Revanth Vs BJP: అసెంబ్లీలో కేటీఆర్‌పై రేవంత్ తిట్ల దండకం - ఖండించిన ఢిల్లీ బీజేపీ - రాహుల్‌ను కార్నర్ చేయడానికే!
Revanth Reddy : అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కేటీఆర్, హరీష్ రావులపై చేసిన పద ప్రయోగం వివాదాస్పదం అవుతోంది. ఢిల్లీ బీజేపీ రేవంత్ మాటల్ని జాతీయ స్తాయిలో ప్రచారం చేస్తోంది.

Revanth Reddy verbal abuse BJP Reaction: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీని ఒక వీధి కూడలిగా మార్చేసిందని బీజేపీ మండిపడింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రకాల ప్రజాస్వామ్య పరిమితులను దాటారు. సభ సాక్షిగానే సీనియర్ నాయకులు కేటీఆర్ , హరీష్ రావులపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారని విమర్శలు గుప్పించారు . జాతీయ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ లో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటను పోస్టు చేసిన బీజేపీ ఇది పొరపాటున దొర్లిన మాట కాదని స్పష్టం చేసింది. ఇది రేవంత్ రెడ్డిలోని నిరాశ, అహంకారం , అసహనానికి నిదర్శనమని.. గౌరవం, మర్యాద , ప్రజాస్వామ్య విలువలు లేని భారత జాతీయ కాంగ్రెస్ అసలు స్వరూపం ఇదేనని విమర్శించారు. రాహుల్ గాంధీ , కాంగ్రెస్ వ్యవస్థ పార్లమెంటును, శాసన సంస్థలను పదేపదే ఎందుకు కించ పరుస్తున్నారో .. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఉదాహరణ అని స్పష్టం చేసింది.
𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 𝐡𝐚𝐬 𝐭𝐮𝐫𝐧𝐞𝐝 𝐭𝐡𝐞 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 𝐀𝐬𝐬𝐞𝐦𝐛𝐥𝐲 𝐢𝐧𝐭𝐨 𝐚 𝐬𝐭𝐫𝐞𝐞𝐭 𝐜𝐨𝐫𝐧𝐞𝐫. 🚫
— BJP (@BJP4India) January 4, 2026
Telangana CM Revanth Reddy crossed every democratic limit, hurling abusive language at senior leaders K. T. Rama Rao and Harish Rao right on the floor of the… pic.twitter.com/HaU11Hb2BD
సీఎం రేవంత్ బడివే అనే పదాన్ని ఉపయోగించారు. ఇతి తెలంగాణ సమాజంలో అత్యంత ఘోరమైన పదమని బీఆర్ఎస్ నేతలంటున్నారు. అలాంటి మాటలు మాట్లాడినా స్పీకర్ స్పందించలేదని కేటీఆర్ ఆదివారం తీవ్ర విమర్శలు కూడా చేశారు.
రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బడివే అని అన్ పార్లమెంటరీ భాష మాట్లాడుతుంటే స్పీకర్ చూస్తూ కూర్చోవడం బాధాకరం
— dinesh reddy (@dinni73799) January 4, 2026
నీ అజ్ఞానాన్ని కప్పి పుచ్చుకోవడానికి నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావని అందరికి అర్థమైంది – కేటీఆర్ pic.twitter.com/naICV0fdRd
హరీష్ రావు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. సభలో సీఎం హోదాలో నాలుక కోస్తానంటూ హింసాత్మకమైన, నేరప్రవృత్తితో అసెంబ్లీలో మాట్లాడటం రేవంత్ రాజకీయ నీచత్వానికి పరాకాష్ట అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అతి వికృతంగా, సభ్యసమాజం తలదించుకునేలా యథేచ్ఛగా బూతులు ప్రయోగిస్తుంటే స్పీకర్ వారించకపోవడం అత్యంత దురదృష్టకరమని హరీష్ రావు అన్నారు.
రేవంత్ మాట్లాడింది ఇదే :
‘భడివోవేఁకో.. కోన్ సంభాల్నా..’ అని హిందీలో మాట్ఒలాడారు. తిట్టుగా వాడాల్సిన చోట వాడటానికి కూడా వాడకూడని పదం ‘భడివే’ అని బీఆర్ఎస్ నేతలంటున్నారు. సీఎం అలా గాలిపీల్చి వదిలినంత సులువుగా అటువంటి బూతు ప్రయోగాన్ని చేస్తున్నప్పుడు సభలో ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ వవ్వుతూ తలపట్టుకున్నారు. ఆయన పక్కనే ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నవ్వుకున్నారు . ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటివి మాట్లాడటం ప్రజాస్వామ్యానికి అవమానం అని బీజేపీ, బీఆర్ఎస్ అంటున్నాయి.





















