అన్వేషించండి

Telangana Budget 2024-25: భాగ్యనగర అభివృద్ధికి రూ.10 వేల కోట్లు - ఓఆర్ఆర్, మూసీ ప్రాజెక్టులపై బడ్దెట్‌లో కీలక ప్రకటన, ట్రాఫిక్ కష్టాలు తీరుతాయ్!

Telangana News: తెలంగాణ బడ్జెట్‌లో హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఆర్ఆర్ఆర్, మెట్రో రైల్ విస్తరణ, మూసీ ప్రాజెక్టులు, విపత్తుల నిర్వహణకు రూ.10 వేల కోట్లు కేటాయించింది.

Budget Allocations For Hyderabad Development: తెలంగాణకు మణిహారమైన హైదరాబాద్ (Hyderabad) అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో నగర అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించారు. శంషాబాద్ విమానాశ్రయం వరకూ మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ.1500 కోట్లు, ఆర్ఆర్ఆర్ (రీజనల్ రింగ్ రోడ్డు) ప్రాజెక్టుకు రూ.1,525 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు, హైడ్రా సంస్థకు రూ.200 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్‌కు రూ.3,385 కోట్లు కేటాయించారు. నగరంలో పారిశుద్ధ్య, మురుగు, నీటి, తాగునీటి సమస్యలు గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైనట్లు భట్టి విమర్శించారు. భాగ్యనగరాన్ని మరింత ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామన్నారు.

విపత్తుల నిర్వహణకు ఏకీకృత సంస్థ

  • హైదరాబాద్, ఓఆర్ఆర్ వరకూ గల ప్రాంతాలను కోర్ అర్బన్ రీజియన్‌గా గుర్తించి వాటి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని భట్టి విక్రమార్క అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డును నగర సరిహద్దుగా పరిగణిస్తామన్నారు. 'ఓఆర్ఆర్ పరిధిలో విపత్తుల నిర్వహణకు ఒక ఏకీకృత సంస్థ ఏర్పాటు చేస్తాం. జీహెచ్ఎంసీ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయి' అని పేర్కొన్నారు.
  • పట్టణ విపత్తుల నివారణకు, వాటిని ఎదుర్కొనడానికి తీసుకోవాల్సిన చర్యలను చేపట్టడంతో పాటు, ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొని తక్షణ రక్షణ చర్యలు తీసుకొనే విషయంలో జాతీయ, రాష్ట్రేతర సంస్థలతో సమన్వయాన్ని HYDRAA చేస్తుంది. ఈ సంస్థలో ఆస్తుల పరిరక్షణకు, విపత్తుల నిర్వహణకు ప్రత్యేక విభాగాలు ఉంటాయి. బడ్జెట్‌లో హైడ్రా సంస్థకు రూ.200 కోట్లు కేటాయించారు.
  • మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా సుమారు 110 చదరపు కి.మీల పట్టణ ప్రాంతం పునరుజ్జీవనం చెందుతుంది. అలాగే, నదీ తీర ప్రాంతంలో క్రొత్త వాణిజ్య, నివాస కేంద్రాలు వెలిసి, పాత హెరిటేజ్ ప్రాంతాలు క్రొత్తదనాన్ని సంతరించుకుంటాయి. ఈ ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో రూ.1500 కోట్లు ప్రతిపాదించారు. 
  • GHMC పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.3,065 కోట్లు కేటాయింపు. HMDA పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్ల, మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి మెట్రో వాటర్ వర్క్స్‌కి రూ.3,385 కోట్లు ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. 
  • ఎయిర్ పోర్ట్ వరకూ మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, ఓఆర్ఆర్‌కు రూ.200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.500 కోట్లు, పాత నగరానికి మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్‌కు రూ.50 కోట్లు కేటాయింపు. రీజనల్ రింగ్ రోడ్డు అభివృద్ధి వేగవంతం చేసేలా చర్యలు.
  • ఉత్తర ప్రాంతంలోని 158.6 కి.మీ. పొడవున్న సంగారెడ్డి – తూప్రాన్ – గజ్వేల్ -  చౌటుప్పల్ రోడ్డును, దక్షిణ ప్రాంతంలోని 189 కి.మీ.ల పొడవున్న చౌటుప్పల్ -షాద్ నగర్-సంగారెడ్డి రోడ్డును, జాతీయ రహదారులుగా ప్రకటించడానికి వీలుగా అప్ గ్రేడ్ చేయాలని ప్రతిపాదన. ఆర్ఆర్ఆర్ హైదరాబాద్ నగర ఉత్తర దక్షిణ ప్రాంతాలనూ, తూర్పు పశ్చిమ ప్రాంతాలనూ కలుపుతూ జాతీయ రహదారి నెట్ వర్క్‌తో అనుసంధానం.
  • ఎక్స్ ప్రెస్‌వే ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని దీని నిర్మాణానికి తగినంత భూమిని సేకరించే ప్రయత్నం. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా తొలుత నాలుగు లేన్లతో నిర్మించి దానిని 8 లేన్ల సామర్థ్యానికి విస్తరణ. దీంతో ఓఆర్ఆర్ (ORR)కు ఆర్.ఆర్.ఆర్ (RRR) కు మధ్య పలు పరిశ్రమలు, వాణిజ్య సేవలు, రవాణా పార్కుల అభివృద్ధి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఆర్.ఆర్.ఆర్ ఉత్తర ప్రాంతం అభివృద్ధికి రూ.13,522 కోట్లు, దక్షిణ ప్రాంతాభివృద్ధికి రూ.12,980 కోట్లు ఖర్చు. ఈ మేరకు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి ప్రతిపాదనలు వివరించారు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Embed widget