Telangana Helpline Numbers: నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
Telangana News | నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అక్కడ చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఆ నెంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.

Telangana People In Nepal | న్యూఢిల్లీ: ప్రస్తుతం నేపాల్‌లో అనిశ్చిత పరిస్థితుల నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ పౌరులకు సహాయం చేయనుంది.
ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు నేపాల్‌లో తెలంగాణ పౌరులెవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. నేపాల్‌లో ఎవరైనా తెలంగాణ ప్రజలు చిక్కుకుంటే వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులను ఈ కింది నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రెటరీ & లైజన్ హెడ్.
+91 9871999044.
జి.రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్.
+91 9643723157.
సిహెచ్. చక్రవర్తి, ప్రజా సంబంధాల అధికారి
+91 9949351270.
తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యులు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దని ప్రజలకు సూచించింది. తెలంగాణ పౌరులకు నేపాల్‌లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది.
ఏదైనా సహాయం అవసరమైతే ఈ క్రింది హెల్ప్‌లైన్ నంబర్లలో ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయాన్ని సాధారణ ఫోన్ కాల్, వాట్సాప్ ద్వారా సైతం సంప్రదించవచ్చు అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
+977–9808602881 (వాట్సాప్ కాల్ సైతం చేయవచ్చు)
+977–9810326134 (వాట్సాప్ కాల్ కూడా చేయవచ్చు)
యువత ఆందోళనతో ఉద్రిక్తత.. ప్రధాని రాజీనామా
మూడు రోజులనుంచి నేపాల్ దేశం అట్టుడికిపోతోంది. జెన్ జెడ్ పేరుతో అక్కడ యువత చేపట్టిన ఆందోళనతో దేశం మొత్తం తగలబడిపోతోంది. సెప్టెంబర్ 8న అక్కడ జరిగిన హింసాత్మక ఘటనల్లో అల్లరరిమూకలు ఏకంగా ఆ దేశ పార్లమెంటు భవనం, ప్రధాని ప్రైవేట్ నివాసం సహా పలువురు మంత్రుల ఇండ్లను తగలబెట్టేశారు. అసలు నేపాల్ యువత ఈ స్థాయిలో ఇంత ఉద్యమం చేయడానికి ప్రధాన కారణం అక్కడి ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించడమే. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ సహా 26 సోషల్ మీడియా యాప్ లపై నేపాల్ ప్రభుత్వం విధించిన నిషేధం దేశంలో పెద్ద ఉద్యమం, ఏకంగా సంక్షోభానికి దారితీసింది. ప్రధాని కేపీ ఓలి రాజీనామా చేయాల్సి వచ్చిందందే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్ధం చేసుకోవచ్చు.






















