అన్వేషించండి

Telangana Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో మేయర్‌, ఛైర్‌పర్సన్లను ఎలా ఎప్పుడు ఎన్నుకుంటారు? 

Telangana Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికల్లో మరో కీలక ప్రక్రియ మేయర్, ఛైర్‌పర్సన్ ఎన్నిక. దీని కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మేయర్, ఛైర్పర్సన్ ఎన్నికల పరోక్ష ప్రక్రియ ఫిబ్రవరి 16న జరుగుతుంది.
  • క్యాంపు రాజకీయాలపై నిషేధం, ఎన్నికల పారదర్శకతకు వీడియో రికార్డింగ్.
  • అభ్యర్థులకు ముందస్తు సమాచారం, ప్రత్యేక సీటింగ్, చేతులెత్తే విధానంలో ఓటింగ్.
  • ఓట్లు సమానమైతే, లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.

Telangana Municipal Elections 2026: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ఓట్ లెక్కింపు ప్రక్రియ ముగిసిన, వార్డుల వారీగా విజేతలు ఎవరో తేలిపోవడంతో ఇప్పుడు అంది దృష్టి అత్యుత్తమమైన మేయర్‌, ఛైర్‌పర్సన్‌ పదవులై పడింది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలకు మేయర్లను, ఉప మేయర్లను, అలాగే 116 మున్సిపాలిటీలకు ఛైర్‌పర్శన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్‌లను ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది.  నెల 16న పరోక్ష ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. 

ఈ కీలక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యంత కఠినమైన నిబంధనలను పారదర్శకమైన విధానాలను అమలులోకి తెచ్చింది. క్షేత్రస్థాయిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ముందస్తు సమాచారం అందజేత 

ఎన్నికల ప్రక్రియలో భాగంగా, శనివారం నాడే అన్ని జిల్లాల కలెక్టర్‌లకు ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో పాల్గొనే కార్పొరేటర్లు, కౌన్సిలర్‌లతోపాటు ఎక్స్‌ అఫీషియో సభ్యులకు, సంబంధిత రాజకీయ పార్టీల అధ్యక్షులకు ముందస్తుగా సమాచారం అందించాలని కలెక్టర్లను ఆదేశించింది. ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు, లేదా ఆయన నామినేట్ చేసిన గెజిటెడ్‌ అధికారికి అప్పగించారు. 

క్యాంపు రాజకీయాలపై నిషేధం

మున్సిపల్ ఎన్నికల సమయంలో సాధారణంగా కనిపించే క్యాంపు రాజకీయాలకు చెక్‌ పెట్టేలా ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికైన ప్రతినిధులను వారి ఇష్టానికి వ్యతిరేకంగా రహస్య ప్రాంతాల్లో లేదా క్యాంపుల్లో నిర్బంధించినట్టు సమాచారం అందితే వెంటనే విచారణ జరిపి వారిని విడుదల చేయాలని పోలీసులు, రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. సభ్యులు ఎటువంటి భయబ్రాంతులకు గురి కాకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అనుకూల వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యతను కలెక్టర్లు, పోలీసు కమిషనర్లకు అప్పగించారు. ఎవరైనా తమకు ప్రాణ హాని ఉందని రక్షణ కోరితే వారికి తగిన భద్రత కల్పించాలని స్పష్టం చేశారు. 

పారదర్శకత కోసం వీడియో చిత్రీకరణ 

ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు, సమావేశ మందిరంలో జరిగే ప్రతి అంశాన్ని వీడియో చిత్రీకరించాలని నిబంధన విధించారు. జిల్లా కలెక్టర్‌ అనుమతి ఉన్న చోట ఈ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కూడా అవకాశం కల్పించారు. సమావేశ మందిరం లోపల ఓటింగ్ సరళిని ప్రభావితం చేసే ఎటువంటి ప్రయత్నాలు అనుమతించబోరు. 

సమావేశ మందిరంలో ఎవరు సీటు ఎక్కడ?

ఎన్నికలు జరిగే హాలులో గందరగోళం లేకుండా ఉండేందుకు పక్కా సీటింగ్ ప్లాన్ రూపొందించారు. వేదికపై ఎన్నికల నిర్వహణ అధికారి, పరిశీలకుడు మాత్రమే కూర్చొంటారు. ఎక్స్‌ అఫీషియో సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీల సభ్యులకు విడివిడిగా స్థలాలు కేటాయిస్తారు. స్వతంత్రులకు ప్రత్యేక సీట్లు ఉంటాయి. ప్రతి గ్రూప్‌ ముందు ఒక డిస్‌ప్లే బోర్డు ఉంటుంది. ఎవరు ఎక్కడ కూర్చోవాలో గుర్తించేలా ఏర్పాట్లు చేస్తారు. 

ఓటింగ్ విధానం ఎలా జరుగుతుంది?

ఈసారి మేయర్, ఛైర్‌పర్సన్‌ ఎన్నికను చేతులెత్తే విధానం ద్వారా నిర్వహించనున్నారు. ముందుగా మేయర్ లేదా ఛైర్‌పర్సన్ ఎన్నికల జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వైస్‌ చైర్మన్‌, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. ఒక వేళ మొదటి పదవికి ఎన్నిక పూర్తి కాకపోతే రెండో పదవికి ఎన్నిక నిర్వహించకూడదని రూల్స్‌ స్పష్టంగా చెబుతున్నాయి. పోటీ చేసే అభ్యర్థులు కచ్చితంగా సమావేశంలో ఉండాలి. తమ సమ్మతిని తెలియజేయాలి. 

ఓట్లు సమానమైతే లాటరీ ద్వారా నిర్ణయం 

ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చినట్టైతే విజేతను లాటరీ విధానంలో నిర్ణయిస్తారు. దీని కోసం ప్రత్యేక ప్రక్రియను రూపొందించారు. పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల పేర్లు తలా ఐదు కాగితపు స్లిప్పులపై రాస్తారు. ఆ స్లిప్పులన్నీ ఒకే పరిమాణం, ఒకే రంగులో ఉంటాయి. వాటిని రెండుసార్లు మడిచి, ఎవరు గుర్తు పట్టలేని విధంగా అందరి ముందు ఒక డబ్బాలో వేస్తారు. బాగా కలుపుతారు. అధికారి తీసిన మొదటి స్లిప్పులో ఎవరి పేరు ఉంటే వాళ్లే విజేత అవుతారు. 

Frequently Asked Questions

తెలంగాణలో మేయర్, ఛైర్పర్సన్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి?

రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలకు మేయర్లను, 116 మున్సిపాలిటీలకు ఛైర్పర్సన్లను ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నెల 16న ముహూర్తం ఖరారు చేసింది.

మున్సిపల్ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలపై ఎలాంటి నిషేధం ఉంది?

ఎన్నికైన ప్రతినిధులను వారి ఇష్టానికి వ్యతిరేకంగా రహస్య ప్రాంతాల్లో నిర్బంధిస్తే వెంటనే విచారణ జరిపి విడుదల చేయాలని అధికారులు ఆదేశించారు. సభ్యులు స్వేచ్ఛగా ఓటు వేయడానికి అనుకూల వాతావరణం కల్పించాలి.

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం ఏమి చేస్తున్నారు?

సమావేశ మందిరంలో జరిగే ప్రతి అంశాన్ని వీడియో చిత్రీకరిస్తారు. జిల్లా కలెక్టర్ అనుమతితో ప్రత్యక్ష ప్రసారం కూడా చేసే అవకాశం ఉంది. ఓటింగ్ సరళిని ప్రభావితం చేసే ప్రయత్నాలను అనుమతించరు.

మేయర్, ఛైర్పర్సన్ ఎన్నికల ఓటింగ్ విధానం ఏమిటి?

ఈ ఎన్నికలు చేతులెత్తే విధానం ద్వారా నిర్వహించబడతాయి. ముందుగా మేయర్ లేదా ఛైర్పర్సన్ ఎన్నిక జరుగుతుంది, ఆ తర్వాతే వైస్ ఛైర్మన్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది.

ఒకవేళ ఓట్లు సమానమైతే విజేతను ఎలా నిర్ణయిస్తారు?

ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే, లాటరీ విధానంలో విజేతను నిర్ణయిస్తారు. అభ్యర్థుల పేర్లతో స్లిప్పులు తీసి, డబ్బాలో వేసి తీసిన మొదటి స్లిప్పులో ఎవరి పేరు వస్తే వాళ్లే విజేత అవుతారు.

టాప్ హెడ్ లైన్స్

Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget