ప్రాణ న‌ష్టం.. ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట న‌ష్టం వాటిల్లినందున జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.  ప్రాణ‌, పంట న‌ష్టాల‌తో పాటు భారీగా ఆస్తి న‌ష్టం వాటిల్లినందున స్వ‌యంగా ప‌రిశీల‌న‌కు రావాల‌ని ప్ర‌ధాన‌మంత్రిని కోరుతూ లేఖ రాయాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారిని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లోని క‌మాండ్ కంట్రోల్ రూంలో ఉన్న‌తాధికారుల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం ఉద‌యం స‌మీక్ష నిర్వ‌హించారు. అతి త‌క్కువ స‌మ‌యంలో ఇంత భారీ వ‌ర్షాలు కుర‌వ‌డానికి కార‌ణాలు, ఈ రోజు, రేప‌టి ప‌రిస్థితుల‌పై వాతావ‌ర‌ణ శాఖ అధికారుల‌ను అడిగారు. ఊహించిన దానిక‌న్నా ఎక్క‌వ వ‌ర్షాలు వ‌చ్చాయ‌ని, గ‌తంలో అయిదేళ్ల‌కో, ప‌దేళ్ల‌కో ఇలా వ‌చ్చేవ‌ని.. ఇటీవ‌ల త‌ర‌చూ వ‌స్తున్నాయ‌ని, దీనిపై మ‌రింత అధ్య‌య‌నాలు జ‌రుగుతున్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. 

ఈ రోజు, రేపు ఆదిలాబాద్‌, నిజామాబాద్, నిర్మ‌ల్ జిల్లాల్లో వ‌ర్షాలు ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు. ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని అప్ర‌మ‌త్తం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. లోత‌ట్టు ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను అవ‌స‌ర‌మైతే వెంట‌నే స‌హాయ‌క శిబిరాల‌కు త‌ర‌లించాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. జిల్లా క‌లెక్ట‌రేట్ల‌లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి 24 గంట‌లు ప‌ర్య‌వేక్ష‌ణ కొన‌సాగించాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. చెరువులు, క‌ల్వ‌ర్టులు, లోలెవ‌ల్ కాజ్‌వేలు ఇత‌ర ప్ర‌దేశాల్లో వివిధ శాఖల అధికారుల‌తో ప‌ర్య‌వేక్ష‌ణ చేయించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాతావ‌ర‌ణ ప‌రిస్థితులపై ప్ర‌తి మూడు గంట‌ల‌కో బులెటిన్ విడుద‌ల చేయాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.

ప‌రిహారం పెంపు...
వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు ప‌రిహారం రూ.4 ల‌క్ష‌ల నుంచి రూ.5 ల‌క్ష‌ల‌కు, పాడి ప‌శువుల‌కు ఇచ్చే ప‌రిహారం రూ.30 వేల నుంచి రూ.50 వేల‌కు, మేక‌లు, గొర్రెల‌కు రూ.3 వేల నుంచి రూ.5 వేల‌కు ప‌రిహారం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.  ఇళ్లు కూలిపోయిన వారికి ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

పంట న‌ష్టంపైనా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రాథ‌మిక అంచ‌నాల ప్ర‌కారం రూ.ల‌క్ష‌న్న‌ర ఎక‌రాల‌కుపైగా పంట న‌ష్టం వాటిల్లింద‌ని అధికారులు తెలిపారు. 4 ల‌క్ష‌ల‌కుపైగా ఎక‌రాల్లో పంట న‌ష్టం వాటిల్లిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయ‌ని, త‌క్ష‌ణ‌మే రంగంలోకి దిగి పంట న‌ష్టం వివ‌రాలు సేక‌రించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కామారెడ్డిలో వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు పంట న‌ష్ట ప‌రిహారం వెంట‌నే విడుద‌ల చేశామ‌ని, ప్ర‌స్తుతం అలా చేసేందుకు ఏర్పాట్లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. ఆయా వివ‌రాల‌ను స‌మ‌గ్రంగా పేర్కొంటూ కేంద్ర ప్ర‌భుత్వ బృందాలు సైతం త‌క్ష‌ణ‌మే పంట న‌ష్ట ప‌రిశీల‌న‌కు వ‌చ్చే ఏర్పాట్లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. 

యువ పోలీసుల‌కు ఎన్‌డీఆర్ఎఫ్ త‌ర‌హాలో శిక్ష‌ణ‌...
రాష్ట్రంలోని 8 బెటాలియ‌న్ల‌లో మూడో వంతు యువ పోలీసుల‌కు ఎన్‌డీఆర్ఎఫ్ త‌ర‌హాలో శిక్ష‌ణ ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశించారు. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ఎన్‌డీఆర్ఎఫ్ నుంచి త‌క్ష‌ణం ఎందుకు అంద‌డం లేద‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు. మ‌నం పెట్టిన ఇండెంట్ ఆధారంగా వాళ్ల ద‌గ్గ‌ర ఉన్న బ‌ల‌గాల‌ను పంపుతార‌ని, ఇందుకు స‌మ‌యం ప‌డుతుంద‌ని అధికారులు బ‌దులిచ్చారు.  స్పందించిన ముఖ్య‌మంత్రి మ‌న బెటాలియ‌న్ల‌లోని యువ పోలీసుల‌కు ఎన్‌డీఆర్ఎఫ్ త‌ర‌హాలో శిక్ష‌ణ ఇవ్వాల‌ని ఆదేశించారు. ఎక్విప్‌మెంట్ స‌మ‌స్య‌గా ఉంటుంద‌ని అధికారులు తెల‌ప‌గా.. ఎంత ఖ‌ర్చ‌యినా ఫ‌ర్వాలేద‌ని, వెంట‌నే కొనుగోలు చేయాల‌ని సూచించారు. ఒడిశా, గుజ‌రాత్‌ల్లో అలా శిక్ష‌ణ ఇచ్చి బృందాలు ఏర్పాటు చేసుకున్నాయ‌ని అధికారులు తెల‌ప‌గా... అవ‌స‌ర‌మైతే అక్కడి విధానాల‌ను అధ్య‌య‌నం చేయాల‌ని, అక్క‌డి అనుభ‌వం ఉన్న‌వారితో శిక్ష‌ణ ఇప్పించాల‌ని సీఎం సూచించారు.  దానికోసం ఒక మాన్యువ‌ల్ రూపొందించాల‌ని, ప్ర‌తి సీజ‌న్ ముందు శిక్ష‌ణ ఇప్పించిన సిబ్బందితో రిహార్స‌ల్స్ చేయించాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Farmhouse Drug Party: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్

వీడియోలు

Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Seetha Payanam OTT : ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Petrol Pump Scam: ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
Embed widget