అన్వేషించండి

SCR Special Trains: రైలు ప్రయాణికులకు శుభవార్త, సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు ఇవే

SCR to run Special Trains between Secunderabad and Visakhapatnam: రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్ల వివరాలను ప్రకటించింది.

SCR to run Special Trains between Secunderabad and Visakhapatnam | హైదరాబాద్: సంక్రాంతి పండుగ వస్తుందంటే టికెట్ రిజర్వేషన్ అనేది పెద్ద సమస్యగా మారుతోంది. ఇదివరకే శబరిమలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. తాజాగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పలు మార్గా్లోల ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, విశాఖ నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి ఒడిశాలోని బ్రహ్మపురకు, బ్రహ్మపుర నుంచి సికింద్రాబాద్ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనుంది. డిసెంబర్ 6 నుంచి 30వ తేదీ వరకు దక్షిణ మధ్య రైల్వే నడపనున్న రైళ్ల వివరాలు అధికారులు ప్రకటించారు.

రైలు నెం. 07097 సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం  డిసెంబర్ 8, 15, 22, 29 తేదీలలో సాయంత్రం 4.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. 

అదే విధంగా రైలు నెం. 07098 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు డిసెంబర్ 9, 16, 23, 30 తేదీలలో రాత్రి 7.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. 

SCR Special Trains: రైలు ప్రయాణికులకు శుభవార్త, సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు ఇవే

రైలు నెం. 07097/07098 సికింద్రాబాద్ - విశాఖపట్నం స్టేషన్ స్టాప్స్..
ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో రెండు మార్గాల్లోనూ ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లలో 2AC, 3AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

సికింద్రాబాద్ నుంచి బ్రహ్మపుర మధ్య రైలు సర్వీసులు

రైలు నెం. 07027 సికింద్రాబాద్ నుంచి ఒడిశాలోని బ్రహ్మపురకు డిసెంబర్ 6, 13, 20, 27 తేదీలలో శుక్రవారం రాత్రి 8.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు బ్రహ్మపురకు రైలు చేరుకుంటుంది. 

రైలు నెం. 07028 ఒడిశాలోని బ్రహ్మపుర నుంచి డిసెంబర్ 7, 14, 21, 28 తేదీలలో శనివారం సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.35 గంటలకు సికింద్రాబాద్ చేరుతుందని ద.మ రైల్వే తెలిపింది.

రైలు నెం. 07027/07028 సికింద్రాబాద్ - బ్రహ్మాపూర్ - సికింద్రాబాద్ స్పెషల్స్ ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, నౌపడ, పలాస, సోంపేట, ఇచ్ఛాపురంలో రెండు మార్గాల్లో స్టేషన్లు ఉన్నాయి.

Also Read: Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి 62 ప్రత్యేక రైళ్లు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Durgam Lake Encroachment Case: దుర్గం చెరువు కబ్జా కేసులో బాలకృష్ణ పేరు తెచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్
దుర్గం చెరువు కబ్జా కేసులో బాలకృష్ణ పేరు తెచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
BRS Assembly Boycott: బీఆర్ఎస్ అసెంబ్లీ బహిష్కరణ - అసెంబ్లీని గాంధీభవన్‌లా నిర్వహిస్తున్నారని ఆగ్రహం
బీఆర్ఎస్ అసెంబ్లీ బహిష్కరణ - అసెంబ్లీని గాంధీభవన్‌లా నిర్వహిస్తున్నారని ఆగ్రహం
Maoists Surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు, ఆయుధాలు స్వాధీనం
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు, ఆయుధాలు స్వాధీనం

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Durgam Lake Encroachment Case: దుర్గం చెరువు కబ్జా కేసులో బాలకృష్ణ పేరు తెచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్
దుర్గం చెరువు కబ్జా కేసులో బాలకృష్ణ పేరు తెచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
BRS Assembly Boycott: బీఆర్ఎస్ అసెంబ్లీ బహిష్కరణ - అసెంబ్లీని గాంధీభవన్‌లా నిర్వహిస్తున్నారని ఆగ్రహం
బీఆర్ఎస్ అసెంబ్లీ బహిష్కరణ - అసెంబ్లీని గాంధీభవన్‌లా నిర్వహిస్తున్నారని ఆగ్రహం
Maoists Surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు, ఆయుధాలు స్వాధీనం
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు, ఆయుధాలు స్వాధీనం
YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ కు షాక్.. వీడియో కోసం ఇన్ స్టాగ్రామ్‌కు లేఖ రాసిన పోలీసులు
యూట్యూబర్ అన్వేష్ కు షాక్.. వీడియో కోసం ఇన్ స్టాగ్రామ్‌కు లేఖ రాసిన పోలీసులు
IndiGo Flights Diverted: శంషాబాద్‌కు రావాల్సిన రెండు ఇండిగో విమానాలు గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
IndiGo Flights Diverted: శంషాబాద్‌కు రావాల్సిన రెండు ఇండిగో విమానాలు గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
Team India schedule 2026: ఈ ఏడాది టీమిండియా పూర్తి షెడ్యూల్ చూశారా.. కీలకంగా టీ20 వరల్డ్ కప్
ఈ ఏడాది టీమిండియా పూర్తి షెడ్యూల్ చూశారా.. కీలకంగా టీ20 వరల్డ్ కప్
Shanmukh Jaswanth : ప్రియురాలిని పరిచయం చేసిన షణ్ముఖ్ జశ్వంత్? - గాడ్స్ ప్లాన్ అంటూ పోస్ట్... ఆమె ఎవరు?
ప్రియురాలిని పరిచయం చేసిన షణ్ముఖ్ జశ్వంత్? - గాడ్స్ ప్లాన్ అంటూ పోస్ట్... ఆమె ఎవరు?
Embed widget