అన్వేషించండి

Bandi sanjay Bus Yatra : తెలంగాణ బీజేపీ నేతల బస్సు యాత్రలు - ఎన్నికల వరకూ ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ !

తెలంగాణ బీజేపీ నేతలు రెండు గ్రూపులుగా మారి బస్సు యాత్రలు చేయాలని నిర్ణయించుకున్నారు. సంక్రాంతి తర్వాత వీరి యాత్రలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Bandi sanjay Bus Yatra : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ బస్సు యాత్రకు ప్లాన్ చేస్తోంది. జనవరి 16 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నియోజకవర్గాల పర్యటన తర్వాత బస్సు యాత్రకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. బండి సంజయ్, బీజేపీ సీనియర్ నేతలు వేర్వేరుగా యాత్రలు చేసే అవకాశం ఉంది.  బస్సు యాత్రలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మీటింగ్స్, పబ్లిక్ మీటింగ్స్ పెట్టాలని నిర్ణయించింది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ జనంలోకి వెళ్లాలని ప్రణాళికలు రచిస్తోంది. ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాల్లో బస్సు యాత్రలు ఉండేలా బీజేపీ కార్యచరణ రూపోందిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర పూర్తి అయ్యాక పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రానికి చేరుకుని భారీ బహిరంగా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలు్సతోంది. 

బీజేపీ నేతలకు ప్లాన్ ఇచ్చి వెళ్లిన బీఎల్ సంతోష్ 

బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు విస్తారక్, పాలక్ ల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ గెలిచేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ‘కేసీఆర్ హటావో.. తెలంగాణ బచావో’ పేరుతో ప్రజల్లోకి వెళ్తాలని నిర్ణయించుకున్నామని ఆ పార్టీ నేత లక్ష్మణ్ ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు ఉచిత వైద్యం, విద్య అందిస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్‌లో అమిత్ షా  లేదా  జేపీ నడ్టా   తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారన్నారు. బహిరంగ సభలో కేసీఆర్ ప్రభుత్వం పై ఛార్జ్ షీట్ విడుదల చేస్తామన్నారు. 

బీజేపీకి అభ్యర్థుల కొరత లేదన్న లక్ష్మణ్ 

ప్రతి నియోజకవర్గంలో బీజేపీ టికెట్ కోసం నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారని, తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా బీఎల్ సంతోష్  ఆధ్వర్యంలో రూట్ మ్యాప్ రూపొందించామని చెప్పారు.  తెలంగాణలో అత్యధిక లోక్‌సభ స్థానాల్లో గెలుపు కోసం నాలుగంచెల వ్యవస్థ ఏర్పాటు చేశామని లక్ష్మణ్ తెలిపారు.  మూడు నెలల కాలంలో వేల సంఖ్యలో మండల, జిల్లా స్థాయిలో మీటింగ్స్ ఉంటాయని, జనవరి 20 నుంచి ‘ప్రజా‌ గోస.‌.‌ బీజేపీ భరోసా’ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళతామన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుంటున్న విధానాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. కేంద్రం పంచాయతీలకు ఇస్తున్న నిధులను దోచుకుంటున్నారని టీఆర్ఎస్ సర్పంచులే చెబుతున్నారన్నారు.  

ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఉద్దేశంతో  బస్సు యాత్రలు చేయాలని నిర్ణయం 

బండి సంజయ్ ఇప్పటికే పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. ఐదు విడతల పాదయాత్ర పూర్తి చేశారు. ఆరో విడత కూడా చేద్దామనుకున్నా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్న సూచనలు కనిపించడంతో .. బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. బండి సంజయ్ ఒక్కరే అయితే తెలంగాణ మొత్తం కవర్ చేయడం కష్టం కాబట్టి.. ఇతర సీనియర్ నేతలు కూడా కలసి కట్టుగా మరో బస్ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 

కొత్త బస్టాండ్‌ రేపిన చిచ్చు! దుబ్బాకలో మరింత ముదిరిన వివాదం - పోలీసుల భారీ బందోబస్తు

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Food Adulteration: లొట్టలేసుకుంటూ తింటున్నారా.. హైదరాబాద్‌లో 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్
లొట్టలేసుకుంటూ తింటున్నారా.. హైదరాబాద్‌లో 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్
Breaking News: బెయిల్ వచ్చిన వెంటనే ప్రశ్న రావణ్ అరెస్ట్.. జైల్లోనే చంపేయాలంటూ సంచలన వ్యాఖ్యలు
బెయిల్ వచ్చిన వెంటనే ప్రశ్న రావణ్ అరెస్ట్.. జైల్లోనే చంపేయాలంటూ సంచలన వ్యాఖ్యలు
IIIT Student Commits Suicide: ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య.. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విషాదం
ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య.. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విషాదం
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget