అన్వేషించండి

DSC Exams: తెలంగాణ డీఎస్సీ పరీక్షలు వాయిదా? ఆందోళనలో అభ్యర్థులు- ఎందుకంటే!

రాష్ట్రంలో నవంబరు 20 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎన్నికల షెడ్యూలు వెల్లడితో.. నవంబరులో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును ఎన్నికల సంఘం ఎట్టకేలకు వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 30న ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పుడిదే డీఎస్సీ అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో నవంబరు 20 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఒకే రోజు డీఎస్సీ, పోలింగ్ ఉండటంతో పరీక్షలు వాయిదా పడే సూచనలు ఉన్నాయి.

పరీక్ష వాయిదా విషయంపై విద్యాశాఖ త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అక్టోబర్ 21 వరకు డీఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు అక్టోబర్‌ 20లోగా నిర్ణీత ఫీజు చెల్లించి, అక్టోబరు 21లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. 

ఎన్నికల షెడ్యూలు వెల్లడితో.. నవంబరులో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. దీనిపై అధికారుల నుంచి స్పష్టం రావాల్సి ఉంది. అయితే ఏరకంగా చూసిన డీఎస్సీ పరీక్షలు వాయిదాపడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. 

ఎన్నికల షెడ్యూల్‌ ఇదే..

➥ ఎన్నికల నోటిఫికేషన్:  03.11.2023

➥ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తేదీ: 03.11.2023.

➥ ఎన్నికల నామినేషన్లకు తుదిగడువు: 10.11.2023.

➥ నామినేషన్ల పరిశీలన తేదీ:  13.11.2023.

➥ నామినేషన్ల  ఉపసంహరణకు చివరి తేదీ: 15.11.2023.

➥ పోలింగ్‌ తేదీ: 30.2023

➥ కౌంటింగ్ తేదీ: 03.12.2023.

డీఎస్సీ పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ నవంబర్‌ 20, 21 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలను నిర్వహించనున్నారు. 

➥ నవంబర్‌ 22న స్కూల్‌ అసిస్టెంట్‌ లాంగ్వెజ్‌ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి. 

➥ నవంబరు 23న ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టుల అభ్యర్థులకు నిర్వహిస్తారు. వీరందరికీ మొదటి విడతలోనే పరీక్షలు నిర్వహించి పూర్తి చేయనున్నారు. 

➥ నవంబరు 24న లాంగ్వేజ్‌ పండిట్‌ అభ్యర్థులకు రెండు విడతల్లో నిర్వహించనున్నారు.

➥ నవంబరు 25 నుండి 30 వరకు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిని ప్రతీ రోజూ రెండు విడతల్లో నిర్వహించనున్నారు. 

Notification

TS DSC 2023 Details

Online Application

Website

తెలంగాణలోని ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 7న నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిద్వారా మొత్తం 5089 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే డీఎస్సీ పరీక్ష తేదీలు, సిలబస్‌, అర్హతలను విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. ఆన్‌లైన్‌ పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ.. సెప్టెంబరు 20న అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం నవంబర్‌ 20 నుంచి 30 వరకు సబ్జెక్టుల వారీగా డీఎస్సీ పరీక్షల తేదీలను విద్యాశాఖ ఖరారు చేసింది. ప్రతీ రోజూ రెండు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి 11.30 వరకు మొదటి విడత, రెండో విడతలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

మొత్తం ఖాళీల్లో ఎస్‌జీటీ - 2,575 పోస్టులు; స్కూల్‌ అసిస్టెంట్‌ -1,739 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ - 611 పోస్టులు, పీఈటీ - 164 పోస్టులు ఉన్నాయి. డీఎస్సీ ద్వారానే ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల్లో అత్యధికంగా హైదరాబాద్​ జిల్లాలో 358, నిజామాబాద్​ జిల్లాలో 309 ఖాళీలున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అతి తక్కువగా 43, హన్మకొండలో 53 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. పాత ఉమ్మడి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 

ALSO Read:

కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్, ఎస్‌బీ విచారణ తర్వాతే శిక్షణ ప్రారంభం!
తెలంగాణలో కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక తుది జాబితాను పోలీసు నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో తదుపరి అంకంపై టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ దృష్టి పెట్టింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రవర్తన, పూర్వాపరాల పరిశీలనతో పాటు వైద్యపరీక్షలు జరగాల్సి ఉంది. ఎంపికైన అభ్యర్థులు ముందుగా తమ ధ్రువీకరణపత్రాలపై గెజిటెడ్‌ అధికారుల సంతకాలతో కూడిన అటెస్టేషన్‌ పత్రాలను అక్టోబర్‌ 13 లోగా సమర్పించాల్సి ఉంది.  అదేవిధంగా గతంలో రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరిగిన 18 కేంద్రాల నుంచి ఆయా యూనిట్ల అధికారులు ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణపత్రాలను తెప్పించుకోనున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rajya Sabha Election 2024: ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
Kavitha Latest News: రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
Kulasekhar death : టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
Samlan Khan : మహేష్ బాబు సినిమాల్లో ఒకలా, బయట ఒకలా ఉంటారన్నా సల్మాన్ కామెంట్స్.. సూపర్ స్టార్ మరదలు రిప్లై ఇదే
మహేష్ బాబు సినిమాల్లో ఒకలా, బయట ఒకలా ఉంటారన్నా సల్మాన్ కామెంట్స్.. సూపర్ స్టార్ మరదలు రిప్లై ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డేవిడ్ వార్నర్‌ లేకుండానే ఈసారి ఐపీఎల్అర్జున్ టెండూల్కర్‌ని కొనుక్కున్న ముంబయి ఇండియన్స్13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rajya Sabha Election 2024: ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
Kavitha Latest News: రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
Kulasekhar death : టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
Samlan Khan : మహేష్ బాబు సినిమాల్లో ఒకలా, బయట ఒకలా ఉంటారన్నా సల్మాన్ కామెంట్స్.. సూపర్ స్టార్ మరదలు రిప్లై ఇదే
మహేష్ బాబు సినిమాల్లో ఒకలా, బయట ఒకలా ఉంటారన్నా సల్మాన్ కామెంట్స్.. సూపర్ స్టార్ మరదలు రిప్లై ఇదే
SCR  Sabarimala Special Trains:  ఉత్తరాంధ్ర, హైదరాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్ల వివరాలివే!
ఉత్తరాంధ్ర, హైదరాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్ల వివరాలివే!
AR Rahman's bassist Mohini Dey : రెహమాన్ తండ్రితో సమానం.. ఎఫైర్ రూమర్లపై ఫస్ట్ టైమ్ ఘాటుగా స్పందించిన మోహినీ డే  
రెహమాన్ తండ్రితో సమానం.. ఎఫైర్ రూమర్లపై ఫస్ట్ టైమ్ ఘాటుగా స్పందించిన మోహినీ డే  
Konaseema News Today: మ‌లికిపురంలో విద్యార్థిని చావబాది వైరల్ అయ్యాడు- ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు
మ‌లికిపురంలో విద్యార్థిని చావబాది వైరల్ అయ్యాడు- ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు
Siddharth - Pushpa 2: ‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
Embed widget