అన్వేషించండి

Singareni Jobs: సింగరేణిలో కార్మికులకు రూ. 1 కోటి 25 లక్షల భారీ బీమా సౌకర్యం - కాంట్రాక్ట్ సిబ్బందికీ బోనస్ - మంత్రుల కీలక ప్రకటన

Singareni Workers Bonus: మంచిర్యాలలో సింగరేణి ఉత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా వైద్యపరంగా అన్‌ఫిట్ అయిన సింగరేణి ఉద్యోగుల వారసులకు నియామక పత్రాలను అందజేశారు.

 Mancherial Singareni Medical Unfit Job Letters:  తెలంగాణ ప్రజల నల్ల బంగారమైన సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమంలో తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. వైద్య పరంగా సేవలు అందించలేని సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఈ వేదికగా ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. సింగరేణి సంస్థ అనేది తెలంగాణ ప్రజల సొంత ఆస్తి అని, ప్రజాస్వామ్య రక్షణలో తాము ఎల్లప్పుడూ జాగరుకతతో ఉంటూ సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు.

ఈ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వైద్యపరంగా పనిచేయలేని స్థితిలో ఉన్న సింగరేణి ఉద్యోగుల వారసులలో.. పూర్తిస్థాయి అర్హత కలిగిన 335 మంది అభ్యర్థులకు మంత్రుల హస్తాల మీదుగా ఉద్యోగ పత్రాలు లభించాయి. ఇందులో అత్యధికంగా 117 మంది కేవలం మంచిర్యాల జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరికొంత మంది అర్హులను గుర్తించి నియామక పత్రాలు అందజేస్తామన్నారు. అంతేకాకుండా, మంచిర్యాల జిల్లా పరిధిలో రూ.70 కోట్లతో గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు, రూ.74.40 కోట్లతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు తాము శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు.  సింగరేణి కార్మికులకు రూ. 1 కోటి 25 లక్షల భారీ బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, అలాగే సంస్థలో పనిచేస్తున్న 30 వేల మంది ఒప్పంద, పొరుగు సేవల  సిబ్బందికి కూడా బోనస్ అందించామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సింగరేణి లాభాల్లో కేవలం రెగ్యులర్ ఉద్యోగులకే కాకుండా ఒప్పంద కార్మికులకు కూడా వాటా అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. మెడికల్ అన్‌ఫిట్ నియామకాల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. రెగ్యులర్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ సిబ్బందికి కూడా రూ. 40 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించామని పేర్కొన్నారు. కోల్ బ్లాకుల్లో పూర్తి నిఘా వ్యవస్థ మధ్య పనులు జరుగుతున్నాయని, తెలంగాణ సహజ వనరులను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.    

 సింగరేణిలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న  మారుపేరు  సమస్య పరిష్కారానికి త్వరలోనే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రకటించారు.   అలాగే పదవీ విరమణ పొందిన కార్మికులకు తెల్ల రేషన్ కార్డులు అందజేశామని చెప్తూ.. ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్లను వారికే కేటాయించి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వర్తింపజేయాలని, శ్రీరాంపూర్ పరిధిలోని అర్హులకు పట్టాలు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా, 1992లో సింగరేణి సంస్థను రూ.450 కోట్లకు బీఐఎఫ్ఆర్  పరిధిలోకి పంపకుండా ఆనాడు కాపాడింది గడ్డం వెంకటస్వామి నని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గుంటూరులో మహిళపై హిజ్రాల దాడి -హోంమంత్రి అనిత సీరియస్
గుంటూరులో మహిళపై హిజ్రాల దాడి -హోంమంత్రి అనిత సీరియస్
Congress Political Mind Games: గులాబీ కోటల్లో హస్తం ఆపరేషన్ - కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కంచుకోటల్లో క్యాడర్‌పై ఆకర్ష్ ప్రయోగం - వర్కవుట్ అవుతుందా?
గులాబీ కోటల్లో హస్తం ఆపరేషన్ - కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కంచుకోటల్లో క్యాడర్‌పై ఆకర్ష్ ప్రయోగం - వర్కవుట్ అవుతుందా?
Mulugu District Latest News: ములుగు జిల్లా ఏటూరునాగారంలో 108 సిబ్బంది సమయస్ఫూర్తి- డోలీపై మోసి యువకుడి ప్రాణాలు కాపాడారు!
ములుగు జిల్లా ఏటూరునాగారంలో 108 సిబ్బంది సమయస్ఫూర్తి- డోలీపై మోసి యువకుడి ప్రాణాలు కాపాడారు!
Vikarabad Latest News: యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Embed widget