Sigachi : గల్లంతయిన కార్మికులకు నష్టపరిహారం లేనట్లేనా ? సిగాచి పరిశ్రమ ప్రమాదంలో ఆ కుటుంబాల నరకయాతన !
Sigachi industrial accident: సిగాచి పరిశ్రమ ప్రమాదంలో గల్లంతయిన వారి ఆచూకీ తెలియడం లేదు. వారి కుటుంబాలకు సాయం చేసే అంశంపైనా ఎలాంటి ప్రకటన చేయడం లేదు.

Sigachi Missing People: హైదరాబాద్ శివారులోని పాశమైలారం లో జరిగిన సిగాచి పరిశ్రమ ప్రమాదంలో గల్లంతయిన వారి ఆచూకీపై స్పష్టత లేదు. వారు కాలి బూడిత అయిపోయి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరి నిమిషం వరికి మీ వాళ్ళ ఆచూకీ కోసం ప్రయత్నిస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం తరపున మీకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెబుతున్నారు. కానీ గల్లంతయిన వారి పేర్లు అధికారికంగా ప్రకటించడానికి నిరాకరిస్తున్నారు.
సిగాచీ కంపెనీ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల విషయంలో సందిగ్ధత ఆ కుటుంబాలను వేదనకు గురి చేస్తోంది. 9 మంది కార్మికులు గల్లంతయినట్టుగా యాజమాన్యం, జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఐదు రోజులు గడుస్తున్నా మృతదేహాలు లభించకపోవడంతో పూర్తిగా దగ్ధమైపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తి కావొస్తోంది. గల్లంతైన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని సిఎస్ నేతృత్వంలోని కమిటీ గుర్తించినట్ చెబుతున్నారు. బాధిత కుటుంబాలతో సమావేశమైన సిఎస్ రామకృష్ణారావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ పరిస్థితి ఏంటని గలంతైన కార్మికుల కుటుంబ సభ్యులు నిలదీసినట్లుగా తెలు్సతోంది. చాలామంది కాలిపోయినట్టుగా గుర్తించాం, ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తామంటూ హామీనిచ్చారు.
సమావేశం నుంచి బయటకు వస్తున్న కలెక్టర్ కాళ్లపై పడ్డ బాధిత కుటుంబాలు.. కనీసం వారి వివరాలు అయినా ప్రకటించాలని కోరుతున్నారు. అయితే గల్లంతైన కార్మికులకు నష్టపరిహారంపై ఎలాంటి క్లారిటీ ని అధికారులు ఇవ్వలేదు. మృతదేహాలు లభ్యం కాకపోతే నష్ట పరిహారం ఇచ్చే అవకాశం లేనట్లేనని చెబుతున్నారు. లాకర్ రూంలో లభించిన సెల్ ఫోన్లు కాంట్రాక్టు కార్మికులవేనన్న అనుమానం వ్యక్తమవుతోంది. వారంతాత ిప్పుడు కనిపించడం లేదు. కాంట్రాక్టు కార్మికులపై ఎలాంటి ప్రకటనా చేయని యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. గల్లంతైన కార్మికుల విషయంలో ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకోవాలన్న విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి.
సిగాచి పరిశ్రమలో మృతి చెందిన వారికి కోటి పరిహారాన్ని కంపెనీ ప్రకటించింది. ఇవి అందాలంటే.. ఆయా కుటుంబాలకు ఖచ్చితంగా ప్రమాదంలో చనిపోయారన్న డెత్ సర్టిఫికెట్ ఉండాలి. కానీ పూర్తి స్థాయిలో కాలిపోయి.. ఆనవాళ్లు కూడా లభించని వారి కుటుంబాలకు అటు మనుషులు.. ఇటు పరిహారం కూడా లభించే అవకాశం లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. వారంతా ఆవేదనకు గురవుతున్నారు. వీరి సమస్యకు పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు.
సిగాచి పరిశ్రమ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. చైర్మన్ గా డాక్టర్ బి. వెంకటేశ్వరరావు ఉంటారు. డా.టి. ప్రతాప్ కుమార్, డా. సూర్య నారాయణ, డా.సంతోష్ గుగే సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దుర్ఘటనపై విచారణ చేసి బాధితులతో మాట్లాడి నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే ఈ కమిటీ ప్రమాద స్థలాన్ని పరిశఈలించింది. సిగాచి పరిశ్రమలో ప్రమాదంపై దర్యాప్తునకు నియమించిన కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న డాక్టర్ బి. వెంకటేశ్వరరావు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) ఎమెరిటస్ శాస్త్రవేత్తగా ఉన్నారు. సభ్యుడిగా ఉన్న టి. ప్రతాప్ కుమార్ ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్, సూర్యనారాయణ మాత్రం చెన్నైలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో శాస్త్రవేత్తగా పని చేసి రిటైర్ అయ్యారు. సంతోష్ గుగే పుణేలోని నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ భద్రతా అధికారి ఉన్నారు.





















