Special Trains: పండగ అయిపోయిందిగా.. తిరిగి వెళ్తున్నారా? ఈ స్పెషల్ రైళ్లు ఉన్నాయి చూసుకోండి
దసరా పండగకు ఇంటికొచ్చిన వారు... ఇక తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిమ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.
దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పండగ సమయంలో సొంతూళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లినవాళ్లు తిరిగి వెళ్తున్నారు. ఈ ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు.
ఇవాళ, రేపు నడిచే ప్రత్యేక రైళ్లు ఇవే..
- సికింద్రాబాద్-విజయవాడ మధ్య ఉదయం 8.45 గంటలకు ప్రత్యేక రైలు
- విజయవాడ-సికింద్రాబాద్ మధ్య మధ్యాహ్నం 3.55 గంటలకు ప్రత్యేక రైలు
- సికింద్రాబాద్-నిజామాబాద్ మధ్య ఉదయం 9.50 గంటలకు ప్రత్యేక రైలు
- నిజామాబాద్-సికింద్రాబాద్ మధ్య మధ్యాహ్నం 2.55 గంటలకు ప్రత్యేక రైలు
- కాచిగూడ-కర్నూలు మధ్య ఉదయం 10 గంటలకు ప్రత్యేక రైలు
- కర్నూలు-కాచిగూడ మధ్య సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక రైలు
రైలు నంబరు 08579 విశాఖపట్నం-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు ఈ నెల 20, 27 తేదీల్లో రాత్రి 7 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబరు 08580 ఈ నెల 21, 28 తేదీల్లో సికింద్రాబాద్‌లో రాత్రి 7.40కి బయలుదేరి ఉదయం 6.40కి విశాఖపట్నం చేరుతుంది.
రైలు నంబరు 08583 విశాఖపట్నం-తిరుపతి ఈ నెల 18, 25 తేదీల్లో విశాఖపట్నంలో రాత్రి 7.15కి బయలుదేరి ఉదయం 7.30కి తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో నంబరు 08584 రైలు ఈ నెల 19, 26 తేదీల్లో తిరుపతిలో ఈ నెల రాత్రి 9.55కి బయలుదేరి ఉదయం 10.20కి విశాఖపట్నం చేరుతుంది.
రైలు నంబరు 08585 విశాఖపట్నం-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు విశాఖపట్నంలో ఈ నెల 19, 26 తేదీల్లో సాయంత్రం 5.35 గంటలకు బయలుదేరి ఉదయం 7.10కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబరు 08586 ఈ నెల 20,27 తేదీల్లో సికింద్రాబాద్‌లో రాత్రి 9.05కి బయలుదేరి ఉదయం 9.50కి విశాఖపట్నం చేరుతుంది.
06036 చెన్నై సెంట్రల్-సంత్రాగచి ప్రత్యేక రైలు ఈ నెల 19, 26 నవంబరు 2వ తేదీల్లో చెన్నై సెంట్రల్‌లో ఉదయం 8.10కి బయలుదేరి తర్వాతి రోజు రాత్రి 10.25కి సంత్రాగచి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబరు 06035 ఈ నెల 20, 27 నవంబరు 3వ తేదీల్లో సంత్రాగచిలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 9.30కి చెన్నై సెంట్రల్ చేరుతుంది.
Also read: కెలోరీల గురించి భయపడకుండా రోజులో ఎప్పుడైనా వీటిని తినొచ్చు
Also read: బాగా బతకడమంటే ఎక్కువ సంపాదించడం కాదు, బాగా తినడం!
Also read: తరచూ కోపం వస్తోందా ? ఆ ఫీలింగ్ వెనుక కారణాలు ఇవి కావచ్చు