Telangana CM KCR: సికింద్రాబాద్ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి - మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
Secunderabad Fire Accident: బోయిగూడ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Telangana CM KCR On Secunderabad Fire Accident: సికింద్రాబాద్ బోయిగూడ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో బిహార్ కార్మికులు మరణించడం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరి కుటుంబానికి రూ 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన బిహార్ కార్మికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేష్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
సిలిండర్లు పేలడంతోనే విషాదం.. (Secunderabad Fire Accident:)
‘తెల్లవారుజామున మూడున్నర గంటలకు ప్రమాదం జరిగింది. మృతులు 23 నుంచి 35 ఏళ్ల వయసు వారు. మృతులది బిహార్ లోని చప్రా జిల్లా వాసులుగా గుర్తించాం. గ్యాస్ సిలిండర్ పేలినట్లు 100కు ఫోన్ కాల్ వచ్చిందని’ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (Hyderabad CP CV Anand About Bhoiguda Fire Accident) తెలిపారు. సిలిండర్ పేలడంతోనే మంటలు ఎక్కువగా వ్యాపించాయి. మరోవైపు స్క్రాప్ గోడౌన్...ఫైర్ నిబంధనలు పాటించలేదని స్పష్టం చేవారు. మృతులు ఇక్కడ నివసిస్తున్నట్లు స్థానికులకు ఎవ్వరికీ తెలీదన్నారు. అగ్నిప్రమాదం వల్ల మంటలు చెలరేగి, దట్టమైన పీల్చడంతో కొందరు చనిపోయారని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాత్రివేళ కావడంతో మరణాలు ఎక్కువ..
రాత్రివేళ కావడం, కార్మికులు నిద్రలోనే పొగ పీల్చి మృతి చెందినట్లు తెలిసిందన్నారు. ప్రమాదం ఘటనపై కేసు నమోదు చేశామని, పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని చెప్పారు. గోడౌన్ యజమాని కుమారుడితో మాట్లాడి వివరాలు సేకరించినట్లు తెలిపారు. కార్మికులు నెలకు 12వేల జీతానికి పనిచేస్తున్నారని, దురదృష్టవశాత్తూ విషాదం చోటుచేసుకుందన్నారు. గాయాలు అయిన వ్యక్తితో మాట్లాడితే పూర్తి సమాచారం వస్తుందనన్నారు.
ప్రమాదంలో మృతి చెందిన బీహార్ వలస కార్మికుల పార్థివదేహాలను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ శ్రీ సోమేష్ కుమార్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
— TRS Party (@trspartyonline) March 23, 2022
టింబర్ గౌడౌన్ డిపోలో అగ్నిప్రమాదం..
సికింద్రాబాద్‌లోని బోయిగూడలో బుధవారం (మార్చి 23) తెల్లవారుజామున ఉదయం 3 నుంచి 4 గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం (Secunderabad Fire Accident) చోటు చేసుకుంది. స్థానిక టింబర్ గౌడౌన్ డిపోలో (Timber Depot Fire Accident) పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడి 11 మంది కార్మికులు సజీవ దహనం అయ్యారు. మరికొంత మంది మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. మొత్తం 8 ఫైరింజన్లతో మూడు గంటలపాటు శ్రమించి మార్పులు ఆర్పినట్లు అధికారులు తెలిపారు.
Also Read: Secunderabad: సికింద్రాబాద్‌లో అతి భారీ అగ్ని ప్రమాదం, 11 మంది సజీవ దహనం - రంగంలోకి 8 ఫైరింజన్లు