KTR Twitter: 'రూపాయి విలువ తగ్గిపోతుంటే, రేషన్ షాపులో మోదీ ఫొటో కోసం చూస్తున్నారా'
KTR Twitter: ఓ వైపు రూపాయి విలువ పడిపోతుంటే మరోవైపే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధాని మోదీ ఫొటో రేషన్ షాపుల్లో లేదని హైరానా పడిపోతున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
KTR Twitter: తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. డాలర్ తో పోలిస్తే రూపాయి విలుల చాలా వరకు తగ్గిపోతుందని తెలిపారు. రూపాయి విలువ అత్యంత కనిష్టానికి పడిపోతున్నా.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫొటో కోసం వెతుకున్నారంటూ సెటైర్లు వేశారు. పైగా రూపాయి విలువ సాధారణంగానే పడిపోయిందని కేంద్ర మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం.. ఇలా అన్ని ఆర్థిక అవరోధాలకు యాక్ట్స్ ఆఫ్ గాడ్ కారణం అని... విశ్వగురువును పొగడండి అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పతనం అయితే.. జుమ్లాలు మాత్రం ఎప్పుడూ లేనంతగా వృద్ధి చెందాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
While Rupee is at an all time low
— KTR (@KTRTRS) September 23, 2022
Madam FM is busy looking for PM’s photos in PDS shops
She will tell you that the Rupee will find its natural course. All economic hardships, unemployment & inflation are due to Acts of God
Hail Vishwa Guru 🙏 https://t.co/cB6as4bnpv
ప్రపంచ మార్కెట్లు, ఫెడ్ రేట్ల కారణంగా రూపాయి విలువ పడిపోయిందని జ్ఞానాన్ని బోధిస్తున్న భక్తుల వాదనతో విశ్వగురు మోదీ అంగీకరించబోరని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అవినీతి చర్యలు కారణంగానే రూపాయి విలువ పతనమైందని... ఐసీయూలో ఉందంటూ గతంలో మోదీ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ప్రస్తావించారు.
Since our FM is going around lecturing on how “Modi Sarkar” is the Giver
— KTR (@KTRTRS) September 3, 2022
Here are the facts & figures👇
For every Rupee that Telangana contributes to the Nation, we only get back 46 paisa!
Madam, time to put up a banner:
“Thanks to Telangana” in all BJP states’ at PDS shops pic.twitter.com/LiJFzINvOI
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకుల్లో తెలంగాణకు మొదటి ర్యాంకు రావడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రానికి టాప్ ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో స్వచ్ఛ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సర్పంచ్ లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విధంగా మీ పనిని కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. రాజకీయంగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తమ ప్రభుత్వం ఇదే విధంగా ముందుకు వెళ్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
I would like to thank Hon’ble Prime Minister of Serbia @SerbianPM Ms. Ana Brnabić and @wef President @borgebrende for extending the invite
— KTR (@KTRTRS) September 23, 2022
This invitation is a recognition of the strength of Telangana’s Life-sciences ecosystem & particularly that of the Biotechnology sector https://t.co/J4hacwPLVQ
దేశంలోనే రైతులకు భరోసా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రైతు బీమా పథకం ద్వారా ఈ ఏడాది 34 లక్షల మంది రైతులకు 1450 కోట్ల రూపాయలు పంపిణీ చేసినట్లు మంత్రి ట్విట్టర్ ద్వారా తెలిపారు. 85 లక్షల మంది రైతులకు 5 లక్షల చొప్పున పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ట్విట్టర్ లో పేర్కొన్నారు.