Secunderabad: అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని మోదీ విచారం - మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటన
11 Persons Dies in Secunderabad Fire Accident సికింద్రాబాద్ బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది బిహార్ కార్మికులు చనిపోగా, ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.
PM Modi On Secunderabad bhoiguda Fire Accident: సికింద్రాబాద్ బోయిగూడలోని ఓ గోడౌన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో బిహార్‌కు చెందిన 11 మంది కార్మికులు మృతి చెందారు. బుధవారం వేకువ జామున జరిగిన విషాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం నుంచి సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేంద్రం నుంచి సైతం సికింద్రాబాద్ ప్రమాదంపై ప్రగాఢ సానుభూతి వ్యక్తమవుతోంది.
సికింద్రాబాద్‌లో అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి విచారం..
బోయిగూడలోని గోడౌన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం బాధాకరమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. పొట్టకూటి కోసం తెలంగాణకు వచ్చి, అగ్ని ప్రమాదంలో మృతిచెందిన బిహార్ కార్మికుల కుటంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి కోవింద్ ఆకాంక్షించారు.
The death of workers in a fire accident at a godown in Secunderabad, Telangana is a tragedy beyond words. My thoughts and prayers are with the bereaved families. I wish speedy recovery for the injured.
— President of India (@rashtrapatibhvn) March 23, 2022
‘హైదరాబాద్‌లోని భోయిగూడలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరం (PM Modi express pain at loss of lives in Secunderabad Fire Accident). ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి చనిపోయిన వారి ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు ఎక్స్ గ్రేషియా అందిస్తామని’ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
హైదరాబాద్‌లోని భోయిగూడలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరం. ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. PMNRF నుండి ఒక్కొక్కరికి 2 లక్షలు ఎక్స్ గ్రేషియా మరణించిన వారి కుటుంబాలకు ఇవ్వబడుతుంది: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 23, 2022
వేకువజామున పెను విషాదం..
సికింద్రాబాద్‌లోని స్క్రాప్ గోడౌన్‌లో బుధవారం వేకువజామున జరిగిన ప్రమాదంలో 11 మంది బిహార్ కార్మికులు మృతి చెందారు. మరికొందరు కార్మికులకు కాలిన గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. మృతులు 23 నుంచి 35 ఏళ్ల వయసు వారు. మృతులది బిహార్ లోని చప్రా జిల్లా వాసులుగా గుర్తించామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (Hyderabad CP CV Anand About Bhoiguda Fire Accident) తెలిపారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్, సీఎస్ సోమేష్ కుమార్‌ను ఆదేశించారు. పోస్టుమార్టం అనంతరం కార్మికుల మృతదేహాలను బిహార్‌కు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
Also Read: Telangana CM KCR: సికింద్రాబాద్ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి - మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
Also Read: Secunderabad: సికింద్రాబాద్‌లో అతి భారీ అగ్ని ప్రమాదం, 11 మంది సజీవ దహనం - రంగంలోకి 8 ఫైరింజన్లు