అన్వేషించండి

Telangana Budget 2024-25: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి భారీగా నిధులు - రంజాన్ వేడుకలకు రూ.33 కోట్లు, మైనార్టీ విద్యార్థులకు గుడ్ న్యూస్

Telangana News: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ మేరకు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించినట్లు చెప్పారు.

Telangana Budget 2024-25 Highilights: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్ఫష్టం చేశారు. ఈ మేరకు బడ్జెట్‌లో ఆయా వర్గాలకు భారీగా నిధులు కేటాయించారు. ఎస్సీ సంక్షేమం కోసం రూ.33,124 కోట్లు, ఎస్టీ సంక్షేమం కోసం రూ.17,056 కోట్లు ప్రతిపాదించారు. 'షెడ్యూల్డ్ కులాల, తెగల అభివృద్ధికి చట్టపరంగా కేటాయించాల్సిన నిధులు కచ్ఛితంగా అందిస్తాం. ఆ నిధులు వేరే ఎలాంటి పథకాలకు మళ్లించకుండా వంద శాతం షెడ్యూల్డ్ కులాల, తెగల కోసమే ఉపయోగిస్తాం. ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో పాటు మైనార్టీ విద్యార్థులకు 2024-25 లో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నాం.' అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మైనార్టీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం సహా లోకల్ అభ్యర్థులకు నెలకు రూ.2,500, నాన్ లోకల్ అభ్యర్థులకు రూ.5,000 స్టైఫండ్ ఇస్తున్నట్లు చెప్పారు.
 
'రంజాన్ వేడుకలకు రూ.33 కోట్లు'
 
ఈ ఏడాది రంజాన్ వేడుకల కోసం రూ.33 కోట్లు కేటాయించినట్లు మంత్రి భట్టి తెలిపారు. అషూర్ ఖానాల పునరుద్ధరణకు, నిర్వహణకు రూ.50 లక్షలు మంజూరు చేశామన్నారు. 'ఈ ఏడాది జనవరిలో జరిగిన తబ్లీగీ జమాత్ ఇస్లామిక్ సమావేశానికి రూ.2.40 కోట్లు విడుదల చేశాం. ముస్లిం సోదర సోదరీమణుల హజ్ యాత్రకు రూ.4.43 కోట్లు మంజూరు చేశాం. మైనార్టీ సంక్షేమ శాఖకు బడ్జెట్‌లో రూ.3,003 కోట్లు ప్రతిపాదిస్తున్నాం.' అని పేర్కొన్నారు.
 
బీసీ సంక్షేమానికి..
 
మన రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి తెలిపారు. వారి వికాసానికి పలు పథకాలను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. బీసీ సంక్షేమానికి రూ.9,200 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. 'గీత కార్మికులు కల్లు గీసే క్రమంలో ప్రమాదాలకు గురి కాకుండా కిట్స్ అందిస్తున్నాం. క్రొత్తగా ముదిరాజ్, యాదవ కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేరా, గంగపుత్ర కులాలకు 8 కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఆర్ధికంగా వెనుకబడిన కులాల (EBC) సంక్షేమం కోసం ఒక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేశాం. ఇవి వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి తోడ్పడుతాయి.' అని పేర్కొన్నారు.
 
స్కిల్ యూనివర్శిటీ..
 
మరోవైపు, తెలంగాణ యువకుల్లో ప్రపంచ స్థాయి నైపుణ్యాలను పెంపొందించాలనే లక్ష్యంగా ఉన్నామని భట్టి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే హైదరాబాద్‌లో పబ్లిక్ - ప్రైవేట్ భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్శిటీ (Skill University)ని స్థాపించి నడిపించనున్నట్లు చెప్పారు. ఈ వర్శిటీలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. 17 రకాల నైపుణ్యాలను నేర్పనున్నామని.. వీటిలో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ కోర్సులు ఉంటాయని పేర్కొన్నారు. దీని ద్వారా పరిశ్రమల్లో యువతకు సులువుగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు.
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget