Teenmar Mallanna Meets KTR: కేటీఆర్, హరీష్‌లతో తీన్మార్ మల్లన్న భేటీ - బీసీ బిల్లుపై కొట్లాడాలని విజ్ఞప్తి
Telangana: బీఆర్ఎస్‌ఎల్పీలో కేటీఆర్, హరీష్‌లతో తీన్మార్ మల్లన్న సమావేశం అయ్యారు. బీసీ బిల్లు కోసం పోరాడాలని కోరారు.

Teenmar Mallanna: కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు హరీష్, కేటీఆర్‌లతో సమావేశం అయ్యారు. బీసీ బిల్లు అంశంపై చర్చించినట్లుగా తెలు్సోతంది. బీసీ బిల్లు పై పోరాటం చేయాలని, బీసీలకు న్యాయం జరిగే విధంగా కొట్లాడాలని మల్లన్న కోరినట్లుగా తెలుస్తోంది. బీసీ కులగణన తప్పుల తడక అని ఆరోపించడమే కాకుండా ఆ నివేదికను చించేయడంతో మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆయన రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆయన కేటీఆర్, హరీష్ లతో చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది.
బీఆర్ఎస్ పై గతంలో తీన్మార్ మల్లన్న తీవ్ర విమర్శలు
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేసేవారు. ఓ సందర్భంగా కేటీఆర్ కుటుంబసభ్యులపై కూడా వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కేసులు పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో ఆయనకు చెందిన క్యూ న్యూస్ ఆఫీసులపై చాలా సార్లు దాడులు జరిగాయి. పలు మార్లు జైలుకు వెళ్లారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ విపక్షంలో ఉండటం బీసీ బిల్లు కోసం ఆ పార్టీతో కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
బీసీ బిల్లుకు మద్దతిచ్చిన బీఆర్ఎస్
అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశ పెట్టారు . ఈ బిల్లుకు బీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపింది. అయితే చట్టబద్ధంగా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చినప్పుడు సంతోషిస్తామనని ఆ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఇప్పుడు బిల్లు ఆమోదం తర్వాత కేంద్రానికి పంపుతారు. కేంద్రం దాన్ని ఆమోదించి రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చాల్సి ఉటుంది. అలా చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఈ రిజర్వేషన్ల పెంపుతో యాభై శాతం రిజర్వేషన్లు దాటిపోతాయి. అందుకే దీనికి చట్టబద్ధత కల్పించడం కేంద్రం చేతుల్లో ఉంటుంది.
చట్టబద్ధత కోసం ఢిల్లీలో ధర్నా చేయాలనుకుంటున్న తీన్నార్ మల్లన్న
బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా ఢిల్లీ వేదికగా ధర్నా చేయాలని తీన్మార్ మల్లన్న కూడా భావిస్తున్నారు. బీసీ సంఘాలతో కలిసి ఆయన ధర్నా చేయనున్నారు. తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ ను కోరుతున్నారు. కోటీఆర్, హరీష్ రావులు ఈ అంశంపై తీన్మార్ మల్లన్నకు ఇంకా ఏమీ చెప్పలేదని తెలుస్తోంది .
సొంత పార్టీ పెట్టుకునే యోచనలో తీన్మార్ మల్లన్న
తీన్మార్ మల్లన్న బీసీల మద్దతుగా తాను ముఖ్యమంత్రి అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడంతో ఆయన ఏ రాజకీయ పార్టీలో చేరుతారా అన్న చర్చ జరుగుతోంది. అయితే తాను ఏ రాజకీయ పార్టీలో చేరుతానన్నది ఆయన చెప్పలేదు. ఆయన సొంత పార్టీ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన ధర్నాకు మద్దతు బీఆర్ఎస్ ఇస్తుందా లేదా అన్నది సందేహంగా మారింది. .
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

