అన్వేషించండి

Municipal Chairman, Mayor Elections: ఏ ఒక్కటీ చేజారవద్దు, అన్నీ హస్తగతం కావాలి: పార్టీ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

Telangana CM Revanth Reddy | హంగ్ మున్సిపాలిటీల్లో ఒక్కటి కూడా చేజారవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, పార్టీ కీలక నేతలకు దిశానిర్దేశం చేశారు.

హైదరాబాద్: సోమవారం (ఫిబ్రవరి 16న) జరగనున్న మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి కాంగ్రెస్ అగ్రనేతలతో కీలకమైన 'జూమ్' మీటింగ్ నిర్వహించారు. హంగ్ మున్సిపాలిటీల్లో ఒక్కటి కూడా చేజారవద్దని, అవన్నీ హస్తగతం కావాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు మరియు సీనియర్ నేతలు పాల్గొన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ముఖ్యంగా హంగ్ మున్సిపాలిటీల్లో అధికారాన్ని దక్కించుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కే అవకాశం ఉందో పార్లమెంట్ ఇన్‌ఛార్జిలను అడిగి తెలుసుకున్నారు. మేయర్ల ఎంపికలో సామాజిక సమతుల్యతను పాటించాలని, వెనుకబడిన వర్గాలకు సముచిత స్థానం కల్పించాలని సూచించారు. హంగ్ మున్సిపాలిటీల విషయంలో ఏ ఒక్కటి కూడా చేజారకూడదని, ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 68, బీఆర్ఎస్ 14 గెలుచుకోగా, 33 చోట్ల హంగ్ రావడంతో ఉత్కంఠ నెలకొంది. 7 కార్పొరేషన్లలో 4 కాంగ్రెస్‌కు, 1 బీజేపీకి దక్కగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఖాతా కూడా తెరవలేదు.

ఫిరాయింపుల ఎమ్మెల్యేల మెడకు విప్ చిచ్చు..!

మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత మేయర్లు, ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు సాంకేతికంగా ఇప్పటికీ బిఆర్ఎస్ సభ్యులేనని అసెంబ్లీ స్పీకర్ స్పష్టం చేయడంతో, ఆ పార్టీ అధిష్టానం వారిని ఇరుకున పెట్టే వ్యూహాన్ని రచించింది. మేయర్, ఛైర్మన్ ఎన్నికల్లో కీలకమైన ఎక్స్-అఫీషియో ఓట్లపై వీరందరికీ పార్టీ 'విప్' జారీ చేయాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించారు.

ఈ పరిణామం పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి 'ముందు నుయ్యి.. వెనుక గొయ్యి' అన్నట్లుగా తయారైంది. ఒకవేళ వీరు పార్టీ విప్‌ను పాటిస్తే, కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ విప్‌ను ధిక్కరించి కాంగ్రెస్‌కు ఓటు వేస్తే, పార్టీ ఆదేశాలను ఉల్లంఘించినందుకు వారిపై అనర్హత వేటు వేయడానికి బిఆర్ఎస్‌కు బలమైన చట్టపరమైన ఆధారం లభిస్తుంది.

ఫిబ్రవరి 16న జరగబోయే ఎన్నికల్లో ఈ రాజకీయ డ్రామా పరాకాష్టకు చేరనుంది. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్‌కు గడువు విధించిన తరుణంలో, ఈ విప్ ఉల్లంఘన జరిగితే ఎమ్మెల్యే పదవులకే ముప్పు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget