Swachh Survekshan Awards 2022 : స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాలు, 13 అవార్డులతో తెలంగాణ టాప్
Swachh Survekshan Awards 2022 : స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో ఏపీ, తెలంగాణ సత్తా చాటాయి. తెలంగాణ 13 అవార్డులు దక్కించుకోగా, ఏపీకి ఆరు అవార్డులు వచ్చాయి.
Swachh Survekshan Awards 2022 : సుస్థిరాభివృద్దిని సాధిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ స్వచ్ఛ భారత్ సర్వేక్షణ్ లో మరోసారి దేశంలోనే నంబర్ వన్ గా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, ఆదర్శవంతమైన, పారదర్శక పాలనకు మరోసారి అద్దం పడుతోందన్నారు. గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ కింద పలు విభాగాల్లో తెలంగాణ 13 అవార్డులు దక్కించుకుంది. దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సమిష్టి కృషితో పల్లె ప్రగతిని సాధిస్తూ, పచ్చని తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం కేసిఆర్ తెలిపారు. ఇందుకు దోహదం చేసిన 'పల్లె ప్రగతి' కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిని, ఉన్నతాధికారులను సీఎం కేసిఆర్ ఈ సందర్భంగా అభినందించారు. ప్రగతితో ముందుకుసాగుతున్న తెలంగాణ రాష్ట్రం, దేశ ప్రగతిలో తన వంతుగా గుణాత్మక భాగస్వామ్యం పంచుకోవడం ప్రతీ తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సందర్భం అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇదే పరంపర ను కొనసాగిస్తామని పేర్కొన్నారు.
Proud that Telangana state topped the country in Swachh Sarvekshan Grameen rankings issued by Govt of India👏
— KTR (@KTRTRS) September 23, 2022
Thanks to Hon’ble CM KCR’s brainchild “Palle Pragathi” program
Political opponents might criticise but our Govt’s performance continues to win laurels & hearts
తెలంగాణ టాప్
'స్వచ్ఛ భారత్ మిషన్' దివస్ 2022 కింద తెలంగాణకు 13 అవార్డులు వచ్చాయి. 'స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ' ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం ఓవరాల్‌గా మొదటి స్థానంలో ఉండగా, జిల్లాల కింద జగిత్యాల, నిజామాబాద్‌లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఎస్‌ఎస్‌జీ సౌత్ జోన్ ర్యాంకింగ్స్‌లో నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (SSG) ర్యాంకింగ్స్‌తో పాటు, పలు జిల్లాలు వివిధ విభాగాల్లో పది విభిన్న అవార్డులను గెలుచుకున్నాయి. .
#Telangana once again emerges as the top performing state in the ‘Swachh Survekshan Grameen’ rankings as the state was conferred 13 awards and was ranked first in large States category, by the Central government under the ‘#SwachhBharat Mission’ Divas 2022#PallePragathi pic.twitter.com/0Ln4BMItf2
— Telangana Digital Media Wing (@DigitalMediaTS) September 23, 2022
ఏపీకి ఆరు అవార్డులు
ప్రతిష్ఠాత్మక స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో ఏపీ కూడా సత్తా చాటింది. తిరుపతి కార్పొరేషన్ కు జాతీయ అవార్డు వచ్చింది. పులివెందుల మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు రాగా, విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లు, పుంగనూరు, సాలూరు అవార్డులు దక్కించుకున్నాయి. ఈ ఏడాది ఏపీకి ఆరు అవార్డులు వచ్చాయి. అక్టోబర్ 2న ఈ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారు.
Also Read : KTR Twitter: 'రూపాయి విలువ తగ్గిపోతుంటే, రేషన్ షాపులో మోదీ ఫొటో కోసం చూస్తున్నారా'