అన్వేషించండి

Raids On Rajagopal : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలంగాణ సర్కార్ షాక్ - సుశీ ఇన్‌ఫ్రాలో సర్వీస్ ట్యాక్స్ అధికారుల సోదాలు!

సుశీ ఇన్‌ఫ్రాలో సర్వీస్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేశారు. ఈ సంస్థ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందినది.

Raids On Rajagopal :   మునుగోడులో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలంగాణ సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. ఆయన కుటుంబానికి చెందిన సుశీ ఇన్ ఫ్రా సంస్థలో స్టేట్ సర్వీస్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన సోదాలు.. రాత్రి వరకూ కొనసాగాయి. సోదాలు ప్రారంభమైన విషయం మీడియాకు కూడా ఆలస్యంగా తెలిసింది. స్టేట్ సర్వీస్ ట్యాక్స్‌లు ఏమైనా ఎగ్గొట్టారా లేదా అన్నదానిపై సోదాలు ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన చేశారు. కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ ఫ్రా పలు ప్రాజెక్టుల కాంట్రాక్టులు చేయడంలో గుర్తింపు పొందింది. 

లాప్ టాప్ లు, కంప్యూటర్ల సీజ్
 
  ప్రభుత్వానికి పన్నుల చెల్లింపులో పెద్దఎత్తున అవకతవకలకు పాల్పడుతున్నారని సమాచారం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు  సోమవారం కోమటి రెడ్డి గ్రూపులకు చెందిన 16 వ్యాపార సంస్థల్లో 16 బృందాలు తనిఖీలు చేశాయి. హైదరాబాద్ లోని రెండు భవనాలలో ఉన్న సుశీ సంస్థలకు చెందిన కంపెనీలపై నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడ్డట్టుగా ప్రాథమికంగా అంచనా వేశారు. సోమవారం ఉదయం సుమారు పదకొండున్నరకు ప్రారంభమై రాత్రి 7 గంటలకు ముగిసిన ఈ సోదాల్లో  లెక్కల్లో చూపని వ్యాపార లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయని లభ్యమైన పత్రాల ద్వారా కనుగొన్నారు. వీటితో పాటు ఈ కంపెనీల్లోని లాప్ టాప్ లు, కంప్యూటర్లలోని సమాచారం ప్రకారం పలు అనుమానాస్పద వ్యాపార లావాదేవీలు కూడా జరిగినట్టు గుర్తించారు. ఈ 16 సంస్థల్లో ఒక సంస్థ సహకరించనందున ఆ సంస్థ కార్యాలయంలోని బీరువాలో ఉన్న లాకర్ ను సీల్ చేశారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా క్రయ విక్రయాలు జరపడం తదితర అక్రమాలకూ పాల్పడ్డట్టు అధికారులు గుర్తించారు. సుశీ గ్రూపుల సంస్థలు వందల కోట్ల పన్నుల ఎగవేతకు పాల్పడ్డట్టు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. ఈ పన్నుల ఎగవేతపై విచారణను కొద్దీ రోజుల్లో పూర్తి స్థాయిలో పూర్తి చేసి, స్పష్టమైన నిర్ధారణకు వాణిజ్య పన్నుల శాఖ రానుంది. 

మునుగోడు ఉపఎన్నికల్లో హాట్ టాపిక్ అయిన సుశీ ఇన్ ఫ్రా 

ఇటీవల మునుగోడు ఉపఎన్నికల్లో సుశీ ఇన్ ఫ్రా వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఆ సంస్థకు కేంద్రం రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టు కేటాయించిందని .. అందుకే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తీవ్రమైన ఆరోపణలు చేశాయి. అయితే వీటిని రాజగోపాల్ రెడ్డి ఖండించారు. ఓపెన్ బిడ్డింగ్‌లో తమ సంస్థకు ఈ కాంట్రాక్ట్ వచ్చిందని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అదే సమయంలో ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు సుశీ ఇన్ ఫ్రా సంస్థ నుంచి మునుగోడు నియోజకవర్గంలో కొంత మంది నేతలకు రూ. కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశారని టీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఆధారాల్లేవని ఈసీ ఆ ఫిర్యాదును తోసి పుచ్చింది. 

ఇప్పుడు సుశీ ఇన్ ఫ్రాలో స్టేట్ సర్వీస్ ట్యాక్స్ అధికారుల సోదాలు

ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత సుశీ ఇన్‌ఫ్రా టార్గెట్‌గా తెలంగాణ సర్వీస్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేయడం కలకలం రేపుతోంది.  సుశీ ఫ్రా ప్రధానంగా మైనింగ్ రంగంలో ఉంది. బొగ్గు గనుల తవ్వకాల్లో ఆ సంస్థకు కొంత మేర పట్టు ఉంది. సింగరేణికి చెందిన ఓపెన్ కాస్ట్ గనుల్లో మైనింగ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సర్వీస్ ట్యాక్స్‌లు ఎగ్గొట్టారని వచ్చిన ఫిర్యాదుల మేరకు స్టేట్ సర్వీస్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి సంస్థలపై సర్వీస ట్యాక్స్ అధికారులు దాడులు చేయరు. ఎందుకంటే.. కాంట్రాక్ట్ కంపెనీల్లో సర్వీస్ ట్యాక్స్ ప్రాధాన్యం తక్కువని చెబుతూంటారు. 

రాజకీయ కోణంలోనే దాడులు చేస్తున్నారని   బీజేపీ ఆరోపణ 

రాజకీయ కోణంలోనే ఈ దాడులు చేస్తున్నారని ..  బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర సంస్థలు.. దాడులు చేస్తున్నాయని.. దానికి పోటీగా తమ వద్ద కూడా దర్యాప్తు సంస్థలు ఉన్నాయని చూపించేందుకు ఇలా బీజేపీ నేతలకు చెందిన వ్యాపార సంస్థలపై దాడులు చేస్తున్నారని అంటున్నారు. ఈ సోదాల అంశంపై ఇంకా టీఆర్ఎస్ నేతలెవరూ స్పందించలేదు. కారణం ఏదైనా ముందు ముందు ఈ అంశం రాజకీయ దుమారం రేగడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR: ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీకి షాక్! బండి సంజయ్ కుమారుడ్ని అరెస్ట్ చేయకపోవడంపై కేటీఆర్ ఫైర్
ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీకి షాక్! బండి సంజయ్ కుమారుడ్ని అరెస్ట్ చేయకపోవడంపై కేటీఆర్ ఫైర్
Summer Speical Online Celebrations : ఎండల ఎఫెక్ట్​తో ఆన్​లైన్​ వేడుకలు.. బెంగాలీ కల్చరల్​ అసోసియేషన్ వినూత్న సెలబ్రేషన్స్
ఎండల ఎఫెక్ట్​తో ఆన్​లైన్​ వేడుకలు.. బెంగాలీ కల్చరల్​ అసోసియేషన్ వినూత్న సెలబ్రేషన్స్
Bandi Bhagirath Files:బండి సంజయ్‌కు బిగ్‌షాక్! కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు! హనీట్రాప్ అంటున్న భగీరథ్‌!
బండి సంజయ్‌కు బిగ్‌షాక్! కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు! హనీట్రాప్ అంటున్న భగీరథ్‌!
PM Modi Hyderabad Tour: ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీకి షాక్! బండి సంజయ్ కుమారుడ్ని అరెస్ట్ చేయకపోవడంపై కేటీఆర్ ఫైర్
ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీకి షాక్! బండి సంజయ్ కుమారుడ్ని అరెస్ట్ చేయకపోవడంపై కేటీఆర్ ఫైర్
Who is S Keerthana: విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
CM Vijay: సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
Tamil Nadu CM Vijay: ఒకప్పుడు అవమానం... నేడు తమిళనాడు సీఎంగా విజయ్ - నెహ్రూ స్టేడియంలో దళపతికి చేదు అనుభవం!
ఒకప్పుడు అవమానం... నేడు తమిళనాడు సీఎంగా విజయ్ - నెహ్రూ స్టేడియంలో దళపతికి చేదు అనుభవం!
Patas Praveen Marriage : ఘనంగా పటాస్ ప్రవీణ్ వివాహం - ఫైమా రియాక్షన్ వైరల్... పెళ్లి వీడియో షేర్ చేస్తూ...
ఘనంగా పటాస్ ప్రవీణ్ వివాహం - ఫైమా రియాక్షన్ వైరల్... పెళ్లి వీడియో షేర్ చేస్తూ...
Tamil Nadu CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం.. ఉప్పొంగిపోయిన తల్లిదండ్రులు
తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం.. ఉప్పొంగిపోయిన తల్లిదండ్రులు
Mango Lassi Recipe : సమ్మర్ స్పెషల్ కూల్ మ్యాంగో లస్సీ.. చాలా సింపుల్​గా చేసుకోగలిగే టేస్టీ రెసిపీ ఇదే
సమ్మర్ స్పెషల్ కూల్ మ్యాంగో లస్సీ.. చాలా సింపుల్​గా చేసుకోగలిగే టేస్టీ రెసిపీ ఇదే
Ashu Reddy Engagement : అషు రెడ్డిది ఫేక్ ఎంగేజ్మెంట్ - అందరినీ బురిడీ కొట్టించింది... ఇదీ అసలు మ్యాటర్
అషు రెడ్డిది ఫేక్ ఎంగేజ్మెంట్ - అందరినీ బురిడీ కొట్టించింది... ఇదీ అసలు మ్యాటర్
Embed widget